Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Konda Polam (2021)




చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
నటీనటులు: వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: క్రిష్ జాగర్ల మూడి
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జె.సాయి బాబు
విడుదల తేది:08.10. 2021



Songs List:



ఓబులమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: సత్య యామిని, PVNS రోహిత్

పల్లవి
గింజ గింజ మీద 
బుసక బుసక బుసక తీసి 
తీయంగా బత్తెమయ్యి పోయే 
బొట్టే కట్టి చేత బట్టిన
చేతి లోకి చేరలేని గుండుజళ్ళ ఆరాట పడిపోయే 

ఓ… ఓ… ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ 

కపర కపర వేకువ లోన
కాలమంతా లెక్కలు గట్టి 
గుండెలోన నీ పేరు జపమాయె.. 
యిదివరకెపుడు తెలియని ఎరగని 
తురుపే మైమరిపిస్తూ ఉంటె 
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే 

చరణం

కన్నులు కన్నులు వింటున్న
చూపులు చూపులు చెబుతున్న 
మాటలు మాటలు చూస్తున్న 

మగతలలో..
ఎవ్వరికెవ్వరు సావాసం  
ఎక్కడికక్కడ ప్రయాణం 
ఎప్పటికప్పుడు ఎదురయ్యే 
మలుపులలో…
చదివేసాడేమో నా కలలు  
ఉంటాడే నీడై రేపవలు 
తిష్టేసినాడే గోంతరాలు
పొమ్మంటే పోడే  ఈడిగలు..

ఓ.... ఓ… ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ 

కపర కపర రేతిరి లోన
కాలమంతా లెక్కలు తప్పి
గుండెలోన నీ పేరు జపమాయె.. 
యిదివరకెపుడు తెలియని ఎరగని 
తలపే మైమరిపిస్తూ ఉంటె 
కంటికేమో కునుకు దూరపు చుట్టమాయే

ఓ… ఓ… ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ 
ఓ… ఓ… ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ 




తల ఎత్తు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యమ్.యమ్.కీరవాణి, హారిక నారాయణ్ , శ్రీ సౌమ్య వారణాసి 

గిర గిర గిర గిర గిర గిర గిర గిర
సుడిగుండం లాగేస్తూ ఉంటే
బితుకు బితుకుమను ఊపిరికి
బతుకు బతుకు అని ఓపిక పోస్తూ
ఉక్కును ముంచే ఉప్పెనవై

ఎత్తు తల ఎత్తు… ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యా రయ్


తలవంచుకు చూసేదేమిటి
నిను కడ తేర్చే మన్ను
తల ఎత్తితె కనబడుతుంది
తన దాకా రమ్మను నిన్ను

పడదోసే సంద్రపు నీలం
ఎగదోసే గగనపు నీలం
అలిసిందా ఎగసిందా… అల
అల లాంటిదే కాదా… నీ తల
అలలాంటిదే కాదా… నీ తల
అలలాంటిదే కాదా… నీ తల

ఎత్తు తలఎత్తు… ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్

పడవైన అంతఃపురమైన
ఉనికి కొరకు పోరాటం తప్పదు
నువు చెయ్యాల్సిన పని చేసేయ్
ఏం జరిగినా పర్వా నై

ఎవరేమైనా అనుకోని
నీలో నిన్నే నువ్వే చూస్తూ
బిత్తరపడి గర్వపడేలా
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యా రయ్



ధంధం ధం పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, దామిని భట్ల 

పచ్చపచ్చ సెట్టు సేమ… పట్టు సీరెలంటా
నల్ల నల్ల ముళ్ళ కంప… నల్ల పూసలంటా
కిచ కిచలాడే ఉడుత పిచ్చుక… లాలి పాటంటా
గలగల పారే సేలలో నీళ్లు సనుబాలంట, ఆ ఆ

అడవితల్లి ఇంటికొచ్చిన… దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో… కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం
అడవితల్లి ఇంటికొచ్చిన… దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో… కట్టాలన్నీ గట్టెక్కిచ్చేద్దాం

ధంధం ధం తిరిగేద్దాం
ధంధం ధం దొర్లేద్దాం
ధంధం ధం తిరిగేద్దాం
ధంధం ధం దొర్లేద్దాం
ధం ధం ధం… తిరిగేద్దాం
ధం ధం ధం… దొర్లేద్దాం

ధం ధం ధం ధం దయ చూపలని
అడవిని అడిగేద్దాం
మన పాణాలన్నీ నిలిపే తల్లికి
సాగిల పడిపోదాం, ఆ ఆఆ

పొగమంచేమో సామ్రానేసి
ప్రేమగ తలనే నిమిరేనంట
సేతికి తగిలే పేడు బెరడు
తాయెత్తల్లే తడిమెనంట

మద్దే టేకు ఆకులు మనకు
విసన కర్రలు విసిరేనంట, హ హ హ
గడ్డి గరిక పచ్చిక మనకు
పరుపే పరిసి పిలిసేనంటా, హో

ధంధం ధం సూసేద్ధాం
ధంధం ధం సుట్టేద్దాం
ధంధం ధం అడవే మనకు
కోవెల అనుకుందాం
కోరక ముందే వరాలనిచ్చే
తల్లిని కొలిసేద్ధాం, ఆ ఆఆ

సుక్క సుక్కా దాచలంటూ
తేనేటీగే తెలిపేనంటా
సురుకుంటేనే బతుకుందంటూ
దుప్పి కడితీ సెప్పేనంటా

పెద్దపులితో తలపడు ధైర్యం
అడవి పందే నేర్పేనంటా
కలిసే ఉంటే బలముందంటూ
రేసు కుక్కలు సాటేనంట
పొట్టకూటికి ఏటాడేటి జీవులు సెప్పే పాటం ఒకటే
తిన్న ఇంటిని ధ్వంసం సేసే
పాపానికి ఒడికట్టొద్దంతే, ఏ ఏఏ

ధంధం ధం సదివేద్దాం
ధంధం ధం నేర్సేద్దాం
ధంధం ధం ఈ పాఠాలను
బతుకున పాటిద్దాం
అడవిని మించిన బడి లేదంటూ
అడుగులు కదిపేద్దాం, ఆఆ ఆఆ ఆ





కథలు కథలుగా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: కైలాష్ కెహర్, యామిని గంటసాల

కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ కథల గతులు అడవేనా
కాదని చెప్పవే… కారణం అడగకే మనసా
ఆశని భిక్షగా అడిగా ఇవ్వవే

ఓ, కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ కథల గతులు అడవేనా

పరిచయం అయిన గాలి… నా ఊపిరై చెలిస్తే
తన వశం అయిన ప్రాణం… తనువంతా దహిస్తే
తెగ ఎదురు చూసి తడిసింది కంటిపాపే
సెగ రగులుతున్న ఎద కోరే ఊరడింపే

కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
చితికి చితికి ఆ కథల బతుకు చితికేనా

అడిగితే నిన్ను నువ్వే… నా దారే ఎటంటూ
బదులుగా నీకు నువ్వే… చెబుతావో రహస్యం
ఏ ధూళిలోన కలిసిందో నీ ప్రపంచం
ఆ అణువు అణువు… వెతకాలి నీ వికాసం

చేరనీ గమ్యమే… చేరువై ఓ క్షణం


చెప్పదా ఈ నిజం, ఓ ఓఓ

నమ్మడం జీవితం
నమ్మడం జీవితం… నిను నువ్వే
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం… నిను నువ్వే



దారులు దారులు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నల 
గానం: యమ్.యమ్.కీరవాణి, హారిక నారాయణ్ 

రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్య రయ్ రయ్ రయ్ రయ్ రయ్య రయ్

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు, ఊ హు హు
సాగక తప్పని దారులు
ఏ జాడని చెప్పని తీరులు

మెతుకుని వెతికే ఆశల మూరలు
బతుకుని కొరికే ఆకలి కోరలు
చావో రేవో తేలేవరకు
ఆగకన్న పొలిమెరలు

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు

మెతుకును వేతికే ఏ ఏ… ఆశగ పోరలు
బతుకును కొరికే ఏ ఏ… ఆకలి కోరలు

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు..

ఓ ఓ, బద్ధెం మూపున కట్టుకుని
ప్యాణం పిడికిట పట్టుకుని
కరువుతొ కయ్యం పెట్టుకుని
గాయం గాయం తట్టుకొని
పంటపొలం నీడై పోగా
గుండెబలం నీరై పోగా

కొండపొలం చేయట్టుకుని, ఈ ఈ
చావో రేవో తేలేవరకు
ఆగకన్న పొలిమెరలు
చావో రేవో, ఓ ఓ తేలెవరకు
చావో రేవో తేలెవరకు ఆగకన్న పొలిమెరలు

దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారాలు
ఏ జాడను చెప్పని తీరులు

రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్…  రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్… రయ్ రయ్ రయ్యా రయ్



శ్వాసలో పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: యామిని గంటసాల, PVNS రోహిత్

నీలో నాలో… నీలో నాలో
నీలో నాలో… నీలో నాలో

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ
(నీలో నాలో… నీలో నాలో)
ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా
(నీలో నాలో… నీలో నాలో)

గుండె లోయల్లో… పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో… బాగు వోగుల్లో
మేను మరిచెలా… పైన పడుతున్నా
కూన డేగల్లో తేనెటీగల్లో, ఓఓ

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ
నీలో నాలో… నీలో నాలో
పరువములో అణువు అణువు… పరవశముండగా
(నీలో నాలో… నీలో నాలో)
పరవశమే అలలు అలలై… అలజడి రేపగా
(నీలో నాలో… నీలో నాలో)
ఏటితో ఆటలే… తేట తెల్లమై
రం రా రం రమే

శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ
ఆశలో పొద్దుల్ని మరిచే హాయి మోసా

గుండె లోయల్లో… పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో… బాగు వోగుల్లో
మేను మరిచెలా… పైన పడుతున్నా
కూన డేగల్లో తేనెటీగల్లో, ఓఓ
శ్వాసలో హద్దుల్ని దాటాలన్న ఆశ




రాయే రాయే రాంసిలకో పాట సాహిత్యం

 
చిత్రం: కొండపోలం (2021)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కాలభైరవ, శ్రేయా గోషల్

రాయే రాయే రాంసిలకో
రంజు భలే జత ఇదిగో
రాయే రాయే రాంసిలకో
రంగు భలే సెకలివిగో

సురుకైన సిన్నదంట
సరుకున్న సిన్నోడంట
కుదిరింది ఈ జంట
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
ఓ ఓహో ఓ హో హొయ్
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
హోయి హోయి హోయి హొయ్

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

చుక్కల్లో చీరను నేసి, నేసి
వెన్నెల్లో పానుపు వేసి, వేసి
కన్నుల్లో చూపే దీపం చేసి
వేచాను ఎదురే చూసి

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

హొయ్, చెరిసగమైపోయే వేలల్లోన లీలల్లోన
కలవరమే నాలో చూసేవా
పరవశమై పోయే దారుల్లోన తీరుల్లోన
పరుగులనే నాతో తీసేవా

కీచురాళ్ళ కూతలన్నీ ఇనుకోక
కోడికూత కూసిందేమో కనబోక
కూర్చొనీక నుంచోనీక
కౌగిట్లోనే బజ్జుంటాగా

అట్టా ఇట్టా తెల్లవారిపోయేనే
తానాలాడే తావుల్లో ఉంటావా
వందేళ్లు తప్పదీ సేవ
టెన్ టు ఫైవ్

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

మ్మ్ మ్, చుక్కల్లో చీరను నేసి, నేసి
వెన్నెల్లో పానుపు వేసి, వేసి
కన్నుల్లో చూపే దీపం చేసి
వేచాను ఎదురే చూసి

చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
హో, బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?

ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
ఓ ఓహో ఓ హో హొయ్
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
హోయి హోయి హోయి హొయ్

No comments

Most Recent

Default