చిత్రం: పండంటి కాపురం (1972) సంగీతం: కోదండపాణి నటీనటులు: కృష్ణ , విజయ నిర్మల, జయసుధ, బి. సరోజా దేవి దర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్ నిర్మాత: జి. హనుమంతరావు విడుదల తేది: 21.07.1972
Songs List:
మనసా...కవ్వించకే పాట సాహిత్యం
చిత్రం: పండంటి కాపురం (1972) సంగీతం: కోదండపాణి సాహిత్యం: మైలవరపు గోపి గానం: పి సుశీల మనసా... కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను సుడిగాలిలో చిక్కిన నావను మనసా... కవ్వించకే నన్నిలా! ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా ఈనాడు చీకటి లాగ మిగిలాను చీకటిలోనా నేనోడిపోయి గెలుపొందినాను నేనోడిపోయి గెలిపొందినాను గెలిచానని నవ్వనా... ఏడ్వనా... మనసా... కవ్వించకే నన్నిలా! మోముపై ముంగురులేమో వసివాడి మల్లియలాయే గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే ఏ తీవెకైనా కావాలి తోడు ఏ తీవెకైనా కావాలి తోడు నా జీవితం శాపమా పాపమా మనసా... కవ్వించకే నన్నిలా!
బాబూ వినరా పాట సాహిత్యం
చిత్రం: పండంటి కాపురం (1972) సంగీతం: కోదండపాణి సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ కలతలు లేనీ నలుగురు కలిసీ సాగించారు పండంటి కాపురం బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు ఒక్క బాటపై కలసి నడిచారు వారు ఆఆ ఆఆ ఆఆ... ఓ ఓ ఓ ఓ ఓ ఓ... ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు ఒక్క బాటపై కలసి నడిచారు వారు అన్నంటే తమ్ములకు అనురాగమే... అన్నకు తమ్ములంటే అనుబంధమే... బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ. చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ. పిల్లలకూ పెద్దలకూ తల్లివంటిదీ ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ అన్న మనసులో వున్నది ఎన్నో కోరికలూ తమ్ములకు జరగాలి పెళ్ళీ పేరంటాలు పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలీ కలకాలం ఈలాగే కలసివుండాలీ బాబూ.వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ కలతలు లేనీ నలుగురు కలిసీ సాగించారు పండంటి కాపురం. ఆఆ... ఆఆ... ఓఓఓ... ఓఓఓ.
ఏమమ్మ జగడాల పాట సాహిత్యం
చిత్రం: పండంటి కాపురం (1972) సంగీతం: కోదండపాణి సాహిత్యం: దాశరథి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఏమమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చిన్నారి పాపలూ అందాల బొమ్మలూ వాళ్ళంటే కోపమేల హెయ్ హెయ్ హెయ్య ఏమమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా ఎవరినేమి అన్నారూ ఎవరిసొమ్ము తిన్నారూ చెయ్యి చేసుకుంటావా ఆపవమ్మా నీ బుసబుసలూ ఆ.ఆ.ఆ. ఏమమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చదువుంటే చాలదూ సంస్కారం వుండాలి మనుషుల్లో తిరిగేటప్పుడూ మంచి మనసు కావాలి చదువుంటే చాలదూ సంస్కారం వుండాలీ మనుషుల్లో తిరిగేటప్పుడూ మంచి మనసుకావాలి గర్వాన్ని వదలాలీ కలసిమెలిసి ఉండాలి పుట్టింటికి మెట్టినింటికీ వన్నెవాసి తేవాలి ఓ.ఓ.ఓ. ఏమమ్మా జగడాల శోభమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే పిల్లలు ఏ తప్పు చేసినా సరిదిద్దాలంటారే తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే పిల్లలు ఏ తప్పు చేసినా సరిదిద్దాలంటారే నీవే ఇట్లుంటేనూలోకులు ఇది వింటేనూ అయ్యయ్యో ఉన్న గౌరవం గంగలోన కలిసేనూ ఊ.ఊ.ఏమమ్మాజగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో ఏమమ్మా జగడాల శోభమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో
ఈనాడు కట్టుకున్న పాట సాహిత్యం
చిత్రం: పండంటి కాపురం (1972) సంగీతం: కోదండపాణి సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఊ ఊ ఊ ఓ ఓహోహో ఆహహా ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఆశలే తీవెలుగా ఉహూ ఊసులే పూవులుగా ఉహూ వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు ఆ ఆ ఆ ఆశలే తీవెలుగా ఉహూ ఊసులే పూవులుగా ఉహూ వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు పగలైనా రేయైనా ఏ ఋతువులోనైనా పగలైనా రేయైనా ఏ ఋతువులోనైనా కురిపించును తేనెజల్లు పరువాల ఆ పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు కళ్ళలో కళ్ళుంచీ ఉహూ కాలమే కరిగించే ఉహూ అనురాగం పండించే ఆ బ్రతుకే హరివిల్లు ఆ ఆ ఆ కళ్ళలో కళ్ళుంచీ ఉహూ కాలమే కరిగించే ఉహూ అనురాగం పండించే ఆ బ్రతుకే హరివిల్లు నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే నా దేవివి నీవైతే నీ స్వామిని నేనైతే పచ్చని మన కాపురమే పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు ఊ కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ ఊఁహూఁహూఁ
ఆడే పాడే కాలంలోన పాట సాహిత్యం
చిత్రం: పండంటి కాపురం (1972) సంగీతం: కోదండపాణి సాహిత్యం: మైలవరపు గోపి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఆడే పాడే కాలంలోన
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ పాట సాహిత్యం
చిత్రం: పండంటి కాపురం (1972) సంగీతం: కోదండపాణి సాహిత్యం: మైలవరపు గోపి గానం: పి. సుశీల ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ నదిలో నావ ఈ బ్రతుకు దైవం నడుపును తన బ్రతుకు ఊఉ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నదిలో నావ ఈ బ్రతుకు దైవం నడుపును తన బ్రతుకు అనుబంధాలు ఆనందాలు తప్పవులేరా కడవరకు తప్పవులేరా కడవరకు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ఇది నిలిచేదేమో మూడు రోజులు బంధాలేమో పదివేలు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
No comments
Post a Comment