చిత్రం: పులి బిడ్డ (1981) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: కృష్ణం రాజు, శ్రీదేవి దర్శకత్వం: వి. మధుసూధనరావు నిర్మాత: నాను శేషగిరి రావు విడుదల తేది: 24.04.1981
Songs List:
బుజ్జి పాప బుల్లిపాప పాట సాహిత్యం
చిత్రం: పులి బిడ్డ (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్. పి. బాలు , పి.సుశీల బుజ్జి పాప బుల్లిపాప బోజ్జనిండా పాలుతాగి పండుకోమ్మా
నడుమా పాట సాహిత్యం
చిత్రం: పులి బిడ్డ (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం:యస్. పి. బాలు , పి.సుశీల పల్లవి: నడుమా... హ.. హ.. హ కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో నడుమే... హ.. హ.. హ కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో చరణం: 1 మోములోనా సందమామ గోముగున్నాదీ మోజు తీరా పున్నమల్లే నవ్వుతున్నాదీ మోములోనా సందమామ గోముగున్నాదీ మోజు తీరా పున్నమల్లే నవ్వుతున్నాదీ ఇంతకన్న ఏముంది ఎక్కడైనా.. ఏ చుక్కకైనా.. ఎంత చక్కనైనా ఏ చుక్కకైనా.. ఎంత చక్కనైనా కళ్ళే తారకలంటావు... కలలే కోరికలంటావు కళ్ళే తారకలంటావు... కలలే కోరికలంటావు అంటుమల్లె తీగ మల్లే అల్లుకుంటే... ఒళ్లు ఝల్లుమంటే... వయసు వెళ్ళువైతే కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా కన్నెలేడి నడుమా... సన్నజాజి తొడిమా ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో ఉండీ లేనీ ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో చరణం: 2 అద్దెరేయి నిద్దరేమో నిద్దరోయింది పొద్దు కూడా ముద్దు లేక గడవనంటోంది అద్దెరేయి నిద్దరేమో నిద్దరోయింది పొద్దు కూడా ముద్దు లేక గడవనంటోంది ఇంత కన్న చెప్పలేను సక్కనోడా.. చేతచిక్కినోడా.. తేనెచుక్కలోడా చేతచిక్కినోడా.. తేనెచుక్కలోడా కౌగిలి ఇల్లనుకుంటావు... కవితే కవ్వింతంటావు కౌగిలి ఇల్లనుకుంటావు... కవితే కవ్వింతంటావు కొండమల్లి పువ్వులాగ నవ్వుతుంటే... ఎండ ఎన్నెలైతే ఏడి సల్లనైతే... నడుమే... హ.. హ.. హ కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే కన్నెలేడి నడుమే... సన్నజాజి తొడిమే ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో ఉందో లేదో ఉయ్యాలరో... ఊగుతుంటే జాజిపూల జంపాలరో
కాశీవిశ్వనాథ తండ్రీ విశ్వనాథ పాట సాహిత్యం
చిత్రం: పులి బిడ్డ (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్. పి. బాలు పల్లవి: కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా.. నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి.. కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా.. నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి.. కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా.. చరణం: 1 కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చిందీ కాళ్ల మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది.. కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చిందీ కాళ్ల మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది.. పేగును తెంచిన అదే త్యాగం.. ప్రేమను తుంచిందా అది అంతరాత్మనే నులిమేసిందా... ఇక సత్యమన్నదే కరువౌతుందా... ఇక సత్యమన్నదే కరువౌతుందా... కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా.. చరణం: 2 శంభో మహదేవ హరహర శంభో మహదేవా శంభో మహదేవ హరహర శంభో మహదేవా దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్ష అన్నెం పున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్ష అన్నెం పున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్నిపరీక్ష ఒడి చేర్చుకోవా.. అమ్మా నన్ను గుడిలోని తండ్రే మనకు తీర్పు.. గుడిలోని తండ్రే మనకు తీర్పు.. కాశీ విశ్వనాథా.. తండ్రీ విశ్వనాథా.. నువ్వే తండ్రివైతే... నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి... కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా.. శంభో మహదేవ హరహర శంభో మహదేవా శంభో మహదేవ హరహర శంభో మహదేవా కాశీ విశ్వనాథా..తండ్రీ విశ్వనాథా..
వెయ్యి వెయ్యి పాట సాహిత్యం
చిత్రం: పులి బిడ్డ (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్. పి. బాలు , పి.సుశీల పల్లవి: వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది మనసుంటె వచ్చి వాలు నా పక్కన వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన పలకరింత కలిసింది పులకరింత తెలిసింది మనసుంటె వచ్చి వాలు నా పక్కన చలి చలి చలి చలి చలి.. చలి చలి చలి చలి చలి... చరణం: 1 వెచ్చ వెచ్చగుండమని నిచ్చెనన్నది.. వయసు వయసు అందుకే కలుపుతున్నది వెచ్చ వెచ్చగుండమని నిచ్చెనన్నది.. వయసు వయసు అందుకే కలుపుతున్నది కాదంటె ఊరుకోదు పగలైన ఎండరాదు పద పద పద పదమంటది జోడు చలి రెప రెప రెప రెప మంటది చూడు గిలి హా.. చలి.. హా.. చలి.. ఎక్కు ఎక్కు నిచ్చెన వాలు వాలు పక్కన అందమైన వలపుంది.. అందుకంటె పిలుపుంది రానంటె వూరుకోను నేను చచ్చినా ఎక్కు ఎక్కు నిచ్చెన వాలు వాలు పక్కన పలకరింత కలిసింది పులకరింత తెలిసింది చలివున్న చెలివుంటె భలే వెచ్చన చరణం: 2 వచ్చె వచ్చె నల్ల మబ్బు పిల్లగాలికి వచ్చి తెచ్చె వలపు జబ్బు పిల్లగాడికి వచ్చె వచ్చె నల్ల మబ్బు పిల్లగాలికి వచ్చి తెచ్చె వలపు జబ్బు పిల్లగాడికి గొడుగైనా ఆపలేదు గొడవైనా ఆగిపోదు ఉహు ఉహు ఉహు ఉహు మంటది పాడు చలి తహ తహ తహ తహ మంటది పడుచు గిలి హా.. చలి.. హా..అహా.. చలి.. వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన పలకరింత కలిసింది పులకరింత తెలిసింది మనసుంటె వచ్చి వాలు నా పక్కన వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది మనసుంటె వచ్చి వాలు నా పక్కన
మనసంతా మంగళవాద్యాలే పాట సాహిత్యం
చిత్రం: పులి బిడ్డ (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్. పి. బాలు, పి.సుశీల పల్లవి: మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే అనురాగ గీతాల సుమమాలలల్లి అనుబంధ గంధాలు మన మీద చల్లి దేవతలే.. దీవించువేళ మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే చరణం: 1 చిగురుటాకుల పందిరిలోన చిలకపాప పేరంటంలో కోయిలమ్మ మేళంపెట్టి కొంగు కొంగు ముడిపడుతుంటే ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో ఆశీర్వదించేనులే ఈ వసంతం ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో ఆశీర్వదించేనులే ఈ వసంతం ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం ఇక మనకు సొంతం మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే చరణం: 2 కలలు పండి గెలలేస్తుంటే కళ్లు నన్ను నిలవేస్తుంటే ఇద్దరొకటై గదిలో చేరి నిద్దర కోసం వెతుకుతు వుంటే ఏడేడు అడుగుల సప్తస్వరాలు నా ముద్దుమురిపాల మధురాక్షరాలు ఏడేడు అడుగుల సప్తస్వరాలు నా ముద్దుమురిపాల మధురాక్షరాలు ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు ఎన్నోవరాలు మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే మనసంతా మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే
No comments
Post a Comment