చిత్రం: యోగి వేమన (1947)
సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు
నటీనటులు: చిత్తూర్ వి. నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, ఎం. వి. రాజమ్మ, పార్వతి భాయి
దర్శకత్వం: కె. వి. రెడ్డి
నిర్మాణ సంస్థ: వాహిని స్టూడియోస్
విడుదల తేది: 10.04.1947
మనసా మాయను పడకే పాట సాహిత్యం
చిత్రం: యోగి వేమన (1947)
సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం:
మనసా మాయను పడకే
మాయను పడకే మనసా
కాయము, కలిమి సతమని నమ్మి
మాయను పడకే మనసా
మాయను పడకే మనసా
పాయసంబుతో పెంచిన గానీ
పాతరలో రక్షించిన గానీ
కాయము, కలిమి పోయేవేలే
చేసిన పుణ్యమే చెడని పథార్థము
మాయను పడకే మనసా
నెరమెచ్చులకై చేసిన దానము
పరమునకేమి కొరగాదే
కరుణతోడే నిరుపేదకు వేసిన తిరిపెమే
ఇహపర సాధనమే ఆ తిరిపెమే ఇహ పర సాధనమే
మాయను పడకే మనసా
ఆశ పెంచి ఇల్లాలని, సుతుడని దాసిని పడకే మనసా
ఆశ పెంచి ఇల్లాలని, సుతుడని దాసిని పడకే మనసా
మోసపోకు మీ వ్యామోహముతో
మోసపోకు మీ వ్యామోహముతో
చేసిన పుణ్యమే చెడని పథార్థము
చేసిన పుణ్యమే చెడని పథార్థము
మాయను పడకే మనసా
మాయను పడకే మనసా
ఇదేనా ఇంతేనా పాట సాహిత్యం
చిత్రం: యోగి వేమన (1947)
సంగీతం: చిత్తూర్ వి. నాగయ్య, ఓగిరాల రామచంద్ర రావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్యులు
గానం: చిత్తూర్ వి. నాగయ్య
ఇదేనా ఇంతేనా జీవితసారమిదేనా
అంతులేని ఈ జీవన వైభవమంతయు తుదకు నశించుటకేనా
ఇదేనా ఇంతేనా
బోసి నవ్వులను కువ్వలు బోసే
పసి పాపాల బతుకు ఇంతేనా
జీవితా సారమిదేనా
ఆట పాటల నలరించుచూ
సెలయేటి వోలె వెలివారే బ్రతుకు ఇదేనా ఇంతేనా
కిలకిల నవ్వుచు తొలకరి వలపుల
ఉలకవోయు జవరాలి వయ్యారమా ఇదేనా ఇంతేనా
దాసుకున్న వయసంతయు మగనికి దోచి సు
ఇల్లాలి గతి ఇదేనా ఇంతేనా
పురిటి పాప చిరు పెదవుల తాకునా
మురిసిపోవు బాలింత బ్రతుకు ఇదేనా ఇంతేనా
తన బలగము ధనధాన్యములను గని
తనిసే ముదుసలి ఏ రాశఫలము
ఇదేనా ఇంతేనా
సకల శాస్త్రములు పారచదివినా
అఖిలా దేశముల ఆక్రమించినా
కట్టకడకు ఈ కాయము విడచి
మట్టిగలిసి పోవలెనా మట్టిగలిసి పోవలెనా
Note: These Lyrics were Donated by Ranastula Ravi
No comments
Post a Comment