Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pelli SandaD (2021)




చిత్రం: పెళ్లి సందD (2021) సంగీతం: యం. యం. కీరవాణి నటీనటులు: రోషన్ , శ్రీలీల దర్శకత్వం: గౌరీ రోనంకి నిర్మాత, దర్శకత్వ పర్యేక్షణ: కె. రాఘవేంద్ర రావు విడుదల తేది: 2021



Songs List:



ప్రేమంటే ఏంటీ? పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరణ్, శ్వేతా పండిట్

నువ్వంటే నాకు - ధైర్యం
నేనంటే నీకు - సర్వం
నీకు నాకు - ప్రేమా
ప్రేమంటే ఏంటీ?

చల్లగా అల్లుకుంటది
మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

మరి నువ్వంటే నాకు - ప్రాణం
నేనంటే నీకు - లోకం
నీకు నాకు - ప్రేమా
ప్రేమంటే ఏంటీ?

చల్లగా అల్లుకుంటది
మెల్లగా గిల్లుతుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

హో హోహో హోహో హోహో హో
హో హోహో హోహో హోహో హో

తనువు తనువున తీయదనమే నింపుతుంటది
పలుకు పలుకున చిలిపిదనమే చిలుకుతుంటది
కొత్తంగా కొంగొత్తంగా ప్రతీ పనినే చేయమంటది
ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది

ఇంకా ఏమేమ్ చేస్తుంది..!!

పులిలా పొంచి ఉంటది
పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

పులిలా పొంచి ఉంటది
పిల్లిలా చేరుకుంటది
వెళ్ళనే వెళ్ళనంటది
విడిపోనంటుంది

నువ్వంటే నాకు -  హ్మ్ మ్
నేనంటే నీకు - హ ఆ ఆఆ
నీకు నాకు - ప్రేమా
ప్రేమంటే ఏంటీ?




బుజ్జులు బుజ్జులు పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: బాబా షెహగాల్, మంగ్లీ

పాలకుండ నెత్తినెట్టి పంజాగుట్ట పోతావుంటే
బోరబండ పోరగాడు రాయిపెట్టి కొట్టినాడు
రాయిపెట్టి కొట్టినాడు రాయిపెట్టి కొట్టినాడు
కుండపాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు
చిల్లుపడ్డ కుండతోటి ఇంటికెట్ట పోనురా
పోరాడా నీ మీద కోపమొచ్చేరా కోపమొచ్చేరా

నీ బుంగమూతి సూడనీకి రాయితోటి కొట్టినా
కంటి ఎరుపు సూడనీకి కుండ పగలగొట్టినా
అలకనీది సూడనీకి అల్లరెంతో జెసినా

బుజ్జులు బుజ్జులు బుజ్జులూ
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొనిపెడతా బంగరు గజ్జెలు
హెయ్ బుజ్జులు బుజ్జులు బుజ్జులు
తినిపిస్తా తీయని ముంజులు
గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
హెయ్ గోస తీరిపోయేలాగా గుమ్మరిస్తా
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు

బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కట్టుకుంటా బంగరు గజ్జెలు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
కొరికి తింటా తియ్యని ముంజులు
గోస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నా గోస తీరిపోయేలాగా తీసుకుంటా
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు
నీ ఘాటు ఘాటు నాటు నాటు ముద్దులు

చమ్కీలు కొననీకి ఛార్మినారు పోతావుంటే
అఫ్జల్ గంజ్ కాడ అడ్డమొచ్చినవ్ ఆహ
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ - బేబీ బేబీ ఆ

మీద జల్లినవ్ ఆహ మీద జల్లినవ్
బుగ్గ మీద జల్లినవ్
బుక్కా గులాల్ బుగ్గ మీద జల్లినవ్ ఆహ
రంగు జూసి మా అయ్య రంకెలేస్తడు
మచ్చ జూసి మా అమ్మ రచ్చ చేస్తది
పోరడా నీతోటి పీకులాటరా హా హా హా ఆ

మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటవ్
అయ్యంటే వనుకంటవ్ నన్ను చూస్తే కులుకంటవ్ 

మీ అమ్మంటే భయమంటవ్ నేనంటే ప్రేమంటవ్
అయ్యంటే వనుకంటవ్ నన్ను చూస్తే కులుకంటవ్ 

అందరికంటే నేను ఇష్టమంటవ్
ఇష్టమంటవ్ ఇష్టమంటవ్
ఆ ముచ్చటంత లోలోనే దాచుకుంటవ్

బుజ్జులు బుజ్జులు బుజ్జులూ
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
తొడిగేస్తా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టేస్తా కాలికి మెట్టెలు
అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
కట్టివేస్తా మెడలో పుస్తెలు
హేయ్, అడ్డు ఎవ్వడొచ్చి నన్ను ఆపుతున్నా
కట్టివేస్తా మేడలో పుస్తెలు
కట్టివేస్తా మేడలో పుస్తెలు

బుజ్జులు బుజ్జులు బుజ్జులు
అందుకుంటా రవ్వల గాజులు
బుజ్జులు బుజ్జులు బుజ్జులు
పెట్టుకుంటా కాలికి మెట్టెలు
అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
కట్టమంటా మెడలో పుస్తెలు
అడ్డమెవ్వడొచ్చి మననాపుతున్నా
కట్టమంటా మెడలో పుస్తెలు
అయిపోదాం ఆలుమొగలు

హో భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
భల్లె భల్లె భల్లె భల్లె బుజ్జులు
హో భల్లె హో భల్లె భల్లె భల్లె బుజ్జులు
భల్లె హ భల్లె హ భల్లె భల్లె బుజ్జులూ వావ్




పెళ్లి సందD పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర , దీపు, రమ్యా బెహ్రా

పట్టు చీరల తళతలలు…పట్టగొలుసులా గలగలలు
పట్టు చీరల తళతలలు…పట్టగొలుసులా గలగలలు
పులా చొక్కలా రెపరెపలు…సిల్కు పంచలా టపటపలు
కాసుల పేరులా ధగధగలు…కాఫి గలాసుల భుగభుగలు
మామిడాకుల మిలమిలలు…కొబ్బరాకులా కళకళలు
గట్టి మేళాల ఢమఢమలు…డమ్మా డమ్మా ఢమఢమలు
గట్టి మేళాల ఢమఢమలు…వంటశాలలో ఘుమఘుమలు
అన్ని అన్ని అన్ని అన్నిఅన్ని కలిపితే

పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD

మహిళా మణుల చింత పిక్కలు
అబ్బో పుణ్య పురుషుల పేక ముక్కలు
బావమరుదల పరిహాసాలు
పాత మిత్రుల పలకరింపులు
అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు
అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు
అత్త మామలా ఆత్మీయతలు
తాత బామ్మల ఆశీస్సులు
అందరు చల్లే అక్షింతలు
అమ్మ నాన్నల అమ్మ నాన్నల తడి కన్నులు
కన్నె పిల్లలా కొంటె నవ్వులు
కుర్ర కన్నుల దొంగ చూపులు
అందగత్తెల చిలిపి సైగలు
కోడి గిత్తలా చురుకు చేష్టలు
చెవులలో ఊగేను జూకాలు
మోగించెను మదిలో బాకాలు
ముక్కుపుడకలు మిరుమిట్లు
పెదవేరుపులు పెంచెను పదిరెట్లు
ఆ… ఆ… ఆ… ఆ…

పచ్చని ఓణి అందాలు…నచ్చినయా పరువాలు
ఒప్పుకుంటే అదే పదివేలు…ఆహాలు యమ ఓహోలు
ఎవడికి తెలియని సంగతులు…ఎరగా విసిరే బిస్కట్లు
ఎంత పొగిడిన మీ కథలు…ఆశలు దోశలు అప్పడాలు
చల్ రే చల్

పెళ్లి సందడి పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD
పిపి పిపి పిపి పిపి పెళ్లి సందD
డు డుం డు డుం డు డుం పెళ్లి సందD





మధురా నగరిలో పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీనిధి, నయన నాయర్, క;కాలభైరవ

మధురా నగరిలో యమునా తటిలో
మురళీ స్వరములే… ముసిరిన యదలో
కురిసెనంట మురిపాల వాన
లయలై హొయలై… జలజల జతులై
ఆఆ ఆఆ ఆఆ ఆ… గలగల గతులై, ఆఆ ఆఆ
వలపుల శ్రుతులై… వయసుల ఆత్రుతలై

దొరక్క దొరక్క దొరికిందీ
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో… ఓ ఓ ఓ ఓఓఓ ఓ
మధురా నగరిలో… యమునా తటిలో, ఓ ఓ
మురళీ స్వరములే… ముసిరిన యదలో, ఓ ఓ


చెంతకొచ్చెయ్యగానే
చెమక్కు చెమక్కు చురుక్కు చురుక్కు
చటుక్కు చటుక్కు చిటుక్కులే

చెయ్యి పట్టెయ్యగానే
తడక్కు తడక్కు దినక్కు దినక్కు
ఉడుక్కు ఉడుక్కు దుడుక్కులే

నువ్వులేక చందమామ చిన్నబోయే
నిన్ను చేరి వెన్నెలంత వెల్లువాయే
నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే
నిన్ను తాకి పూల గుట్టు తేలికాయే
ఈ మాటకే ఈరోజుకే… ఇన్నాళ్ళు వేచానే

దొరక్క దొరక్క దొరికిందీ
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి  నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో… ఓ ఓ ఓ ఓఓఓ ఓ
మధురా నగరిలో… యమునా తటిలో, ఓ ఓ
మురళీ స్వరములే… ముసిరిన యదలో, ఓ ఓ



గంధర్వ లోకాల పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి సందD (2021)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర , రమ్యా బెహ్రా

గంధర్వ లోకాల… సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల… లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో

ఆనంద క్షేత్రాల… అపరంజి పుష్పాన్నివో
ఎవరివో ఎవరివో
అందాల ఆలయంలో… ప్రాణ శిల్పానివో
ఎవరివో ఎవరివో

ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఎవరివో ఎవరివో… ఎవరివో హో హో

తడిపొడి అందాల నాట్యశాలవో, ఓ ఓఓ ఓ హో
కులుకుల పరువాల కళాశాలవో, ఓ ఓ ఓఓ
పెదవుల అమృతాన పానశాలవో, ఓ ఓఓ ఓ హో
చెదరని సౌఖ్యాల స్వర్గశాలవో

అలజడులాడవిలోన తప్పిపోయిన నన్ను
పిలిచేటి పర్ణశాలవో
ఆ నింగికి ఈ నేలకి ఉయ్యాల కట్టిసి
ఊగేటి ఊగేటి మేఘమాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో
ఊగేటి ఊగేటి పూల బాలవో
ఇంతకీ నువ్వు ఎవరివో ఎవరివో

గంధర్వ లోకాల… సౌందర్య రాగానివో
ఎవరివో ఎవరివో
శృంగార కావ్యాల… లావణ్య తేజానివో
ఎవరివో ఎవరివో, హో ఓఓ ఓ ఓ




# పాట సాహిత్యం

 
Song Details

No comments

Most Recent

Default