చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ నటీనటులు: శర్వానంద్, సిద్ధార్ద్, అదితి హైదరి, అనుఇమాన్యుయేల్ దర్శకత్వం: అజయ్ భూపతి నిర్మాత: అనీల్ సుంకర విడుదల తేది: 14.10.2021
Songs List:
హే రంభ..రంభ పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: చైతన్ భరద్వాజ్ హే మందే ఇక మందే… ఇసాఖపట్నం బీచు తాగొచ్చు ఊగొచ్చు… ఏదైనా చెయ్యొచ్చు కొట్టెయ్ జై కొట్టేయ్… మనమంతా రంభ ఫ్యాన్సు కట్టేద్దాం బ్యానర్సు… పెట్టేద్దాం కటౌట్సు కొర్రామీను మాదిరి వర్రా వర్రగుంటది కుర్రాగాళ్ళ గుండెకి గాలం వేస్తదిరా ఎర్ర పెదవి కొరికితే… సర్రాసరి నవ్వితే బుర్ర తిరిగిపోతది… గిర్రా గిర్రా గిర్రా గిర్రా ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… పండగే ప్రారంభ హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా సోడా ఐస్ లేకుండా రెండు నైంటీలు గనక పీకామనుకో బాడీలో రంభ డాన్సు ఆడెద్దిరా మావా ఈల కొట్టెయ్ కొట్టెయ్… సౌండ్ పెట్టెయ్ పెట్టెయ్ డాన్సు కట్టెయ్ కట్టెయ్… దుమ్మే రేగాలా పూలు ఏసెయ్ ఏసెయ్… బీరు పోసెయ్ పోసెయ్ కోడి కోసెయ్ కోసెయ్, హే హే హే దీని అందం… మత్తు మందు సమానమే మునిగిపోదా దూకెయ్ దీని నడుం బాణాసంచా దుకాణమే ముట్టుకుంటే అది చాలా చాలా ప్రమాదం ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… పండగే ప్రారంభ హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా సాక్షాత్ శ్రీకృష్ణుడే… ఓ వేలితోటి కొండనెత్తాడే అరె ఒంటి చేత్తో ఆంజనేయుడే మరి సంజీవని ఎత్తుకొచ్చాడే అయ్య బాబోయ్ మనవల్ల కాదు మనమంతటి గొప్పోళ్ళం కాదు ఓ సీసానైనా ఎత్తకపోతే ఎట్టా మావా..? ఓ రంభ రంభ… హే రంభ హే రంభ రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… పండగే ప్రారంభ హే రంభ హే రంభ… రంభ రంభ రంభ రంభ హే రంభ హే రంభ… ఎక్కడే గుడుంబా
చెప్పకే చెప్పకే పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: దీప్తి పార్థసారథి, చైతన్ భరద్వాజ్, చైతన్య ప్రసాద్ చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు చాలులే వేలాకోలం ఊరుకో నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో ఎగసే కలలే అలలై… యెదనే ముంచేసేలే కదిలే కథలే కడలై… ఉప్పెనల్లే ఊపేసేలే ఎందుకీ బంధాలన్నీ కలపకులే, నిలపకులే గెంటేస్తాను గెంటేస్తాను… నిన్నిక ఇపుడే మనసా కనబడితే ఎదురుగ నిలబడితే చంపేస్తాను చంపేస్తాను తొందరపడితే చల్లనైన చూపు నువ్వే… మంచి గంధపు మాట నువ్వే ముళ్లకంచెలన్నీ తెంచి… పూల బాటవయ్యావే మోయలేని హాయి నువ్వే… నన్నే మార్చిన మాయ నువ్వే ముందు నువ్వు వెళ్తావుంటే… వెంట నీడనయ్యానే వేసవి వేడిలో లేతగాలై వచ్చావే మమతే కురిసి మనసే తడిసెలే నువు నా జతగా ఉంటె… బతికా నే ధైర్యమై తెలిసేనిపుడే ఇపుడే… జీవితాన మాధుర్యమే వింతగా నన్నే నేను మరచితినే, మురిసితినే నిన్నా లేని మొన్నా లేని… వెన్నెల విరిసే, మ్ మ్ మదికొక మది దొరికే… కలతల కథ ముగిసే అంతే లేని సంతోషాల కాంతులు కురిసే నువ్వు నేను వేరు అన్నా… నీవైపస్సలు చూడకన్నా దొంగలాగ కళ్ళే నిన్నే… తొంగి తొంగి చూసాయే పగ్గమేసి ఆపుతున్నా… ప్రేమే కాదిది స్వార్ధమన్నా సిగ్గులేని కళ్ళే ముగ్గులోకి తోసాయే నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే కుదురే మరచి వరదై ఉరికెలే తపమే తపమై జపమై… నిలిచా నీకోసమే జడిలా ముసిరే కసిరే… జ్ఞాపకాల్ని తోసేసాలే ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే, మది మురిసే గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే ఎద ఇది నిలవదులే… నిను ఇక వదలదులే ఆనందాల మహాసంద్రామాయను మనసే
హే తికమక పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: కిట్టు విస్సా ప్రగడ గానం: హరిచరణ్, నూతన్ మోహన్, చైతన్ భరద్వాజ్ హే తికమక మొదలే… ఎద సొద వినదే అనుకుందే తడువా… తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే హే తెలియక తగిలే… తొలకరి చినుకే మొహమాటం ఒడిలో… సరదాగా జారి వానై మారే హే ఎటుపోనుందో దగ్గరగా ఉన్నా దూరాలే చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే అడగాలన్నా చిత్తడి చూపుల్లో ఏముందో పెదవంచుల్లో రహస్యంలోన తలమునకలివే ఆ, తెగ తడబడుతూ పొరబడుతూ నిలబడితే ఎలా అరకొర చనువే వద్దొద్దని అడక్క నిలిచే ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే నక్కీ నక్కీ దాక్కుంటుంటే లోలో అందాలే వెతికినది విసిరినది చూపు కౌగిలే తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా ఒక్కింతైనా టెన్ టూ ఫైవ్ తిరిగొస్తుందేమో ఏ వివరం నచ్చి మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో ఎద కడలిలో అలలుగా ఎగసేనా ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే నచ్చి నచ్చి పైపై వాలే ప్రేమే చూపించే మగువనలా చులకనగా చూడరాదుగా వచ్చి వచ్చి వాలిందేమో సీతాకోకల్లే కన్నె కళ్ళే నా యద గుట్టే లాగాయే హే ఎగసిందా లోలోన ఆరాటం కాసేపైనా దాచే పని లేదా నా కలలో కూడా నువ్వే వచ్చి పిచ్చే పట్టించి ఏమెరుగక ఎదురుగా నిలవాలా ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
జగడాలే రాని పాట సాహిత్యం
చిత్రం: మహా సముద్రం (2021) సంగీతం: చైతన్ భరద్వాజ్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: హేమచంద్ర, చైతన్ భరద్వాజ్ ఎపుడు నువు తలెత్తుకో నిను మించిన తోపెవడిక్కడ వడిగా కలబడిపో భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్ తేల్చేసెయ్ ఎక్కడికక్కడ కొడితే ఎదురెలిపో దీని తస్సాదియ్యా నే చెప్పిన లక్షణాలు చూపించవు పుస్తకాలు నా వెంబడి నేరుగా… వస్తే చూపిస్తా నేనొకడికి లొంగడాలు ఓ పడిపడి మొక్కడాలు నా ఒంటికి పడదుగా తమాషాలొద్దు నాతో జగడాలే రాని రాని చూసుకుందాం చావోరేవో తేలిపోద్దిలే కెరటాల తోటి పోటి దేనికంట లెక్క పత్రం రాసుకోదులే ఎపుడు నువు తలెత్తుకో నిను మించిన తోపెవడిక్కడ వడిగా కలబడిపో భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్ తేల్చేసెయ్ ఎక్కడికక్కడ కొడితే ఎదురెలిపో ఎవడైతే ఏంటి కాతర లోకమెపుడు అరె బ్రదరు డేగ కళ్ళతో చూస్తు ఉంటది, వదులదురా నువు అవ్వకు కోడి… మిగలదు బాడీ అన్ని వేళల శాంతి మంత్రము వల్లెవేయకు కట్టేస్తారు పాడి ఆ సంగతి తెలుసు నాకు కాబట్టే పొగరు నాకు ఆ మాత్రం ఉండడం తప్పేం కాదంటా మైండ్ ఉన్నోడెవ్వడైన నాలాగే బతుకుతాడు నే చెప్పే మాటకే చెయ్యెత్తి మొక్కుతాడు ఎపుడు నువు తలెత్తుకో నిను మించిన తోపెవడిక్కడ వడిగా కలబడిపో భయపడితే బతకవు ఎక్కడ తిడితే నువు పడొద్దురోయ్ తేల్చేసెయ్ ఎక్కడికక్కడ కొడితే ఎదురెలిపో దీని తస్సాదియ్యా జగడాలే రాని రాని చూసుకుందాం చావోరేవో తేలిపోద్దిలే కెరటాల తోటి పోటి దేనికంట లెక్క పత్రం రాసుకోదులే (2)
మనసు మరిగే మౌనమే పాట సాహిత్యం
మనసు మరిగే మౌనమే
No comments
Post a Comment