చిత్రం: అనార్కలి (1955) సంగీతం: పి. ఆదినారాయణ మాటలు, పాటలు: సముద్రాల నటీనటులు: నాగేశ్వరరావు, కన్నాంబ, సురభి బాలసరస్వతి, హేమలత దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య నిర్మాత: పి. ఆదినారాయణ, అంజలీదేవి విడుదల తేది: 28.04.1955
Songs List:
జీవితమే సఫలమ పాట సాహిత్యం
చిత్రం: అనార్కలి (1955) సంగీతం: ఆదినారాయణ సాహిత్యం:: సముద్రాల గానం: జిక్కీ జీవితమే సఫలమూ - రాగ సుధా భరితమూ ప్రేమకధా మధురమూ హాయిగా తీయగా ఆలపించు పాటల వరాల సోయగాల ప్రియుల వలపుగొలుపు మాటల అనారు పూలతోటల ఆశ దెలుపు ఆటల వసంత మధురసీమల ప్రశాంత సాంధ్య వేళల అంతులేని వింతలు అనంత ప్రేమలీలల వరించు భాగ్యశాలుల - తరించు ప్రేమజీవుల
రావోయి సఖా ! పాట సాహిత్యం
చిత్రం: అనార్కలి (1955) సంగీతం: ఆదినారాయణ సాహిత్యం:: సముద్రాల గానం: ఏ.ఏమ్. రాజా, జిక్కీ సిపాయీ! బిరాన రావోయీ! మన తరాన ప్రేమ పరువు మాయరాదోయి రావోయి సఖా రావోయి సఖా ! నీ ప్రియసఖి -- చేరగదోయి లోకానికి మన ప్రేమ విలువ తెలుపు సిపాయి పరుప నిలుపు సిపాయి రారాజునకూ, నీ చెలికీ పడెను లడాయీ రాజాలవనీ, పొదుషహా - పలికె బడాయీ రానింతుననీ పంతము నే పలికితినోయీ లోకానికి మన ప్రేమ విలువ - తెలుపు సహా పరువు నిలుపు సిపాయీ మన ప్రేమలు మన బాసలు మరువకుము సఖా! జన నాధుని జడిపింపుల వెరువకుము సఖా! పెను గాలివలే పరుగుడి రావోయి సఖా! లో కానికి మన ప్రేమవిలువ తెలుపు సిపాయీ పరువు నిలుపు సిపాయీ కలిగించకు నీ ప్రియతమకూ - పరాభవాలు కలిగించుము నీ ప్రభువునకు - పరాజయాలు విస్తుతించును నీ ధీరతనూ ముందుతరాలు రావోయి సఖా ! రావోయి సఖా ! రావోయి సిపాయీ!- రావోయి సిపాయీ !
నను కనుగొనుమా పాట సాహిత్యం
చిత్రం: అనార్కలి (1955) సంగీతం: ఆదినారాయణ సాహిత్యం:: సముద్రాల గానం: జిక్కీ ఓ ప్రియతమా ! మరువకుమా ! ప్రేమా రావో ప్రియతమా ! నను కనుగొనుమా కొనుమా మది మరువకుమా ! ప్రేమా ! ||రావో॥ దరిజేర నేరవా - చెరమాపజాలవా చే జారెనేని నీవు - చెలి జాడ కానలేవు వెలలేని నాదుసౌరు - వెలపోయ బూనినారు బ్రతుకాయె నడిబజారు. ఆయే, మది బేజారు అందాలు జాలువారే - మురిపాల పూలబాల. పసదూలి కటికవానీ - పాదాలు పాలుగానా
సోజా, నా మనోహారీ పాట సాహిత్యం
చిత్రం: అనార్కలి (1955) సంగీతం: ఆదినారాయణ సాహిత్యం:: సముద్రాల గానం: సోజా, నా మనోహారీ సోజా, సోజా, సుకుమారీ సోజా జోగే పూవులు తీగలాగ తూగే తుమ్మెద రాగ లాగ ఆదమరచి హాయిగా విరిసే వెన్నెల కోటలోన మురిసే కన్నుల కాపులోన రాకుమారి తీరునా ఎవరూ నీ దరిజేరలేరు మనలా వేరు చేయలేరు ఆదమరచి హాయిగా
ప్రేమా జగాన పాట సాహిత్యం
చిత్రం: అనార్కలి (1955) సంగీతం: ఆదినారాయణ సాహిత్యం:: సముద్రాల గానం: జిక్కీ ఓ వరాల సిపాయీ! కలవోలె మన "ప్రేమ కరిగి పోవునా ! - మలి చూపులోనే మరిగి మాయమానా! హా ... ప్రేమా జగాన, వియోగానికేనా!! ఇల వేల్పు లొసగే వరా లీవిధాల నులి వేడి కన్నీటి సెలయేటిజాల హా... ప్రేమాజగాన విషాదాంత మేనా... ప్రేమాజగాన వియోగాని కేనా ప్రేమగాధ విషాద ంత మేనా హా... ప్రేమగాధ విషాదాంత మే నా కధమారిపోయె, కలలు మాసిపోయె ఆకాశ సౌధాలు యిలకూలిపోయె గతిలేని యీ పేద బ్రతుకారిపోయె ప్రేమాజగా నా వియోగానికేనా హా ... ప్రేమ గాధ విషాదాంత మేనా జగమేలు జాలు మహారాజు పెన పగయేల యీ లీల బాధింప నేల బలి సేయుదానా ప్రాణాలనై నా బతికించు షహజాదనూ! ఐ ఖుదా నీకో సలామో ఖుదా ఐ ఖుదా
ఖులాసాల సరసాల పాట సాహిత్యం
చిత్రం: అనార్కలి (1955) సంగీతం: ఆదినారాయణ సాహిత్యం:: సముద్రాల గానం: జిక్కీ ఖులాసాల సరసాల కురిపింతురా! ఖుషీ గా విలాసాల మురిపింతురా ! హమేషా తమాషాల అలరింతురా! అందచందాలుగనీ ఆదరించు నారాజా ! అందాల ఆనందం అందుకో నారాజా! రంగారు సింగారముల రాసలీల పొంగారు సంగీతముల రాగమాల చెంగుచెంగని యాడు నాట్యాలమాల ఉంగరంగేలిగా లాలింపరా కొంగుబంగారుగా కులికింపరా జగన్మోహనాంగ దరిజేరరా
రాజ శేఖరా! పాట సాహిత్యం
చిత్రం: అనార్కలి (1955) సంగీతం: ఆదినారాయణ సాహిత్యం:: సముద్రాల గానం: ఘంటసాల , జిక్కీ మదన మనోహర సుందర నారీ ! మధుర దరస్మిత నయన చకోరీ ! మందగమన జిత రాజమరాళీ నాట్యమయూరీ ! అనార్ కలీ ! అనార్ కలీ ! ఆనార్ కలీ ! . రాజ శేఖరా! నీపై మోజు తీరలేదురా రాజసాన యేలరా! మనసు నిలువ నీదురా! మమత మాసిపోనుకా! మధురమైన బాధరా ! మరపురాదుగా! కాని దానకానురా ! కనుల నైన కానరా! జాగు సేయ నేలరా ! వేగ చేరదీయరా! చేరరార! చేరరార! చేరరార!
కలిసే నెలరాజు పాట సాహిత్యం
Song Details
కలవారి హృదయాలు పాట సాహిత్యం
Song Details
ఆనందమే అందాలు పాట సాహిత్యం
Song Details
మా కథలే పాట సాహిత్యం
Song Details
No comments
Post a Comment