చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: కృష్ణం రాజు, మురళీమోహన్, జయసుధ, మాధవి, జయమాలిని దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు విడుదల తేది: 16.09.1977
Songs List:
అంతలేసి అందాలు పాట సాహిత్యం
చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: వి.రామకృష్ణ , రమోల అంతలేసి అందాలు
ఇంతే ఈ జీవితమూ అంతా శూన్యము పాట సాహిత్యం
చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: వి.రామకృష్ణ ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అనుబంధాలే అనుమానాలకు ఆహుతి అవుతుంటే ఇచ్చిన మాటే ఉచ్చుగా మారి గొంతు నులుముతుంటే అనుబంధాలే అనుమానాలకు ఆహుతి అవుతుంటే ఇచ్చిన మాటే ఉచ్చుగా మారి గొంతు నులుముతుంటే మనసు విప్పలేక మమత చెప్పలేక మనసు విప్పలేక మమత చెప్పలేక గతం పేర్చిన చితిలో బ్రతుకు కాలి మసై పోతుంది ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము తనకు తాను సుఖపడితే ఒక ఆనందం తన వాళ్ళనైనా సుఖపెడితే పరమానందం తనకు తాను సుఖపడితే ఒక ఆనందం తన వాళ్ళనైనా సుఖపెడితే పరమానందం ఈ రెంటికి నోచని జీవితం ఎండిపోని కన్నీటి సముద్రం ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము చివరికి అంతా శూన్యము చివరికి అంతా శూన్యము చివరికి అంతా శూన్యము
కొత్తగా ఉందా భాదగా ఉందా పాట సాహిత్యం
చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: సుశీల కొత్తగా ఉందా భాదగా ఉందా
నా జీవన సంధ్యా సమయంలో పాట సాహిత్యం
చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: వి.రామకృష్ణ , పి.సుశీల ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ... నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది ఆ రూపమే అపురూపమై అమరదీపమై వెలిగింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది ఆఆఆ..ఆఆ.ఆఆఆఅ.ఆ.ఆఆ... శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది గరిస.. సదపమ గమ దమదని దనిరిని గరిగరిసా సదసదపా మపగా కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది శిలకే కదలిక రాగా శిల్పమే కదలి ఆడింది కళకే కళగా విరిసి నా కల నిజమై పండింది ఆరు ఋతువుల ఆమని కోయిల మనసే ఎగసి పాడింది నా జీవన సంధ్యా సమయంలో.. ఒక దేవత ఉదయించింది పొద్దుపొడుపులో అరుణిమలే చెలి దిద్దు తిలకమై చివురించే ఇంద్రధనుస్సులో రిమరిమలే చెలి పైట జిలుగులే సవరించే ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన ఆఆఆ..ఆఆ.... ఆఆఆఅ.... ఆ.... ఆఆ... ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన.. వెదురు వేణువై పలికింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది పలుకే పాడని పాట చిరునవ్వు పూలకే పూత గరిసా సదపమా గమద మదని దనిరిని గరిగరిసా సదసదపా మపగా నడకే నెమలికి ఆట లే నడుము కలలకే కవ్వింత కలలుగన్న నా శ్రీమతి రాగా ఈ బ్రతుకే పరిమళించింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది ఆ రూపమే అపురూపమై అమరదీపమై వెలిగింది నా జీవన సంధ్యా సమయంలో.. ఒక దేవత ఉదయించింది
నీవే రధసారధి పాట సాహిత్యం
చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల నీవే రధసారధి
ఏ రాగమో ఇది పాట సాహిత్యం
చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: సుశీల, యస్.పి.బాలు ఏ రాగమో? ఇది ఏ తాళమో? ఏ రాగమో? ఇది ఏ తాళమో? అనురాగానికనువైన శృతికలిపినాము! ఆహ..ఊహు..ఆహ..ఊహు.. ఏ రాగమో? ఇది ఏ తాళమో? ఏ రాగమో? ఇది ఏ తాళమో? మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో! ఏ రాగమో? ఇది ఏ తాళమో? ఎదలో మెదిలే..సంగతులన్నీ.. పలికేను సంగీతమై..పలికేను సంగీతమై.. కలసిన కన్నుల..మెరిసే కళలే.. వెలిసెను గమకములై..వెలిసెను గమకములై.. హొయలైన నడకలే లయలైనవి.. చతురాడు నవ్వులె గతులైనవి.. సరి సరి అనగానే,,మరి మరి కొసరాడు.. మురిపాలే మన జంట స్వరమైనదీ.. ఏ రాగమో? ఇది ఏ తాళమో? మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో! ఏ రాగమో? ఇది ఏ తాళమో? విరికన్నె తనకు..పరువమె కాదు.. పరువు కలదన్నదీ..పరువు కలదన్నదీ.. భ్రమరము తనకు.. అనుభవమే కాదు.. అనుబంధముందన్నదీ..అనుబంధముందన్నదీ.. కోకిలమ్మ గుండెకు గొంతున్నదీ.. కొమ్మలో దానికి గూడున్నదీ.. సరి మగవానికి సగమని తలపోయు.. మన జంటకే జంట సరి ఉన్నదీ?? ఏ రాగమో? ఇది ఏ తాళమో? ఏ రాగమో? ఇది ఏ తాళమో? అనురాగానికనువైన శృతికలిపినాము! ఏ రాగమో? ఇది ఏ తాళమో?
నీవే తల్లివి పాట సాహిత్యం
చిత్రం: అమరదీపం (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి. సుశీల నీవే తల్లియు తండ్రియు నీవే నా సోదరుండు నీవే సకుడున్ నీవే గురుడును దైవము నీవే నా తోడునీడ నిజముగ కృష్ణా...
No comments
Post a Comment