చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, విజయ నిర్మల, చంద్రకళ దర్శకత్వం: వి. మధుసూదనరావు నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు బ్యానర్: శ్రీ సారథి స్టూడియోస్ విడుదల తేది: 17.07.1969
Songs List:
అన్నయ్య కలలే పండెను పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, సుశీల అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను బంగారుకాంతులేవొ నేడే తొంగి చూసేను తోడు నీడా నీవై లాలించే అన్నయ్యా తల్లిదండ్రీ నీవై పాలించే అన్నయ్యా నీకన్న వేరే పెన్నిధి లేనే లేదు నా పూర్వ పుణ్యాల రూపమే నీవు అన్నయ్య రతనాల సుగుణాల రాశివి నీవే అన్నయ్య నయనాల ఆశవు నీవే నీవు మెట్టినయిల్లు నిత్యము విలసిల్లు నీ నవ్వు సిరులొల్కు ముత్యాల జల్లు అన్నయ్య మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను చెల్లి కంటతడివుంటే తల్లడిల్లేను నీ పూజలేనన్ను నడిపించు తల్లీ శతకోటి విజయాలు సాధింతు చెల్లి అన్నయ్య
ఈ రోజుల్లో పడుచువారు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, సుశీల ఈరోజులో పడుచువారు గడుసువారు వీలైతే హుషారు కాకుంటే కంగారు ఈ రోజుల్లో తాజా తాజా మోజులకోసం తహతహలాడుతువుంటారు పొట్టి షర్టతో టైటు పాంట్లతో లొట్టిపిట్టలవుతుంటారు మెప్పులకోసం అప్పులు చేసి తిప్పలపాలవుతుంటారు ఈ రోజుల్లో రోడ్డు సైడున రోమియోలలా రోజంతా బీచేస్తారు సొగసరి చిన్నది కంటపడిందా చూపులతో మింగేస్తారు ఆ చిన్నదికాస్తా చేయివిసిరితే చెప్పకుండా చెక్కేస్తారు పాఠాలకు ఎగనామంబెట్టి మ్యాటినీ షో లకు తయ్యారు పార్టీ లంటూ పిక్నిక్ లంటూ పుణ్యకాలమూ గడిపేరు పరీక్ష రోజులు ముంచుకురాగా తిరుపతి ముడుపులు కడతారు ఈ రోజుల్లో .... పడుచువారు గడుసు వారు సహనంలో కిసానులు సమరంలో జవానులు ఆడపిల్లలను గౌరవించితే ఆత్మ గౌరవం పెరిగేను సమరస భావం కలిగిననాడే చదువుల విలువలు పెరిగేను దేశానికి వెన్నెముకలు మీరు దివాళకోరులు కావద్దు భవితవ్యానికి బాటలు వేసే భారం మనదని మరవొద్దు ఆ భారం మనదని మరవొద్దు
మదిలో వీణలు మ్రోగే పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం: సుశీల మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నో చెలరేగె కలనైనకనని ఆనందం యిలలోన విరిసె ఈనాడె సిగుచాటున నా లేతవలపు మొగ్గతొడిగింది పాలవెన్నెల స్నానాలు చేసి పూలు పూచింది మదిలోని కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుగోరేను అందాల తారయె మెరిసి చెలికాని చెంతచేరేను మదిలోని రాధలోని అనురాగమంతా మాధవుని చేలే వేణులోలుని రాగాల కోసం వేచియున్నదిలే మదిలోని
ఓ చామంతి ఏమిటే పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల ఓ... చామంతి ఏమిటే యీ వింత ఈ చినవానికి కలిగెనేల గిలిగింత లేనిపులకింత ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి... జరిగింది యీ చిలకమ్మకు నాకు వరసకుదిరింది వలపు పెరిగింది ఇన్నాళ్ళు యీ వలపే యేమాయె నీ కన్నుల్లో యీ మెరుపే కరువాయె ఇన్నాళ్ళు నీ హొయలు చూశాను నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను ఓ.... చామంతి దూరాల గగనాల నీ మేడ.... నీ దొరసాని ననుకోరి దిగినావా నీ మనసే పానుపుగా తలచేను నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను
అమ్మ బాబో నమ్మరాదు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, సుశీల అమ్మబాబో నమ్మరాదూ ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదూ ప్రేమించామంటారు పెద్దగ చెబుతుంటారు పెళ్ళిమాట ఎత్తగానె చల్లగ దిగజార తారు చిన్నారి అమ్మ బాబో నమ్మరాదూ యీ వగలమారి అమ్మాయిల నమ్మరాదూ ! డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కునపట్టేస్తారు లవ్ మ్యారేజీ అంటూ లగ్నం పెట్టిస్తారు కట్నాలు పెరుగునని కాలేజికెళతారు హాజరుపట్టీ వేసి గైరుహాజరౌతారు మార్కులకోసం తండ్రుల తీర్థయాత్ర తిప్పుతారు ఇంజనీర్లు డాక్టర్లయి యిక చూస్కోమంటారు వరండాలలోనజేరి వాల్చూపులు విసురుతారు సినిమాలు షికార్లంటు స్నేహం పెంచేస్తారు తళుకుబెళుకు కులుకులతో పెటచెంగు రాపులతో చిటికెలోన అబ్బాయిల చెంగున ముడి వేస్తారు ఆస్తివున్న పిల్లయితే అందంజోలికి పోరు కుంటిదైన కురూ పైన పెళ్ళికి యస్సంటారు పెళ్ళియైన మర్నాడే శ్రీవారిని చేత బట్టి అత్తామామల దయచేయండంటారు దిమ్మ దిరిగి ఏమిటలా తెల్ల మొగం వేస్తావు వలపు దాచుకొని ఎందుకు మాటలు దులిపేస్తావు మనసు మనసు తెలుసుకుందామూ ఇకనైనా జలసాగ కలిసి ఉందాము
స్వాగతం ఓహో చిలిపి పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: సుశీల స్వాగతం ఓహో చిలిపినవ్వుల శ్రీవారు సోగ కన్నులు సైగచేస్తే ఆగలేని దొరగారు కొంగు తగిలిందా పొంగిపోతారు కోరరమ్మంటే బిగిసిపోతారు ఎందుకో ఎందుకో యీ బింకము అలిగిన కొలది అందము అబ్బాయిగారి కోపము పిలిచిన ప్రేయసికి యిదేనా కానుక మీ కానుక బెట్టుచాలును దొరగారు అందమంతా విందుచేస్తే అదిరి పడ్తారేం పొందుగోరి చెంతచేరా బెదిరి పోతారేం సరసమో విరసమో ఈ మౌనము అందిన చిన్నది చులకన అందని దెంతో తీయన అవతల పెట్టండీ తమాషా పోజులు మహరాజులు అధిక చక్కని దొరగారు
చిలిపి నవ్వుల పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: దాశరధి గానం:యస్.పి.బాలు, సుశీల చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను చూపుల శృంగార మొలికించినావు మాటల మధువెంతో చిలికించినావు వాడని అందాల వీడని బంధాల తోడుగ నడిచేములే చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే నేను నీదాననే - నీవు నావాడవే నను వీడి పోలేవులే కన్నుల ఉయ్యాల లూగింతునోయి చూడని స్వర్గాలు చూపింతునోయి తీయని సరసాల తీరని సరదాల హాయిగ తేలేములే ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్ను నే చేరుకున్నాను
ఏం పిల్లో తత్తర పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం నాగేశ్వరరావు పల్లవి: ఏం పిల్లో తత్తర బిత్తర గున్నావు ఎందుకో గాభర గీభర తిన్నావు చిలిపి నవ్వులతొ కవ్వించు మోము చిన్నబోయింది ఈనాడదేమో చరణం : 1 అందని కొమ్మలకు నిచ్చెన వేశావు అయ్యొ గాలిలోన మేడలు కట్టావు వలచిన పేదవాణ్ణి చులకన చేశావు బులుపేగాని వలపేలేని టక్కరి వాళ్ళ నమ్మి చిక్కుల పాలైనావు చరణం: 2 నీ ఒయ్యారపు వాలు చూపులతొ ముసలివాణ్ణి వూరిస్తున్నావు పడుచువాణ్ణి చేసేస్తున్నావు బంగరు బొమ్మా పలుకవటమ్మా మోజు దీర్సవే ముద్దులగుమ్మా చరణం: 3 నీపై కన్నేసి వేషాలేశాను మెత్తని నీ మనసు గాయం చేశాను చేసిన తప్పులకు చెంపలేసుకుంటాను నువు దయజూపితే నను పెళ్ళాడితే నిందలు వేసినాళ్ళ నోళ్ళు బందుచేస్తాను
కళ్ళలో పెళ్లి పందిరి పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం: శ్రీ శ్రీ గానం: ఘంటసాల, సుశీల కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగె పల్లకీలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగె పల్లకీలోన వూరేగే ముహూర్తం మదిలో కదలాడే నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణీ పదములతో పెదవి పై మెదిలే నగవులతో వధువు నను ఓరగ చూస్తూంటే జీవితాన... పూలవాన... కళ్ళలో సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి మనసైన వరుడు దరిజేరి మెడలోన తాళీకడుతుంటే జీవితాన... పూలవాన... వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలియించి లోకమే వెన్నెల వెలుగైతే భావియే నందనవనమైతే జీవితాన పూలవాన కళ్ళలో
No comments
Post a Comment