చిత్రం: నీ ప్రేమకై (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ నటీనటులు: వినీత్, అబ్బాస్, లయ, సోనియా అగర్వాల్ దర్శకత్వం: ముప్పలనేని శివ నిర్మాత: దగ్గుబాటి రామానాయుడు విడుదల తేది: 01.03.2002
Songs List:
వెండి మబ్బుల పల్లకిలో పాట సాహిత్యం
చిత్రం: నీ ప్రేమకై (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సామవేదం షణ్ముక శర్మ గానం: రాజేష్, చిత్ర వెండి మబ్బుల పల్లకిలో
కలలు కన్నా నీకై పాట సాహిత్యం
చిత్రం: నీ ప్రేమకై (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: కులశేఖర్ గానం: సంజయ్, శ్రీలేఖ పార్ధసారధి కలలు కన్నా నీకై
ఓ..ప్రేమా..స్వాగతం... పాట సాహిత్యం
చిత్రం: నీ ప్రేమకై (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: రాజేష్, చిత్ర పల్లవి: ఓ..ప్రేమా..స్వాగతం...నీతోనే జీవితం.. ఓ..ప్రేమా..స్వాగతం...నీతోనే జీవితం.. అతిథి లాగా వచ్చేసావూ... మనసు నాకు ఇచ్చేసావూ.. ఇలా..నన్ను వీడకా..వుంటేచాలూ..తోడుగా... నన్నే..నీవు చేరగ...నింగినేల వేడుకా..... ఓ..ప్రేమా..... చరణం: 1 ఇన్నాళ్ళుగా..లేదేమరీ...ఈరోజే ఏమైనదీ... నా గుండేపై నీ సంతకం ఎలాగా..చేరినదీ... ఇంతేమరీ నీవన్నదీ...వెన్నెల్లో గోదావరీ.. అంతేమరీ ప్రేమన్నదీ ..చిత్రాలే చేసినదీ.. నీ చూపే తాకెనుగా..వెలుగుల తొలి పున్నమిలా.. నీ చూపే తాకెనుగా..వెలుగుల తొలి పున్నమిలా పల్లవించు ప్రా..యం అందించమంది సా..యం ఓ..ప్రేమా స్వాగతం... మది నీకే అంకితం... చరణం: 2 నీ రాకనే కోరందిలే..నూరేళ్ళ నా జీవితం.. ఊరించక అందంచవా..లేలేత నీ అధరం.. వాసంతమే..నాసొంతమా..అంటుంది నీ పరిచయం నీద్యాసలో..వున్నానుగా నీతలపే అతి మదురం... జేగంటే మోగెనుగా..శుభమస్తను దీవెనగా జేగంటే మోగెనుగా..శుభమస్తను దీవెనగా హాయీ...రాగమేదో..మనసంత నిండిపోగా.. ఓ..ప్రేమా స్వాగతం... మది నీకే అంకితం... ఓ..ప్రేమా..స్వాగతం...నీతోనే జీవితం.. అతిథి లాగా వచ్చేసావూ... మనసు నాకు ఇచ్చేసావూ.. ఇలా..నన్ను వీడకా..వుంటేచాలూ..తోడుగా... నన్నే..నీవు చేరగ...నింగినేల వేడుకా..... ఓ..ప్రేమా ఓ..ప్రేమా ఓ..ప్రేమా ఓ..ప్రేమా
కోటి తారలా పాట సాహిత్యం
చిత్రం: నీ ప్రేమకై (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: కులశేఖర్ గానం: రాజేష్, ఉష కోటి తారలా
మనసన్నదే లేదు పాట సాహిత్యం
చిత్రం: నీ ప్రేమకై (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: కలువ కృష్ణ సాయి గానం: యస్.పి.బాలు మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు పైనుండి పాలించు ఓ దైవమా విధి రాత ఎదకోత నీ నైజమా ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మ ఇది నీకు తుదిలేని చదరంగమా నీ ప్రాణమే చెలిగా భావించి నీవు నీ గుండెలో తనను కొలువుంచినావు ఆ ప్రేమనే తెలుసుకోలేని తాను ఎంచేతనో తుదకు బలి చేసే నిన్ను లోకాన నిజమైన ప్రేమన్నది చూసేందుకే జాడ కరువైనది నీ ప్రేమ నిజమైతే నెగ్గేది నీవే ఈ మాట ఇకపైన నమ్మాలి నువ్వే మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు స్నేహానికే విలువ మారింది నేడు నీ మంచికి జరిగే ఎనలేని కీడు ద్రోహానికే కలదు లోకాన పేరు స్వార్థానిదే గెలుపు ఇది నేటి తీరు కన్నీట బరువైన నీ కళ్ళతో ఈ మౌన పోరాటమెన్నాళ్ళులే నీదన్నదేనాడు చేజారిపోదు లేదంటే అది నీకు దక్కేది కాదు మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు ఎదురీత రాశాడు నీ జన్మకు పైనుండి పాలించు ఓ దైవమా విధి రాత ఎదకోత నీ నైజమా ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మ ఇది నీకు తుదిలేని చదరంగమా
మందాకినీ మందాకిని పాట సాహిత్యం
చిత్రం: నీ ప్రేమకై (2002) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: భువనచంద్ర గానం: రాజేష్, చిత్ర మందాకినీ మందాకిని
No comments
Post a Comment