Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nindu Noorellu (1979)




చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్  జయసుధ, మోహన్ బాబు
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: మిద్దే రామారావు
విడుదల తేది: 14.11.1979



Songs List:



చిన్న పొన్నీ చిలకల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: సుశీల, యస్.పి బాలు, శైలజ

చిన్న పొన్నీ చిలకల్లారా చిట్టిపొట్టి జింకల్లారా
మా నాన్న వచ్చిన రోజు మా అమ్మ నవ్వినరోజు
నాకిది పండుగరోజు నిండు నూరేళ్ళ పండగరోజు
హాపీ డే, జాలీ డే - కమాన్ సింగ్ డాడ్
గూట్లో పిల్లల కువకువలు గువ్వల జంటల గుసగుసలు
ఎందుకు మమ్మీ పిల్లల అల్లరి ఏమిటి గువ్వల సందడి...

అమ్మా ఆకలి అన్నం పెట్టమనీ పిల్లలుచేసే అల్లరులు
తల్లీ పిల్లలు ముద్దులతో అవి చల్లగ రేగిన సందడులు
అవునా డాడీ...

పిల్లల పిలుపుల కువకువలు కన్నవారికి వేకువులు
ఆ పిల్లల అల్లరి కిలకిలలే మళ్ళీ చూడని వెన్నెలలు
యస్ డాడీ యువార్ రైట్....

కొమ్మల రెమ్మల పువ్వులలో తుమ్మెద పాపలు కెవ్వుమనే
ఎందుకు మమ్మీ తుమ్మెద అల్లరి ఏమిటి కొమ్మల సందడి
అమ్మా తీయగా జోల పాడనుని తుమ్మెద తీసేరాగాలు
కొమ్మ రెమ్ముల ఊయెలలో అవి పువ్వులలాలిపాటలు
అవునా డాడీ

తెలిసీ తెలియని పువ్వులలో కొన్ని మాత్రమే తుమ్మెదవి
ఆ విరిసీ విరియని పువ్వులలో కొన్ని పువ్వులా దేవుడివి
యస్ డాడీ యస్ యువార్ రైట్





కొండంత దేవుడవు నీవు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. శైలజ

కృష్ణా .... .... కృష్ణా....

కొండంత దేవుడవు నీవు - గోరంత దీపాన్ని నేను
దీపాలకు దీపమే నీవు - అందుకే నా దైవమైనావు
నిన్ను చూడాలని కన్నులే చూపులై చూడలేక కన్నీటి చుక్కలై
యమునగా పొంగినా పదములే కడిగినా -
నిరు పేద హారతి నీవందుకోవా
నీ ఆలయ జ్యోతిగా ననుచేసుకోవా

ఈ దీపమింక వెలిగేది ఎన్నాళ్లో 
నీ రూపమింక చూసేది ఎన్నడో!
దీపమె వెలిగినా నీడఏ మిగిలినా 
వెలిగేది నీ కాంతి రూపం  మిగిలేది కన్నయ్యా నీ నీలవర్థం




కొండంత దేవుడవు నీవు 2 పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్. పి. శైలజ

కృష్ణా .... కృష్ణా....

కొండంత దేవుడవు నీవు - గోరంత దీపాన్ని నేను
దీపాలకు దీపమే నీవు - అందుకే నా దైవమైనావు
నిన్ను చూడాలని కన్నులే చూపులై చూడలేక కన్నీటి చుక్కలై
యమునగా పొంగినా పదములే కడిగినా -
నిరు పేద హారతి నీవందుకోవా
నీ ఆలయ జ్యోతిగా ననుచేసుకోవా

ఈ దీపమింక వెలిగేది ఎన్నాళ్లో 
నీ రూపమింక చూసేది ఎన్నడో!
దీపమె వెలిగినా నీడఏ మిగిలినా 
వెలిగేది నీ కాంతి రూపం  మిగిలేది కన్నయ్యా నీ నీలవర్థం




అందాల సీతమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్. పి. బాలు

అందాల సీతమ్మ పెళ్లి కూతురాయే
ఈ పెళ్లికళ చూసి మురిసిపో ... నీ తీపి కన్నీళ్లు తుడుచుకో...

సిరివెన్నెల కన్నెకు సిరిగల సీతమ్మకు
చినవాడు దొరికాడు శ్రీరామ చంద్రుడు
తానే కట్నమై తరగని కానుకై
తరలి వచ్చె సీతమ్మ కళ్యాణ వేళ

పెళ్లి మంత్రాలతో మేళతాళాలతో....
జరుగుతోంది సీతాకల్యాణం 
అమ్మకన్న ఎవరమ్మా దీవించే దేవత ....?
ఆమ్మ కన్న లేదమ్మా దీవించే మమత
కన్నీటితో కడుగు కన్నతల్లి పాదాలు 
అత్తింటి కోడలుగా అవేనీకు వేదాలు

నీనుదుటి బొట్టేకే బిడ్డనై పుట్టాను
పారాణీ పాపనై తరలి వెళుతున్నాను
నీ దీవెనే చాలు నిండు నూరేళ్ళకి
దీవించి పంపవే అత్త వారింటికి 



కుందేలు పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, యస్. పి. బాలు

అల్లి బిల్లి కుందేలు పెళ్లి కొడుకు
జాబిలి కుందేలు పెళ్లి కూతురు
అందాల కుందేళ్ల కల్యాణము
అడివంత కల్యాణ వైభోగము
హంసక్కా ఎంచక్క పేరంటమాడగా
నెమలక్క పురివిప్పి తైతక్కలాడగా
గోరవంక ఒకవంక మంత్రాలు చదవగా -
చిలకమ్మ చిగురాకు సన్నాయి పాడగా
చిట్టి ఊపిరి బుడగలు చిన్ని వెన్నెల బుడుగులు 
అభముశుభము ఎరుగని బడుగు ప్రాణులు పాపము

ఏమి నేరము చేసినాయని ఇంత ఘోరము జరిగెనో
ఎవరిశాపము తగిలేనో,

కుందేలు: 
అగండి
చంద్రుడి అంశనుపుట్టినవాళ్లం
వెన్నెల మడుగున పెరిగిన వాళ్లం
వెనక్కి తిరిగి వెళ్లకపోతే చంద్రుడు వస్తాడు 
మా చంద్రుడువస్తాడు. మీ భరతం పడతాడు

ఏనుగు: 
చంద్రుడు లేడు - గింద్రుడు లేడు 
కోతలు కొయ్యొద్దు నీ గొప్పలు చెప్పొద్దు 
ఉంటే రమ్మను వెంటనే రమ్మను
చంద్రుణ్ణి పొద్దు

కుందేలు: 
ఓ చందమామా మా మేనమామా
ఇలవంక దిగిరారా నెలవంకమామా
నీలో వున్నది మేమే అన్నది నిజమే అయితే దిగిరా
వెన్నెల వెలుగులు కురిపించు
చీకటి కళ్లను తెరిపించు 
నీవున్నావని నిరూపించు




సీతారాముల ప్రేమకధా పాట సాహిత్యం

 
చిత్రం: నిండు నూరేళ్ళు (1979)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. శైలజ, పుష్పలత

వినరయ్యా యీ రామకధా
సీతారాముల ప్రేమకధా
తండ్రిమాట పాలించంగా
రాముడు అడవికి చేరంగా
సీత లేడిని కోరంగా రాముడు వేటకు వెడలంగా
భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాం దేహి

లక్ష్మణ యిది స్వామీ రక్షణ రేఖ యిది
రక్షదాటి నే భిక్షను వేయను ఆర్యుల ఆజ్ఞ ఇది. స్వామీ
షట్కాల శివపూజా నిరతుడ
ధిక్కాల ఆనపధ్య చరిత్రుడ
అతి పవిత్రుడను - అఘలవిత్రుడను
అతివా సన్మతివా కులసతివా....ఆయ్ 
అయితే తక్షణ లక్ష్మణ రేఖా అతిక్రమణమే నీ ధర్మం 

భవతీ భికందేహి స్వామీ
సతీమ తల్లిని సీతా సాధ్విని
పతిత రావణుడు అపహరించగా
సీతను బాసిన రామచంద్రుడు వియోగమున విలపించగా

ఓ సుప్రభాతమా ఓవసంతమా ఓ హరిణీలలామా
నా సీత కనిపించెన తన జాడ మీకైన తెలిపెనా...
రామా రామనియేవు, రాముని తలచేవు
ఇంకా ఎక్కడిరాముడే భామరో
రావణుడే రాముడే యీ రావణుడే దేవుడే
శ్రీ రాంరాం జయరాంసీతారాం మాతా సీతా పూత చరిత 
హనుమనేనే వినుమా రాముని దూతను రావణ ఘాతను 
ఆంగుళీయకము గొనుమా అమ్మా అమ్మా
జయజయ రాం సీతారాం


No comments

Most Recent

Default