చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: సిరివెన్నెల (All) గానం: యస్.పి. బాలు, కీ. జె. యేసుదాస్, వాణి జయరాం, యస్.పి. శైలజా, రంగనాథ్ నటీనటులు: చంద్రమోహన్, జయసుధ, నరేష్ , తులసీరాం, ముచ్చెర్ల అరుణ , కల్పన దర్శకత్వం: విసు నిర్మాత: కరుణాకర్, దయాకర్ విడుదల తేది: 23.10.1987
Songs List:
ఆడదే ఆధారం పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు ఆడదే ఆధారం మన కధ ఆడనే ఆరంభం ఆడదే సంతొషం మనిషికి ఆడదే సంతాపం కోతిమంద చేత సెతువుల్ని నిర్మింప చేసింది ఆడదిరా నాడు తాళికోసం యముడి కాలపాశంతో పోరింది ఆడదిరా ఖడ్గతిక్కన్న కత్తి తుప్పుపట్టకుండ ఆపింది ఆడదిరా అన్న బాలచంద్రుడి చండభాను తేజం వెనుక వెలిగింది ఆడదిరా వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా ఇతగాడ్ని నడుపుతున్నది అటువంటి ఆడదిరా దశరధుడ్ని నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా అయ్యొ భీష్ముడంతటివాడ్ని అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట చెడిపింది ఆడదిరా ఆహ పల్నాటి నేలంతా పచ్చి నెత్తుట్లోన తడిపింది ఆడదిరా కోడల్ని తగులబెట్టే అత్త కూడ ఆడదిరా ఈ మగవాడ్ని నేడు చెడిపింది ఆడదిరా పంచ పాండవులకు కీర్తి కిరీటాలు పెట్టింది ఆడదిరా ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా పున్నమంటి తాజ్ మహల్ పునాది ఆడదిరా మేటి సామ్రాజ్యల కోటలెన్నొ కూలగొట్టింది ఆడదిరా మంచికయిన చెడుకైనా మూలం ఒక ఆడదిరా చరిత్రలో ప్రతి పుట అమే కధే పాడునురా
అక్కా బావ పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు అక్కా బావ మా అమ్మ నాన్న ఎక్కువకాదా మా ప్రాణం కన్నా కన్నవారులేని మాకు అంతకన్న మిన్నగా దిగివచ్చిన శివపార్వతులే అక్కా అక్కా..నీ రెక్కల చలువ బావా బావా..నీ మమతల విలువ పెంచుకున్న మొక్కలు మేమే అక్క లాలన..బావా పాలన పూల ఊయలై పెరిగాం మేము చిక్కులేమితో చింతలేమితో ఒక్కనాటికి ఎరుగము మేము అక్క మాట వేదవాక్కు ఎప్పటికైనా బావగారి చూపంటే సుగ్రీవ ఆగ్జ్ఞ మీరు గీసే గీతను మీరము మేము మీకు నచ్చనిదేది కోరము మేము జన్మజన్మకు మీ పిల్లలమై మీ ఒడిలోనే మేం జన్మిస్తాం కాలు నేలపై మోపనివ్వక పూల తేరులో ఊరేగిస్తాం ఏమిచ్చి తీర్చగలం మీ ఋణభారం కన్నీటి పన్నీరుతో మీ కాళ్ళు కడుగుతాం మా బ్రతుకులు మీ కోసం అంకితమిస్తాం మీ బరువులు మోసేందుకే మేం జీవిస్తాం
కీలు బొమ్మను నేను పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఏ.పి.కోమల కీలు బొమ్మను నేను
నింగిని విడిచిన చినుకుకు పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: సిరివెన్నెల గానం: మధు బాలకృష్ణన్ నింగిని విడిచిన చినుకుకు
వాటెయ్యర స్వామి పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి ఒక బహుమతి (1987) సంగీతం: శంకర్-గణేష్ సాహిత్యం: సిరివెన్నెల గానం: వాణీ జయరాం వాటెయ్యర స్వామి
No comments
Post a Comment