చిత్రం: కలికాలం (1991) సంగీతం: విద్యాసాగర్ నటీనటులు: చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్ దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య నిర్మాత: నితిన్ కపూర్ విడుదల తేది: 27.03.1991
Songs List:
ఏ నాటికీ నీ వడి వీడని పాట సాహిత్యం
చిత్రం: కలికాలం (1991) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర ఏ నాటికీ నీ వడి వీడని
యేనాటికానాడు పాట సాహిత్యం
చిత్రం: కలికాలం (1991) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు యేనాటికానాడు
అచ్చచో అచ్చో పాట సాహిత్యం
చిత్రం: కలికాలం (1991) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: నాగూర్ బాబు, చిత్ర అచ్చచో అచ్చో
ఆరని ఆకలి కాలం..పాట సాహిత్యం
చిత్రం: కలికాలం (1991) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు ఆరని ఆకలి కాలం..కలికాలం అవనికి ఆఖరి కాలం..కలికాలం నీతిని కాల్చే నిప్పుల గోళం నిలువునా కూల్చే నిష్టుర జాలం కలికాలం ఆకలి కాలం కలికాలం ఆఖరి కాలం ఈ గాలి ఏ జాలి ఎరుగదు ఈ నేల ఏ పూలు విరియదు ఈ మూల ఎకాకి ప్రతి మనిషి ఈ గోల ఎనాడు అణగదు ఈ జ్వాల ఏవేళ తరగదు ఈ నింగి పంచేది కటిక నిశి కూటికోసమేనా ఇంత చేటు బోను సాటివారిపైనా కాటు వేయు జోరు మనిషే మృగమై అడవైపోయే నడివీధిలో కూరిమి కోరని క్రౌర్యం..యుగసారం ఓరిమి చేరని వైరం..గ్రహచారం కత్తులు నూరే కర్మాదానం నెత్తురు పారే అత్యాచారం కసికాలం..రక్కసికాలం కలికాలం ఆఖరి కాలం వాటాల పోటీల నడుమ వేలాడుతుంటారు మనుషులు వ్యాపారమే వావి వరసులుగా వేలాల పాఠం విలువలు వేసారిపోతాయి మనసులు ఏపాటి స్నేహాలు కనపడక రాగిపైసతోనే వేగుపాశమైనా అత్యాశతోనే అయినవాళ్ళ ప్రేమ.. అడిగే వెలనే చెల్లించాలి అడుగు అడుగున అంగడి సరుకై పోయే మమకారం అమ్ముడు పొమ్మని తరిమే పరివారం తీరని నేరం...ఈ వ్యవహారం తియాని నేరం..ఈ సంసారం కనికారం కానని కాలం కలికాలం ఆకలి కాలం నీ బ్రతుకు తెల్లారినాకే.. వేరొకరి ఆశలకు వేకువ.. ఈ ఇరుకు లోకాల వాడుక ఇది ఓ పాడె మేళాల అపశ్రుతి.. ఓ పెళ్ళి కట్నాల ఫలశ్రుతి.. ఏ కరకు ధర్మాల వేడుక ఇది కాటి కాంతిలోనే బాట చూసుకుంటూ కాళరాత్రిలోనే చోటు చేసుకుంటూ బ్రతుకే వెతికే ఏ రాకాసి లోకం ఇది సంతతి సౌఖ్యం కోసం బలిదానం అల్లిన ఈ యమ పాశం బహుమానం ఆశలు అల్లే ఈ విష జాలం చీకటి పాడే చిచ్చుల గానం కలికాలం కలతల గాళం కలికాలం ఆకలి కాలం ఏనాటి కానాడు నిత్యం వేదించు ఆ పేద గాధకు ఈనాడు రేటంత పెరిగినది జీవించినన్నాలు ఎన్నడు ఊహించలేనంత పెన్నిధి ఈ వారసత్వానికి ఇచ్చినది చావుకున్న భీమ..జీవితానికి ఏది ఊపిరున్న ధీమా..జ్ఞాపకానికి ఏది కనకే కనకం..కన్నీరేందుకు అంటున్నది నమ్మినవారికి నష్టం కొనప్రాణం తప్పక తీరును చస్తే ఋణకాలం ఆహుతి కాని నిన్నటి రూపం కంచికి పోని నీ కధ వేగం అనివార్యం ఈ పరిహారం కలికాలం ఆకలి కాలం పైనున్న పున్నామనరకం.. దాటించు పుణ్యాల వరమని.. పుత్రులున్ని కన్న ఫలితమిది ప్రాణాలు పోయెటిలోపునే.. వెంటాడి వేటాడి నిలువునా.. అంటించి పోతారు తలకొరివి పాలు పోసి పెంచే..కాల నాగు రూపం. నోము నోచి పొందే..ఘోరమైన శాపం బ్రతుకే బరువై..చితినే శరణు వేడే క్షణం కోరలు చాచిన స్వార్ధం..పరమార్ధం తీరని కాంక్షల రాజ్యం..ఈ సంఘం నీతిని కాల్చే..నిప్పుల గోళం నిలువున కూల్చే..నిష్టుర జాళం కలికాలం ఆకలి కాలం కలికాలం ఆఖరి కాలం ఈ మాయ భందాలు నమ్మకు ఈ పరుగు పందాల ఆగకు నీ బాట నీదేరా కడవరకు ఏ గాలిని దారి అడగకు ఏ జాలికి ఎదురు చూడకు నీ నీడే నీ తోడనుకో ఓడలాగ నిన్ను..వాడుకున్న వారు తీరమందగానే..తిరిగి చూడబోరు పడవై బ్రతికి నది ఓడిలోనే నిలిచి ఉండకు ఏరయి పారే కాలం ఏమైనా సాక్షిగ నిలిచిన గట్టు కరిగేనా వేసవి కాని..వెల్లువ రాని శాశ్వత స్నేహం అల్లుకుపోని చెదిరేనా పండిన భంధం చెరిపేనా ఏ కలికాలం
No comments
Post a Comment