చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: నాగేశ్వర రావు, శ్రీదేవి, మోహన్ బాబు, మధు మాలిని దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని విడుదల తేది: 1981
Songs List:
అయ్యారే తుంటరోడు పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: యస్.పి.బాలు, పి.సుశీల కోరస్: ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం ఝం అయ్యారే తుంటరోడు - ఒయ్యారం సంతకాడ వియ్యాలు సెయ్యమన్నాడే - అరే ఒలీ ఒలీ ఒలీ ఒలీ - ఉయ్యాలే ఊగాలో – జంపాలే పాడాలో అయ్యారే కొంటెపిల్ల ఒయ్యారం సంతకెల్లి వియ్యాలు సెయ్యమన్నాదే - అరె ఒలీ ఒలీ ఒలీ ఒలీ ఉయ్యాలే ఊగాలో, జంపాలే పాడాలో చిటికినేలితో చీకటితీసి కాటుక పెట్టాడే బొటన వేలుతో బుగ్గనుగిల్లి బొట్టుగ దిద్దాడే వచ్చే ఎన్నెల పెదవులతోటి నొక్కి పెట్టిందే అది ఎర్రని దొండపండై చిలకను రమ్మందే సిలకా సిలకా కూడబలికి .... ఆహో ఒయ్ ఆహా .... సిటుకూ సిటుకని జాడ తెలిసి ఊహూ ఒయ్ ఉహూ గూడుచేరి గుస గుస లాడేయి - కోడికూసే ఏళకు లేశాయి అరె తస్సాదియ్య కోడి కూసేఏళకులేశాయి చిక్కని నడుముకి దారం కట్టి బొంగరమాడాలీ చక్కెర పెదవికి బేరం పెట్టి సారం చూడాలీ చూడాలన్నా కుర్రగాడి సత్తా చూడాలి సుడిగాలల్లే సుట్టి సుట్టి సొమ్మ సిల్లాలి మల్లె తీగకు సెమటలు బడితే ఆహా మంచే అనుకుని బ్రమలోపడితే ఏకువ ఎలుగులు కితకిత లెట్టాలి రేకుల రెక్కలు కిటికీ తీయాలి అరె తస్సాదియ్య - ఏకువ ఎలుగులు కితకిత లెట్టాలి. ॥అయ్యారే ॥
చెమ్మ చెక్క పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల చెమ్మా చెక్కా సక్కనోడు జిమ్మా దియ్యా సిక్కనోడు సుక్కలలో మంచమేనేనే ఓలమ్మో పక్క చేరి మంతరించెనే చెమ్మా చెక్కా పక్కనమ్మ జిమ్మా దియ్యా సుక్కలమ్మ మంచమెక్కి లంచమిచ్చేనే - ఓలమ్మో కంచెనంట చేను మేసేనే ఎన్నెలోడు బలేసల్లనోడు ఒంటిగుంటె కొంటెవాడు అల్లరోడు ఎంట వుంటె ఒంటి నిండ ఎచ్చనోడు పల్లె పిల్లా ఒట్టి పిచ్చి పిల్ల ఒప్పకుంటే రాజుకున్న అగ్గిపుల్ల ఒప్పుకుంటె అచ్చమైన తెలుగు పిల్ల తెలుగులోని తీపంతా తెచ్చుకున్నది ఎలుగుతోనె రేపులా విచ్చుకున్నది రేపటికి మాపటికి వంతెనె నాది రెండు కలిపి సందెకాడ సొంతమై నాది మోజు చూడు దానిపోజు చూడు ముద్దబంతి పువ్వులాంటి మోముచూడు మూట గట్టి తెచ్చుకున్న ముద్దు చూడు చూసి చూసి వాణ్ణి కాపుకాసి కన్నెవయసు తెచ్చినాను గడియతీసి కాపురాని కొచ్చినాను ఏళజూసి ఏళ పాళ లేని ప్రాయమెగిరి పడ్డది తాళమంటే తాళనని గొడవపడ్డది గొడవపడ్డ గాలిగాడ్ని జాలి పడ్డది జాలిపడ్డ మనసులోకి జారిపడ్డది ॥చెమ్మా చెక్కా॥
మనసుల ముడి పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల మనసులు ముడి పెదవులు తడి మధువుల జడి ఎద తడబడి కోటిరాగాలు పాడే ఆ.... తనువుల వడి తపనల తలపుల సడి ఎద అలజడి శతకోటిరాగాలు పాడే లతవై నా జతవై గత స్మృతివై నా శృతివై స్వరజతివై లయగతివై నను పాలించవా..... ఒడిపై చారపడిపై నా బడిపై వరవడిపై | నా గుడివె దేవుడివె నను లాలించవా వలపు మెరుపు మెరిసీ – తలపు తలుపు తెరిచీ సిరి ముగ్గులు వేయించి చిరు దివ్వెలు వెలిగించి తొలిసారి పలికాను పలుకై అది నువ్వే అనుకున్నా - నీ నవ్వే వెలుగన్నా నీవు నా తోడు వన్నా అహొహొహో నేను నీ నీడనన్నా చెలివై నెచ్చెలివై చిరుచలివై కౌగిలివై లోగిలో జాబిలివై నను మురిపించవా వరమై సుందరమై - శుభకరమై ఆదరమై సంబరమై సాగరమై నన్ను ముంచేయనా కనులు తెరచి చూసీ కలలు నిజము చేసే చిరునవ్వులు నవ్వించీ సిరి మువ్వలు మోగించీ తొలిసారి పలికాను పలుకై ఆ పలుకే ఉసిగొలిపీ పరువముతో నను కలిసి సామగావాలు పాడే అహాహాహో సోమగానాలు చేసే
ఈ కొండ కోనల్లో పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఈ కొండకోనల్లో నీ రెండ ఛాయల్లో - ఈ ఎండిమబ్బుల్లో నీవే ఈ వాగువంకల్లో ఈ ఏటి తరగల్లో - తెల్లాటి నురగల్లో నేవే ఎలుతురు నేనె అహ ఎండవు నీవే సినుకులు నేనై అహా సిగురులు నీవై ఎన్నాళ్ల ఎన్నేళ్ల సావాసమో ...హోయ్ ఏర్రాని సందెమ్మవో పచ్చాని సిలకమ్మవో ఎచ్చని సలిమంటవో ఎదలోని గుడిగంటవో రాతిరివో వలపు జాతరవో సందడివో వయసు పందిరివో పందిట్లో చిందేసే చిన్నారివో చిందుల్లో చిన్నారీ కన్నయ్యవో చిగురు కొమ్మ కోకిలమ్మ పూలరెమ్మా కులుకులమ్మా ఈ కొమ్మ నా సొమ్మురో ఈ బొమ్మ పై డమ్మరో - నేరేళ్ల తోటుందిలే సీకట్ల పాటుందిలే నీ కళ్ల తోడుందిలే నా ఒళో సోటుందిలే చిన్నదిలే నడుము సన్నదిలే ఉన్నాదిలే ఉడుకుతున్నదిలే ఉడికించి ఊరించి రమ్మన్నాడే వచ్చాక నచ్చింది ఇమ్మన్నాడే విచ్చుకున్న ముద్దు గుమ్మ మెచ్చుకున్న పిచ్చిదమ్మ ఈ బొమ్మ సీతమ్మరో నా సొమ్ము రావయ్యరో
జంతర్ మంతర్ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మాలకడి దుమ్మురేగాలి ఓసూపు సూడాలి నీ అంతు తేలాలి కిటుకులు సెప్పమ్మా సిటికెలసిటెమ్మా దాసిందీ ఎన్నాళ్లు దాగుంటది – అది కళ్లున్న మొనగాడి కంటపడతది నీ కంట పడ్డాక నీ ఎంటే వస్తాది, – అది. వద్దన్నా ముద్దన్నా నీ జంటే అవుతాది తీ గట్టి లాగితే డొంకూగి పోతాది ఏ గట్టుకెళ్ళినా నీరట్టే వుంటాది సనుగుడు సంగయ్యా గొణుగుడు పాలయ్యా అ గజిబిజి గంగమ్మా - గడిబిడి చెయ్యకమ్మా తోడుంటే యాడైనా గూడుంటది ఆ గూడేమో మనకోసం కాసుకుంటది ఈ పూటే ఎడదామా మాపంతా వుందామా కుదిరొస్తే ఆగూడే సొంతంగా కొందామా సెయ్యెట్టి లాగితే గాజూడి పోతాది చేసేది సెబితే సీకాకు పుడతాది నసనస నరసమ్మా నకరాలాడొద్దమ్మా నిరనిర ఈరయ్యా నికరం సేయవయ్యా
వంటచేసి చూపిస్తా పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ వంట చేసి చూపిస్తా - పీట వేసి తినిపిస్తా అడాళ్ల కంటే మగాళ్ల వంటే అబ్బో గొప్పది అనిపిస్తా వంకాయ కూర, బెండకాయ పులుసు తోటకూర పప్పు ఏది కావాలి చెప్పు ఏమి చేయాలి? వంకాయ కూర చెయ్ బాబూ చూద్దాం.... తే తే తేతే కత్తి పీట - ఇదిగో ఇదిగో కత్తి పీట కత్తి పీట తోటి వంకాయ కోసి ముక్కలన్ని గిన్నెలో వేసుకో కుళాయి నీళ్లతో సుబ్బరంగ కడిగీ కండెక్కకుండా చూసుకో పాయ్యి మీద పెట్టాలి – కింద మంట పెట్టాలి ఆ తర్వాత ....? చెప్తా - గ గ గ గ గరం మసాలా మ మ మ మ మంచినూనే మ మ మ మ మపదపపా కలబోసేసి కలబెట్టీసి దోర దోరగా వేపుకో మాడకుండా చూసుకో - ఓం నలాయ నమః ఓం భీమాయ నమః ఓం వంటాయ మమః ఓం కూరాయ నమః ఇదిగో వంకాయ కూర ఆహా చారు కావాలి పప్పుచారు కావాలి తే తే తే తే కందిపప్పు ఇదిగో ఇదిగో కందిపప్పు పప్పులోని రాళ్లు తీసి నీళ్లలోన పోలెడేసి ఉడకేస్తే అప్పుడది ముద్దపప్పు చింతపండు పిసికేసి పప్పు కాస్త కలిపేసి కుత కుత లాడేట్టు మరగబెట్టు ఉప్పు చూసి వేయాలి పసుపు కాస్త కలపాలి ఆ తర్వాత ....? ప ప ప ప పచ్చి మిరపకాయ గ గ గ గ గపగరి గాగా ఉ ఉ ఉ ఉ ఉల్లిపాయ మ మ మ మ మపదపపా గారిమగా గపగా మపదా దనిసా సానీదప మగరిస బాబూ కొత్తిమిరి వేసి తాళింపు వేసి మూత పెట్టి కాసుకో పొంగకుండా చూసుకో ఓం నలాయనమః ఓం భీమాయ నమః ఓం పప్పాయ నమః ఓం చారాయ నమః
ఓ నవ మధన పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ కానుక (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఓ నవ మదనా రారా నా ప్రియ వదనా రారా సుమతరా మధుకరా- కళాసాగరా రాగసుధాకర రారా ॥ఓ వన ॥ నా నులివెచ్చని తొలి ఊపిరివి నా సుతిమెత్తని రసమాధురివి నీ రంగులలో శృంగారాన్నీ శృంగారంలో సంగీతాన్ని చిత్తంలో చిత్రంగా చిత్రంలో చైత్రంగా రావే సురగంగా - రా సరళంగా గంగాభంగ మృదంగరవంగా - భృంగీ భృంగ అభంగ స్వరంగా ఓ ఋతు సుందరి, రావే, నా సుమ మంజరి రావే రస ఝరీ, మాదురీ నయన మనోహరి నటన మయూరీ రావే ఆమె ॥ఓ నవ॥ నా వాణి వీణవు కావా నా బాణికి రాణిగరావా హా ప్రేయసి ఊర్వశి కానా నీ వాసికి దాసిగ రావా ||నీ ప్రేయసి|| పలుకు పలుకులో వెణుకు వెణుకుతో మినుకు మినుకులై పోమా సానిసగా - గారిగపా పామపసా - సానిసగా గారిమ గరిసా సానిని పనిదస సామదసమగిరి గారిమ గరిసా నా అంగ అంగమొక అసంగ రంగము సాససగాగగ మామమమా ఈ యవ్వన మొక క్షణ భంగురము ససస నినిని దదద మమమ ఈ అమని యామిని నీసిగ చండుగ మదనిస నిసనిద మదమా నీ కన్నుల నిండుగ కాముని పండుగ మద మద దనిదమ దనిదమ దనిసా ప్రియసఖీ శశిముఖీ నవరతీ మధుమతీ నేనే .... - ఆ.... ప్రణయ కావ్యమై - కావ్య నాం విరహ గీతికై - అపరి మేనకై నిను వరించి చెలించి నీవై మోహము మించి నాలో తాపము పెంచి నన్నే నీకర్పించి కర్పూరాన్నై కరిగి పోనీ కన్నెను నేటితో సతినై పోనీ నా ఈ జన్మము ధన్యము కానీ అన్యము లేదని ఐక్యము కానీ
No comments
Post a Comment