చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ నటీనటులు: యన్.టి.రామారావు, శోభన్ బాబు , కాంచన దర్శకత్వం: వి. మధుసూదనరావు నిర్మాతలు: సుందరలాల్ నహత, డూండీ విడుదల తేది: 12.05.1965
Songs List:
పరిత్రాణాయ సాధూనాం! శ్లోకం సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: గానం: ఘంటసాల పరిత్రాణాయ సాధూనాం ! వినా దుష్క ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥
రంభా ఊర్వశి తలదన్నే పాట సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె? ఇంద్రుని చంద్రుని అందాలూ ఈతని సొమ్మే కాబోలు రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె? నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక, రతియే కాబోలు ఇంద్రుని చంద్రుని అందాలూ- ఈతని సొమ్మే కాబోలూ మౌనముగానే మనసును దోచే- మన్మధుడితడే కాబోలూ తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమే? పరవశించీ పడచువానికి వధువుకానీ సొగసేల? కలికి సరసన పులకరించీ-కరగిపోవని తనువేల? ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేల?
తాకినచోట ఎంతో చల్లదనం పాట సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: దాశరథి గానం: పి.సుశీల తాకినచోట ఎంతో చల్లదనం తక్కినచోట ఏదో వింతజ్వరం పెదవులేల వణికెను. వణికెను హృదయమేల బెదిరెను బెదిరెను వింతకోరిక మొలచెను, మొలచెను ఎవరో నన్నే తలచీ, పిలిచీ కలచెనూ ఏమి సుఖం-ఏమి సుఖం ఏమని చెప్పుదునే ఈ పులకింత ఈ గిలిగింత ఎన్నడు ఎరుగనులే చెంపకు చెంప ఆనించీ- ఇంపగు కథలను చెప్పవటే నీలో నన్నే నింపుకొనీ నేలకు స్వర్గం దింపవే కన్యల మధ్యన ఈ వలపు కలలో ఇలలో కలగదులే నీలో ఏదో ఉన్నదిలే నిజం తెలియరాకున్నదిలే....
అదుగో నవలోకం పాట సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల అదుగో నవలోకం వెలిసే మనకోసం ఆదిగో నవలోకం వెలిసే మనకోసం నీలి నీలి మేఘాల లీనమై ప్రియా! నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై దూర దూర తీరాలకు సాగుదాం సాగి దోరవలపు సీమలో ఆగుదాం ఎచట సుఖముందో, ఎచట సుధగలదో అచటె మనముందామా.... పారిజాత సుమదళాల పానుపూ, మనకు, పరచినాడు చెఱకు వింటి వేలుపూ, ఫలించె కోటి మురిపాలూ-ముద్దులూ మన ప్రణయానికి లేవు సుమా హద్దులు- ఎచట హృదయాలూ, ఎపుడు విడిపోవో అచట మనముందామా
చూచీ వలచీ పాట సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల చూచీ వలచీ చెంతకు పిలిచీ నీ సొగసులు లాలనజేపి నీ సొంపుల ఏలికనైతి చూచీ - వలచీ చెంతకు చేరీ సొగసులు కానుకజేసి నీ మగసిరి బానిసనైతి అందాలన్నీ దోచీ ఆనందపుటంచుల చూచీ సందిట బందీ చేసినా బందీ వశమై పోతీ నూతన వధువై నిలచీ-వరుని వలపుల మధువై మారీ సుఖునీ, ఒడిలో సురిగి కోటి సుఖముల శిఖరము నైతి వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా, జగమూ, మరచీ.... నీవే జగమై నీలో సగమై నేటికి నిండుగ పండితి........
ఈ వెండ్రుకలు పట్టి పాట సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: తిక్కన గానం: పి.సుశీల ఈ వెండ్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి తొలుతగాఁ, పోరిలో దుస్సపేను తనువింతలింతలు దునియలై చెదరి. రూపరియున్నఁ గని, యుడుకారుగా క యలుపాలఁ బోనుపడునట్టి చిచ్చేయిది? పెనుగద పట్టిన భీమసేను బాహుబలంబును, పాటించి గాండీవమను నొక విల్లెప్పుడును వహించు కట్టి విక్రమంబు, గాల్పనే. యిట్లు బన్నములు వడిన ధర్మనందనుండు నేను, రాజరాజు పీనుఁగుఁ గన్నార గాన ఐడయమైతిమేని, గృష్ణ !
కల్లా కపటం రూపై వచ్చే పాట సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: సముద్రాల గానం: యస్.జానకి కల్లా కపటం రూపై వచ్చే నల్లనివాడా తా! చల్లానమ్మే పిల్లల వెతికే అల్లరివాడా రా ద్వారక వీధి నీరధిలోనా దాగిన ధీరా, రా! చెరను పుట్టి చెరలో పెరిగిన మాయలమారీ రా గొట్టెలు, బజ్జెలు మేపేవానికి రాజ్యము ఏలయ్యా? అవనీ పాలన అతివలతోటీ ఆటలు కాదయ్యా.... అష్టమి పుట్టినవాడా! ముదిపామును కొట్టినవాడా! మద్దుల గూల్చినవాడా! ముసలెద్దును జంపినవాడా! కొంటెకృష్ణా! గోపీకృష్ణా! అనాధకృష్ణా! కన్నెదొంగా! వెన్నెల దొంగా! దారుల దొంగా! చీరెల దొంగా! కల్లరి కృష్ణా! అల్లరి కృష్ణా! కల్లా కపటం కానరాని చల్లని స్వామీ రా! ఎల్లరికీ సుఖముగోరు నల్ల నిస్వామీ రా! వైరినైన కరుణనేలు పరమాత్మా రా! సభలో ద్రౌపదినీ దయగనిన ప్రభో రా! భ్రమతో నిను దూరే మా కనుల పొరలు తొలగే విందజేయు నోటితో నె పొగడజేతు నీ మహిమా ..... రా. రా. రా!
బానిసలంచు పాండవుల (పద్యం) సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: తిక్కన గానం: మాధవపెద్ది బానిసలంచు పాండవుల ప్రాణముతో విడ, సంతసింప కౌ రా నను భాగ్యమిన్మునెదరా బెదరింతువా? సిగ్గుమాలి యా -హ్వానము చేసినంతనే సెబాసని నేర్పరివోలె రాయడా రానికి వచ్చినావె? భలిరా! మతిబోయెనా? నందనందనా!
రాధేయుండును దుస్స సేముడున (పద్యం) సాహిత్యం
చిత్రం: వీరాభిమన్యు (1965) సంగీతం: కె,వి,మహదేవన్ సాహిత్యం: తిక్కన గానం: మాధవపెద్ది రాధేయుండును దుస్స సేముడును పోరంద్రాపుగా పాండవ క్రోథ జ్వాలణ నాగు ఒండొరు నాకుఁదోడె చాలింక నీ బాధల్ వ్యర్ధము, వాడి సూది మొన మోపంజాలునంతైన నే నీ ధాత్రీతలమీను వారలకు పోరే తథ్యమౌ మాథవా !
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
No comments
Post a Comment