Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Premabhishekam (1981)





చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వరరావు అక్కినేని, శ్రీదేవి, జయసుధ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
విడుదల తేది: 16.02.1981



Songs List:



నా కళ్ళు చెబుతున్నాయి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ

ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ
ప్రేమా పెళ్ళి జంటనీ
నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని

తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ
నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోందీ ...

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని



దేవి మౌనమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
 
దేవీ మౌనమా - శ్రీదేవీ మౌనమా 
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పై
దేవీ మౌనమా - శ్రీదేవీ మౌనమా 

మౌన భంగము మౌన భంగము...
భరియించదు ఈ దేవిహృదయము 
ప్రేమపాఠము ప్రేమ పాఠము...
వినకూడదు ఇది పూజాసమయము 

దేవి హృదయము విశాలము
భక్తునికది కైలాసము 
కోరిక కోరుట భక్తుని వంతు 
అడగక తీర్పుట దేవత వంతు 

ధూపం వేయుట భ కుని వంతు 
పాపంమోయుట దేవునివంతు 
పాపానికి మోక్షం ధూపదర్శనం 
ఈ ప్రాణికి మోక్షం నామస్మరణం నీనామస్మరణం 

దేవీ దేవీ దేవీ దేవీ
దేవీ కోపమా - శ్రీదేవీ కోపమా 
నీకె జపించి జపించి తపించి తపించు భక్తుని పై
దేవీ కోపమా - శ్రీ దేవీ కోపమా 

స్వామి విరహము అహోరాత్రము 
చూడలేదు దేవి హృదయము 
దేవీస్తోత్రము నిత్యకృత్యము 
సాగనివ్వదు మౌనవ్రతము

స్వామి హృదయము ఆకాశము 
దేవికి మాత్రమే అవకాశము 
అర్చన చేయుట దాసుని వంతు 
అనుగ్రహించుట దేవత వంతు 

కోపం తాపం మాజన్మ హక్కు
పుష్పం పత్రం అర్పించి మొక్కు 
నాహృదయం ఒక పూజా పుష్పం... 
నా అనురాగం ఒక ప్రేమపత్రం 




ఒక దేవుడి గుడిలో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
 
మరులు పూచిన పూలపందిరిలో
మమతలల్లిన ప్రేమ సుందరికీ
పట్టాభిషేకం  పట్టాభిషేకం
మనసు విరిచినా మనసు మరువనీ
మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం మంత్రాభిషేకం
రాగాల సిగలో  అనురాగాల గుడిలో
భావాలబడిలో అనుభవాల ఒడిలో
వెలసిన రాగదేవతా  రాగాభిషేకం
వెలసిన ప్రేమవిజేతా  ప్రేమాభిషేకం 

ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
 
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం 
  
ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం

కలలచాటున పెళ్ళిపల్లకిలో
కదలివచ్చిన పెళ్ళికూతురికీ
పుష్పాభిషేకం  పుష్పాభిషేకం
పాట మారినా  పల్లవి మార్చనీ
ప్రణయలోకపు ప్రేమమూర్తికి
స్వర్ణాభిషేకం స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో  స్వర్గాల బాటలో
బంగారు తోటలో  రతనాల కొమ్మకు
విరిసిన స్వప్న సుందరీ  క్షీరాభిషేకం
కొలిచినప్రేమ పూజారీ అమృతాభిషేకం
 
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
 
ఒక దేవత గుడిలో ఒక దేవుడి ఒడిలో 
నిదురించే అనురాగం  కురిపించే అభిషేకం
 
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం  ప్రేమకు పట్టాభిషేకం





కోటప్ప కొండకు వస్తానని పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే
కన్ను కన్ను కలిపేస్తే

నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

ఆహాహా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

హలో...
హలో...
హలో...
హలో...
హలో...హలో...
మ్..
హలో...
మ్..

హలో హలో అనమంటుంది కుర్రమనసు
చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు
పొమ్మని పైపైకి అంటుంది
రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని పైపైకి అంటుంది
రమ్మని లోలోన ఉంటుంది
పొమ్మని రమ్మంటే అది స్వర్గం
రమ్మని పొమ్మంటే అది నరకం

ఆ స్వర్గంలోనే తేలిపోవాలి
ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి
ఔనంటే నువ్వు ఊ... అంటే
అహ. ఔనంటే నువ్వు ఊ... అంటే
నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆహా కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం
పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం
కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము
కళ్లు కుట్టుకుంటే గుణపాఠము
కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి
ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి
ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి
ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి
ఔనంటే నువ్వు ఊ... అంటే
ఆ ఔనంటే నువ్వు ఊ... అంటే
నూటొక్క టెంకాయ కొడతానని

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో
కన్నెపిల్ల కనిపిస్తే
కన్ను కన్ను కలిపేస్తే
నూటొక్క టెంకాయ కొడతానని
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
హేహే కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా





తారలు దిగివచ్చిన వేళ...పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు

తారలు దిగివచ్చిన వేళ.....
మల్లెలు నడిచొచ్చిన వేళ.....
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...

ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోనా కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
నిలిచిపొమ్మనీ మబ్బుగా... కురిసిపొమ్మనీ వానగా...
విరిసిపొమ్మనీ వెన్నెలగా... మిగిలిపొమ్మనీ నా గుండెగా...
మిగిలిపొమ్మనీ... నా గుండెగా...

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...

నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
చెప్పిపొమ్మనీ మాటగా... చేసిపొమ్మనీ బాసగా...
చూపిపొమ్మనీ బాటగా... ఇచ్చిపొమ్మనీ ముద్దుగా...
ఇచ్చిపొమ్మనీ... ముద్దుగా

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...




వందనం అభివందనం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు

వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ
పదాభివందనం పదాభివందనం

చరణం: 1
కన్నుల పొడిచిన చీకటిలో
అరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని
తలుపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారిక అభిసారిక... సారీ...

చరణం: 2
జీవితమన్నది మూడునాళ్ళని
యవ్వనమన్నది తిరిగిరాదని
ప్రేమన్నది ఒక నటనమనీ...
నీకంటూ ఎవరున్నారని
ఉన్నారని ఎవరున్నారని
ఉన్నానని నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి
సుఖము పోసిన మేనక అభినయ మేనక... సారీ...



ఆగదు ఆగదు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్. పి. బాలు

పల్లవి: 
ఆగదూ... ఆగదూ... ఆగదు 
ఆగదు ఏ నిముషము నీ కోసము 
అగితే సాగదు యీ లోకము 
ముందుకు సాగదు యీ లోకము 

ఆగదూ ఆగదూ ఆగితే సాగదూ 

చరణం 1
జాబిలి చల్లననీ వెన్నెలదీపమనీ 
తెలిసినా గ్రహణము రాక ఆగదూ 
పూవులు లలితమనీ తాకితే రాలుననీ... 
తెలిసినా పెనుగాలి రాక ఆగదూ 
హృదయం అద్దమనీ పగిలితే అతకదనీ 
తెలిసినా... మృత్యువు రాక ఆగదూ 
మృత్యువూ రాక ఆగదూ 

చరణం: 2
జీవిత మొక పయనమనీ - గమ్యము తెలియదనీ 
తెలిసినా ఈ మనిషి పయనమాగదు 
జననం ధర్మమనీ మరణం ఖర్మమనీ 
తెలిసినా జనన మరణ చక్రమాగదు 
మరణం తధ్యమనీ ఏ జీవికీ తప్పదనీ 
తెలిసినా... ఈ మనిషి తపన ఆగదు 
ఈ బతుకు తపన ఆగదు 

చరణం: 3
మనసు మనసు కలయికలో ఉదయించక ఆగదు ఆనురాగం 
అనురాగపు అర్పణలో జనియించక మానదు త్యాగం 
ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం 
గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం 

No comments

Most Recent

Default