Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chillarakottu Chittemma (1977)






చిత్రం: చిల్లరకొట్టు చిట్టెమ్మ  (1977)
సంగీతం: రమేష్ నాయుడు 
నటీనటులు: మురళీమోహన్, జయచిత్ర
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాణ సంస్థ: లక్ష్మీ జ్యోతి ఫిల్మ్స్
విడుదల తేది: 07.10.1977



Songs List:



తల్లి గోదారికే పాట సాహిత్యం

 
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ  (1977)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: రమేష్ నాయుడు 

పల్లవి:
ఆ.. ఓ.. ఆ...హా.. ఆ..
తల్లి గోదారికే ...
తల్లి గోదారికే... ఆటుపోటుంటే
తప్పుతుందా మనిసికీ...తలరాత
తప్పుతుందా మనిసికీ..ఆ...హా.. ఆ.. 

ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి
ఎలుగు ఎనకాలనే సీకటుందని తెలిసి
సీకటికి దడిసేదేమిటి... ఓ మనసా.. సీకటికి దడిసేదేమిటి

చరణం: 1
భగభగ మండే సూరీడుని పొగమబ్బు కమ్మేయదా
చల్లగా వెలిగే సెందురున్ని అమవాస మింగేయదా
ఆ సూర్యచంద్రులే అగచాట్లపాలైతే....
తప్పుతుందా మనిసికీ...తలరాత
తప్పుతుందా మనిసికీ ... 

చరణం: 2 
అవతార పురుషుడు ఆ రామచంద్రుడు.. అడవులపాలు కాలేదా
అంతటా తానైన గోపాల కృష్ణుడు..  అపనిందలను మోయలేదా
అంతటి దేవుళ్ళే అగచాట్ల పాలైతే
తప్పుతుందా మనిసికీ...తలరాత
తప్పుతుందా మనిసికీ...




తాడి చెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ  (1977) 
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.వి.శేఖర్, రఘునాథ్

తాటి చెట్టు తల్లికాదు తాగినోడు మొగుడు కాదు




చీటికి మాటికి పాట సాహిత్యం

 
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: L.R. ఆంజలి, శారద

పల్లవి:
చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి
నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి

చరణం: 1
చినబాబుంటాడు పెదబాబుంటాడు కాపులుంటరు కరణాలుంటరు
చినబాబుంటాడు పెదబాబుంటాడు కాపులుంటరు కరణాలుంటరు
చిట్టెమ్మ అని పిలవకురా... రయ్యో కొయ్యోడా
నీ చిన్నెలన్ని చాలురో... రయ్యో కొయ్యోడా
నీ చిన్నెలన్ని చాలురో... రయ్యో కొయ్యోడా

పిన్నలు పెద్దలు మన్నిస్తారు... కాపులు కరణాలు దీవిస్తారు
పిన్నలు పెద్దలు మన్నిస్తారు... కాపులు కరణాలు దీవిస్తారు
ముద్దుల అత్త కూతురివే.. లమ్మీ చిట్టెమ్మి
నిను ముచ్చటగానే పిలవాలే లమ్మీ చిట్టెమ్మి
నిను ముచ్చటగానే పిలవాలే లమ్మీ చిట్టెమ్మి.. ఓలమ్మీ..చిట్టెమ్మి

చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి
నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి 

చరణం: 2
వరసా వరసా వక్కల ఆకు... కురసా కురసా ముక్కలి పీఠ
పిల్లకు పిల్లాడు తోడంటా... నీకు నాకు పెళ్ళంట.. ఆహా.. అలాగా
తోడంటా... పెళ్ళంటా
తోడంటా... పెళ్ళంటా
పెళ్ళంటా... తోడంటా
పెళ్ళంటా... తోడంటా

ఏయ్.. నేను జీళ్ళ సీతయ్య మరదలినోయ్.. రయ్యో కొయ్యోడా
నువ్వు ఒళ్లు దగ్గర ఉంచుకో... రయ్యో కొయ్యోడా
నువ్వు ఒళ్లు దగ్గర ఉంచుకో... రయ్యో కొయ్యోడా
నువు జీళ్ళ సీతయ్య మరదలివా... లమ్మీ చిట్టెమ్మి
నేను మేడ మంగమ్మ దత్తుడినే... లమ్మీ చిట్టెమ్మి
నేను మేడ మంగమ్మ దత్తుడినే... లమ్మీ చిట్టెమ్మి
ఓలమ్మీ.. చిట్టెమ్మి

చీటికిమాటికి చిట్టెమ్మంటే చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోయ్... రయ్యో కొయ్యోడా
కొయ్యోడు కొయ్యోడంటే నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి
నువ్వు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టెమ్మి 




ఏం చెప్పేది పాట సాహిత్యం

 
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్. జానకి, యస్.పి.బాలు

పల్లవి:
ఏంటబ్బాయా ఇదేటబ్బాయా
నా దుంప తెంచావు నా కొంప ముంచావు
నా వాలకం చూసి నా వాళ్ళడిగితే
ఏం చెప్పేది నేనేం చెప్పేది
ఏం చెప్పేది నేనేం చెప్పేది
హమ్మా ఏం చెప్పేది నేనేం చెప్పేది

ఏంటి చిట్టెమ్మ ఇదేం గోలమ్మా
కుళ్ళుమోతోళ్ళు నిను కూకలేస్తేను
టాపు లేపలేవా టోపీ వేయ్యలేవా
ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్.
ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్
హబ్బా...ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్

చరణం: 1
కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా
ఆవురావురుమంటు నన్నదిమి పట్టుకున్నావ్
కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా
ఆవురావురుమంటు నన్నదిమి పట్టుకున్నావ్
నలిపి నలిపి వేశావ్ మురికి మురికి చేశావ్

ఏం చెప్పేది నేనేం చెప్పేది
అయ్యయ్యయ్యొ చెప్పేది నేనేం చెప్పేది
హమ్మా...ఏం చెప్పేది నేనేం చెప్పేది

కోకనదరు చూసి కోడెగిత్త బెదరి
తాడు తెంచుకోని తరిమి తరిమి వేసి
కోకనదరు చూసి కోడెగిత్త బెదరి
తాడు తెంచుకోని తరిమి తరిమి వేసి
బిత్తర బిత్తర చేసిందని వత్తి వత్తి పలకలేవా

ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్
ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్
అరెరే...ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్

చరణం: 2
జుట్టు చెదిరిపోయే నా బొట్టు కరిగిపోయే
బుగ్గలేమో కంది మల్లెమొగ్గలేమో కమిలే
జుట్టు చెదిరిపోయే నా బొట్టు కరిగిపోయే
బుగ్గలేమో కంది మల్లెమొగ్గలేమో కమిలే
ముస్తాబులన్నీ కూడా ముదనష్టమైపోయే

ఏం చెప్పేది నేనేం చెప్పేది
ఏం చెప్పేది నేనేం చెప్పేది
హ..హ ఏం చెప్పేది నేనేం చెప్పేది

కొబ్బరితోట కాడ కోతిపిల్లను చూసి
ఎక్కిరించబోతే ఎగిరి గంతులేసి
కొబ్బరితోట కాడ కోతిపిల్లను చూసి
ఎక్కిరించబోతే ఎగిరి గంతులేసి
చిదిమి చిదిమి వదిలిందని గదిమి గదిమి చెప్పలేవా

ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్
హబ్బ.. చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్

అహ..ఏం చెప్పేది నేనేం చెప్పేది
అరెరే.. ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్
అయ్యో ఏం చెప్పేది ..నేనేం చెప్పేది
ఏదో చెప్పేసేయ్ నువ్వేదో చెప్పేసేయ్





సువ్వి కస్తూరి రంగ పాట సాహిత్యం

 
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ  (1977)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్. జానకి, యస్.పి.బాలు

పల్లవి:
సువ్వి ఆ హు సువ్వి ఆ హు...సువ్వి...సువ్వి
సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా.. 
హైలేసా హయ్యా.. హైలేసా హయ్యా..

చరణం: 1
అద్దమరేతిరి నిద్దురలోన
ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
నా వద్దకు వచ్చెను ఓ సఖియా

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

చరణం: 2
వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లగేనుగా
భల్ చెంగున యమునకు సాగేనుగా

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ...

చరణం: 3
అల్లావనమున కొల్లలుగా వున్నా 
గొల్ల భామలను కూడితిని
నే గొల్లా భామనై అడితిని...
నే గొల్ల భామనై అడితినీ...

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ...
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

నిద్దుర లేచి అద్దము చూడ 
ముద్దుల ముద్దర ఓ చెలియా...
హబ్బ... అద్దినట్టుంది ఓ సఖియా...



చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పాట సాహిత్యం

 
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ  (1977)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు

చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటడు




చుక్కలలో పాట సాహిత్యం

 
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ  (1977)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల

పల్లవి:
చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...

చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...

చరణం: 1
ఏటి గాలికి పెళ్ళికొడుకులో ఎగిసే బాసల అలలెన్నో..ఓ..ఓ..
పడవ ఇసురుతో పెళ్ళిపడుచులో పలికే తీయని కలలెన్నో..ఓ..ఓ..
అరమూసే ఆ కళ్ళే చెబుతాయి...
ఇరబూసే నీ అందాలే చెబుతాయి...

చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...

చరణం 2 
ఉలకని పలకని మూగరాలివని తెలిసే అందరు వస్తారు..ఊ..ఊ
కోరినవన్నీ అవుతాయనుకొని గుండె నింపుకొని వెళతారు..ఊ..ఊ..
మౌనంగా ఎన్నాళ్ళు ఉంటావోయమ్మ..
మనసార ఈసారైన దీవించవమ్మా..
మనసార ఈసారైన దీవించవమ్మా..

చుక్కల్లో పెద చుక్క చందమామా
ఎలుగులకే ఎలుగమ్మ ఎన్నెలమ్మా
ఆ చందమామకు ఈ ఎన్నెలమ్మకు చల్లని గోదారి ఒడిలో పెళ్ళమ్మా..
ముత్యాలజల్లమ్మా...

No comments

Most Recent

Default