చిత్రం: కల్పన (1977) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: మురళీమోహన్, జయచిత్ర , జయమాలిని దర్శకత్వం: కె రాఘవేంద్రరావు నిర్మాత: క్రాంతి కుమార్ విడుదల తేది: 22.04.1977
Songs List:
ఒక ఉదయంలో పాట సాహిత్యం
చిత్రం: కల్పన (1977) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు సాకి : ఇది నా కల్పనా! కవితా లాపన... పల్లవి: ఒక ఉదయంలో నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పనా! అది ఒక కల్పన అది నా కల్పన! చరణం: 1 తార తారకీ నడుమ ఆకాశం ఎందుకో పాట పాటకీ నడుమ ఆవేశం ఎందుకో మనిషి మనిషికీ మధ్య మనసనేది ఎందుకో మనసే గుడిగా మనిషికి ముడిగా మమత ఎందుకో ఈ మమత ఎందుకో తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా... అది ఒక కల్పన అది నా కల్పన... చరణం: 2 దిన్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వునా మధువు నీకోసం పొంగితే కవి మనస్సులో ఉషస్సు కారు చీకటవుతుందే మిగిలిన కథలో పగిలిన ఎదలో ఈ కవితలెందుకో కవితలెందుకో తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా..... అది ఒక కల్పన- అది నా కల్పన...
దిక్కులు చూడకు రామయ్యా.. పాట సాహిత్యం
చిత్రం: కల్పన (1977) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: సుశీల, జి.ఆనంద్ పల్లవి: దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా.. సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. ముందుకు రావే ముద్దుల గుమ్మ సిరిమల్లె నవ్వుల సీతమ్మా... ముందుకు రావే ముద్దుల గుమ్మ...ముద్దులగుమ్మా దిక్కులు చూడకు రామయ్య చరణం: 1 ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ... ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ... కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో..రామయ్యా.. పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు. పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు. ఆ వెన్నెలలో... నీ కన్నులలో... ఆ వెన్నెలలో..నీ కన్నులలో.. సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. సీతమ్మా..సీతమ్మా దిక్కులు చూడకు రామయ్య చరణం: 2 కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో.. కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో.. కలలిక మాని కలయికలో..నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు.. వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు.. ఆ వెల్లువలో... నా పల్లవిలో.. ఆ వెల్లువలో.. నా పల్లవిలో.. రాగమే పలికించు.. అనురాగమై పులకించు..రాగమే పలికించు.. అనురాగమై పులకించు..సీతమ్మా..సీతమ్మా.. దిక్కులు చూడకు రామయ్య
పొద్దు వాలిపోయాక పాట సాహిత్యం
చిత్రం: కల్పన (1977) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: గోపి గానం: సుశీల పల్లవి: పొద్దు వాలిపోయాక ఊరు సద్దుమణిగాక ఒంటరిగా అత్త కొడుకు రమ్మన్నాడు. నన్ను రమ్మనీ వాడేమొ రాకున్నాడు ఎంతపని చేశాడమ్మ పిల్లాడు... చరణం: 1 నీటిమీద రాసిపోతాను నీమీద నేను అలిగానని గాలితో చెప్పిపోతాను మాటలన్ని గాలివేనని వెదురు గుబురు వినిపిస్తుంది నేనెన్నిసార్లు నిట్టూర్చానో ఇసుక తిన్నె చూపిస్తుంది ఇక్కడెంత సేపు కాసుకున్నానో చరణం: 2 వానమబ్బు కదిలొస్తుందీ నా నడక నీకు గురుతొచ్చేలా మెరుపు తీగ తళుకు మన్నది నావంటి మెరుపు నువు చూసేలా వానజల్లు రాబోతుందీ నా గుండెలలో వలపు జల్లుగా ఆకాశం చీకటైనది నీ ముద్దు లెవరు చూడకుండగా....
అర్ధరాతిరి పొద్దు పొడిచేన పాట సాహిత్యం
చిత్రం: కల్పన (1977) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: సుశీల పల్లవి: అర్థ రాతిరి పొద్దు పొడిచేనా నీటిమాటున నిప్పు రగిలేనా ముద్దులతోనే ప్రేమ కవితకు దిద్దినావా ఓసమాలు - అమ్మ దొంగా... చరణం: 1 మగత నిదురలో పెట్టిన ముద్దు మంచు తెరలలో పొడిచిన పొద్దు తెరలు తొలిగితేనే పొద్దుకు పరువం తీపి పెరిగితేనే ముద్దుకు మురిపెం ఆ ముద్దు తీరేదాకా ఈ పొద్దు గడిచేదాకా బరా... హుష్...ష్...ష్... చరణం: 2 కలవరించుతున్నదీ కాటుక కనుదోయి కమ్మగ మోగింది గాజుల సన్నాయి మూగవడిన గదిలో అనురాగం శృతి చేసుకుంది... కవి అల్లిన కల్పనలో నవగీతం పలుకుతుంది... ఆ పాటయే జోలగా ఈ పానుపే ఉయ్యాలగా బజోరా... హుష్...ష్...ష్...
వదలనురా నిను రఘురామా పాట సాహిత్యం
చిత్రం: కల్పన (1977) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: సుశీల పల్లవి: వదలనురా! నిను రఘురామా! నా జీవితమే నవ పారిజాతము ఏనాడో అది నీకే అంకితము చరణం: 1 నా భావములో జీవము నీవే! నా గానములో మాధురి నీవే! తోడూ నీడా మనుగడ నీవే నను నడిపించే దైవము నీవే చరణం: 2 కోరను ఎప్పుడూ సిరి సంపదలు అడగను నిన్ను వేరే వరములు పావనమౌ నీ పదములె చాలు నను పాలించే సౌభాగ్యాలు
No comments
Post a Comment