చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు నటీనటులు: నాగేశ్వరరావు , సావిత్రి దర్శకత్వం: పి.పుల్లయ్య నిర్మాత: వి. వెంకటేశ్వరులు విడుదల తేది: 19.09.1962
Songs List:
చిట్టి పొట్టి పాపలు పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. శాంతకుమారి అండ్ బృందం చిట్టి పొట్టి పాపలు చిరు చిరు నవ్వుల పూవులూ మీరే మా సిరిసంపదలు వరాలు ముద్దుల మూటలు తరతరాల వరాల పంటలూ [చిట్టి] పిల్లలు కిల కిల నవ్వాలీ ఇల్లే కళకళ లాడాలీ ఆడాలీ బుల్లి బుల్లీ పొడి మాటలతో పుట్టతేనెలే కురవాలి [చిట్టి] గోపాలునికి గోకులమందు పాలు వెన్న తినినంత కానీ... యశోద వాని కడుపును జూచీ పెట్టిన బువ్వే బలమంతా ఆకాశంలో అన్ని తారలకూ ఒకే చంద్రుడు వున్నాడూ ముద్దులొలుకు యీ ముగ్గురికోసం వాడే బిరబిర దిగివచ్చాడు ఎవరు? బావ ! బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నేరు తంతే బావ వూర్కోడు తాళికట్టి లాక్కెళ్తాడు
ఎందుకో సిగ్గెందుకో పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీ శ్రీ గానం: ఘంటసాల, సుశీల ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఎందుకో సిగ్గెందుకో పంతాలె తీరెనని తెలిసినందుకే, మనసులు కలిసినందుకే అందుకే ... సిగ్గందుకే ... చిన్న నాటి చిలిపి తలవు ఇన్నాళ్ళ వలపు పిలుపు చిరునవ్వుల చిన్నారీ, ఇంకా సిగెందుకే కొనసాగిన కోరికలే, మురిపించేను వేడుక లై తనివారగ యీ వేళా, ముననే తూగాడెనే అందుకే ... సిగ్గందుకే ... నును సిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే అనురాగం ఆనందం, అన్నీ నీ కోసమే అందుకా - ఊ - సిగ్గందుకా ? - ఆఁ పంతాలే తీరె పని తెలిసినందుకా? మనసులు కలిసినందుకే అందుకా సిగ్గందుకా
ఈ పగలు రేయిగ పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, జానకి ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ మారిన దేమి చెలీ... కారణమేమీ చెలీ - ఆఁ... వింతగాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి పండు పున్నమి జాబిలి - ఓ... మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీపు పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు వెండి వెన్నెల జాబిలి పండు పున్నమి జాబిలి కన్నులు తెలిపే కథల నెందుకు రెప్పలార్చియేమార్చేవు చెంపలుపూచె కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవూ వెండి వెన్నెల జాబిలి పండు పున్నమి జాబిలి అలుక చూపి అటు వైపు తిరిగితే అగుపడ దనుకొని నవ్వేవూ నల్లని జడలో మల్లె పూవు నీ నవ్వున కద్దము చూపేనూ!
వేణుగానంబు వినిపించెనే పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల, జిక్కి, జానకి వేణుగానంబు వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించడే వేణుగానంబు వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించడే దోరవయసున్న కన్నియల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను అంత మొనగాడుకు వింత కథ లేనటే! ఏడి? కనబడితే నిల వేసి అడగాలి వానినే మన్ను తిన్నా వన యశోదమ్మ అడిగిందట లేదు లేదనుచు లోకాలు చూపాడట అంత మొనగాడటే? వట్టి కథ లేనటే ! ఏడి కనబడితే కనులారా చూడాలి వానినే దుకుకు క్రిష్ణయ్య మడుగులోన దూకాడట జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట ఘల్లు ఘల్ ఘల్లున - వళ్ళు ఝల్ ఝల్లు న తాను ఫణిరాజు పడగ పై తారంగ మాడేనట
గుడిలో దేవుని గంటలా పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆత్రేయ గానం: సుశీల గుడిలో దేవుని గంటలా నా హృదిలో ఆరని మంటలా కలలుకన్న కన్నె వలపులో గాలిగోపుర దీపాలూ ఆలయమందున దేవుడు వున్నా మనుజులందరికి మనసులు వున్నా ఆలకించరా ఆవేదనలూ ఆదరించగా అను రాగాలు ప్రేమించిన మా పసిహృదయాలను శాసించెనుగా ముది ద్వేషాలూ దేవుడు వ్రాసిన వ్రాతలా ఇవి పెద్దలు చేసిన చేతలా తొలి ప్రేమను చవి చూపిన తల్లే విధి లేదనుకొని విడదీసినదా ఈ విషబిందువు చిందిన దెవరో జీవిత మెడారి చేసిన దెవరో
పువ్పునవ్వెను పున్నమి నవ్వెను పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆత్రేయ గానం: సుశీల పువ్పునవ్వెను పున్నమి నవ్వెను పులకరించి ఈ జగము నవ్వెను కొలను నవ్వెను కోరక నవ్వెను నవ్వలేక నేనున్నాను వయసు నవ్వెను సొగసూ నవ్వెను నవ్వురాక యీ మనసే నలిగెను వలపు నవ్వెను తలపూ నవ్వెను పగ రగిలీ అవి బలియై పోయెను కడుపు తీపితో కన్న బిడ్డ కై హితవుకోరి యేగిన తండ్రికి చేయని నేరం శిక్ష వేసెను మాయని పాపం నా పాలయ్యెను కలిమీ చెలిమి వెలసిన ఇల్లుర్ వెలుగుమాసి వెలవెలపోయెను లోకం నవ్వెను శోకం మిగిలెను లోలోపల నా గుండె లవిసెను
వారాని కొక్కటే సన్ డే పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆత్రేయ గానం: పి. బి. శ్రీనివాస్, జానకి, రాణి వారాని కొక్కటే సన్ డే కుర్రాళ్ళకంత అది జాలీ డే హాలిడే - జాలి డే - హాలిడే స్టూడెంటు లైఫు స్వీటు, ఫ్యూచర్ కు మెయిన్ గేటు బాధ్యతలున్నా పరీక్షలున్నా బాధలు లేవన్నా వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్ డేసంతా చదువూ సన్ డే నాడూ సెల్యూట్ పోడూ సరదాగా ఆడు మనముందు వుంది గోలు, కొడదాము రేపు బాలు పాడాలి నేడు హం తుం ఆడాలి ఆకు కంకం పాడాలి నేడు హం తుం ఆడాలి అట కం కం అమ్మా నాన్న పైసా ఇస్తే హాయిగ తినితిరిగేం ఫస్టు వీకులో కేపిటలిస్ట్ నెక్స్ట్ వీకులో సోషలిస్టు ఆ పై వారం కమ్యూనిస్టు ఆఖరి వారం టెర్రరిస్టు హాలిడే జూలీ డే హాలిడే
కొండమ్మో, బంగారపు కొండమ్మా పాట సాహిత్యం
చిత్రం: సిరి సంపదలు (1962 ) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత కొండమ్మో, బంగారపు కొండమ్మా పిలిచి నపుడు పల్కరు లేవే, అంతు లేని ఆల్కలు లేవే ఆడవాళ్ళు అంతా ఇంతే లేవే, ఓ రంగుల బొమ్మా మారయ్యో ఓ టక్కుల మారయ్యో పెళ్ళి పెళ్ళి అంటారయ్యా బేరాలకు దిగుతారయ్యా మగవాళ్ళంతా ఇంతేనయ్యా మాట్లాడకయ్యా కట్నం నేరుగ బేరం చేసిన వాడనా కన్నారా చూసిన వాడనా బ్రహ్మ దేవుడే రాసుంటాడు అమ్మ నాన్న ఔనన్నారు కిక్కురుమనక తల ఊపేను గదమ్మా, తప్పేమిటమ్మా మాటలు చూస్తే కోటలు దాటును జోరుగా సొరకాయలు బహు కోస్తారుగా అందంతోటి పని లేదయ్యా, ఆడది అయితే చాలుగదయ్యా పైసయిస్తే పల్టీకొడతారయ్యా మి మ్మెరుగుదు మయ్యా పెళ్ళి పెత్తనం పెద్దల చేతుల్లోనిది, మనబడాయి చెల్లని చోటది ప్రేమించట మే నా వంతు, ఇక పిల్లల కనడం నీ వంతు లోకంలోనా జరిగేదే ఈ తంతు ఇది నీకు తెలుసు పరుల చెప్పినట్లు తైయని బొమ్మలా - ఆ హా హా బలే దద్దమ్మలా పప్పుదప్పళం గారండి -- మీతప్పు వొప్పుకున్నారండి ఇప్పటికైనా కోతలు ఆపాలయ్యా డాబెందుకయ్యా కొండమ్మో బంగారపు కొండమ్మా మారయ్యో - ఓ ఏ కే మారయ్యా
No comments
Post a Comment