Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nindu Manishi (1978)





చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: శోభన్ బాబు, జయచిత్ర 
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: యస్.డి.లాల్
నిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 26.01.1978



Songs List:



రామయ్య రామయ్య రారో పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల అండ్ కోరస్

పల్లవి:
రామయ్య రామయ్య రారో
రాతిరి ఎత్తకపోరో
ఆకులు వక్కలు తేరో
నోరంత పండించు కోరో
ఆ ఎర్ర రంగే నా ఎర్రి సెప్పేను మామో

||రామయ్య||

చరణం: 1
నాగులేటి గట్టుమీద నాగమల్లి సెట్టుకాడ
సైగలు చేశావురో సన్నగ నవ్వావురో
మంగళారం మాపటేల సెరువులోన తానమాడ
సీరెత్తు కెళ్ళావురో నా సిగ్గంత దోశావురో
ఆనాటినుంచి ఈనాటిదాకా
ఆనాటినుంచి ఈనాటిదాకా
ఎన్నెన్ని ఎన్నెన్ని ఎన్నెన్ని చేశావు మామో

||రామయ్య||

చరణం: 2
కందిరీగ నడువుదాన్ని కలవరేకుల కళ్ళదాన్ని
కవ్వించి పోయావురో నిన్ను కలుసుకోమన్నావురో
అంటుమామిడి తోటలోన అంటకాగి జంటకూడి
ఆశలు రేపావురో ఏమో బాసలు చేశావురో
నీ మాట నమ్మా నే కాసుకున్నా
నీ మాట నమ్మా నే కాసుకున్నా
రాకుంటే రానంటే నే సచ్చిపోతా మామో

||రామయ్య||



పూలై పూచె రాలిన తారలే పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

పల్లవి:
పూలై పూచె రాలిన తారలే
ఆలలై వీచె ఆరని ఆశలే
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై
నీలో పలికేను ఏనాడు నీ గీతమై

చరణం: 1
కాంతులు విరిసే నీ కన్నులలోన 
నా కలలుండాలి ఏ జన్మకైనా
మమతలు నిండిన నీ కౌగిలిలోన 
నా మనుపూ తనుపూ పండించుకోనా
నా వలపే నిండనీ పండనీ నీ రూపమై
నా వలపే నిండనీ పండనీ నీ రూపమై

చరణం: 2
మెరిసెను నవ్వులు నీ పెదవుల పైన 
అవి వెలిగించాలి ఏ చీకటినైనా
వెచ్చగ తాకే నీ ఊపిరి లోన 
జీవించాలి నా బాసలు ఏనాడైనా
నా బ్రతుకే సాగనీ ఆగనీ నీ ధ్యానమై
నా బ్రతుకే సాగనీ ఆగనీ నీ ధ్యానమై



అబ్బ నీయబ్బ తీశావురా దెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: శ్రీమతి జానకి

పల్లవి:
అబ్బ నీయబ్బ తీశావురా దెబ్బ
అర్థరాతిరబ్బా అబ్బలాల దెబ్బ
హోయ్ పులిరాజు  పంజా దెబ్బ
హొయ్ హొయ్ పులిరాజు  పంజా దెబ్బ

చరణం: 1
కన్నుగొట్టి పోయావు వన్నెకాడా
ఎన్నెలొచ్చి కొట్టింది ఎండదెబ్బా
సెయ్యి పట్టుకున్నావు సిన్నవాడా
సెయ్యి దాటిపోయింది సాటు దెబ్బా
తడిసి మోపెడౌతుంటే
గుడిసెమీద తీశావు
ఒడిసిపట్టి పడుసుదెబ్బా

||అబ్బ నీయబ్బ||

చరణం: 2
గాలిముద్దు లివ్వబోతే పొద్దుకాడ
ఎనకనించి తీశావు ఎదురు దెబ్బ
సందమావఁ నివ్వనంటె సందకాడ
ముందుకొచ్చి తీశావు ముసుగు దెబ్బ
మల్లెపూలు దూశావు మాపటేల తీశావు
మనసుమీద మాయదెబ్బా

||అబ్బ నీయబ్బ||




ప్రేమించుకుందాం ఎవరేమన్న పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా. సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల, S.P. బాలసుబ్రహ్మణ్యం

పల్లవి:
ప్రేమించుకుందాం
ఎవరేమన్న ఏమన్న గానీ
పెనవేసుకుందాం
ఎదురేమున్న ఏమున్నగానీ
గాలిలో ఊగుతూ జోలలా
పూలలో తేలుతూ తావిలా

||ప్రేమించుకుందాం||

చరణం: 1
నీ కళ్ళల్లో చిరుసిగ్గు పల్లవి పాడేనూ
నీ ఒళ్ళంతా మెరుపేదో ఉయ్యాలూగెను
దుడుకైన నీ చూపు దూసుకుపోయెను
నా ఎదలోన కనరాని సెగలే రేపెను
పొంగనీ ఊహలే వేడిగా హా
పూయని ఆశలే తోడుగా హా

||ప్రేమించుకుందాం||

చరణం: 2
పరువాల జడివాన పడుతూ ఉన్నది
అది పడుతుంటే గిలిగింత మొదలౌతున్నది
మొదలైన ఈ హాయి తుదివరకుండాలి
అది ప్రతిరేయి మనసైన రుచులే చూపాలి
చిందనీ ప్రేమలే జల్లుగా హా
పండనీ జీవితం చల్లగా హా

||ప్రేమించుకుందాం||




ఇంతటి సొగసే ఎదురుగ వుంటే పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

పల్లవి:
ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
తుంటరి మనసే తొందరు పెడితే
ఏమీ అనుకోకు  ఏమీ అనుకోకు

ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
ఇరువురి నడుమ తెరలేవుంటే
ఏమీ అనుకోకు హా ఏమీ అనుకోకు

చరణం: 1
లేత లేత పొంగులేమో
లేనిపోని అల్లరి చేస్తే
ఏపులోన ఉన్న నేను ఎలావూరుకోను
వద్దు వద్దు ఇప్పుడొద్దు
ముందు ముందు వుంది విందు 

ఏమీ అనుకోకు ఏమీ అనుకోకు
ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
ఇరువురి నడుమ తెరలేవుంటే
ఏమీ అనుకోకు హా ఏమీ అనుకోకు

చరణం: 2
చిన్నవాని కౌగిలిలోన
కన్నెవయసు కాగుతుంటే
ఎన్ని ఎన్ని తెరలూవున్నా ఎలా అగిపోను
వద్దు వద్దు ఆగవద్దు ఇచ్చుకోవా ఒక్క ముద్దు

ఏమీ అనుకోకు హా ఏమీ అనుకోకు
ఇంతటి సొగసే ఎదురుగ వుంటే
తుంటరి మనసే తొందరు పెడితే
ఏమీ అనుకోకు హహ  ఏమీ అనుకోకు
ఏమీ అనుకోకు ఏమీ అనుకోకు



తనయుడు పుట్టగానె పద్యం సాహిత్యం

 
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: S. P. బాలసుబ్రహ్మణ్యం

రాజయ్య: 
తనయుడు పుట్టగానె - తన
తండ్రికి సంత సమీయ జాలడు - ఆ
తనయుడు కీర్తిలోన తన
తండ్రిని మించిన నాడే నిక్కమౌ
తనివిని పొందు తండ్రియని
ధర్మమిదేయని చాటనెంచి నీ
తనయుల చేత నోడితివి
దాశరథి కరుణా పయోనిధీ

No comments

Most Recent

Default