చిత్రం: అనుభవించు రాజా (2021) సంగీతం: గోపిసుందర్ నటినటులు: రాజ్ తరుణ్, కాసిష్ ఖాన్ దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి నిర్మాత: సుప్రియ యార్లగడ్డ విడుదల తేది: 26.11.2021
Songs List:
అనుభవించు రాజ పాట సాహిత్యం
చిత్రం: అనుభవించు రాజా (2021) సంగీతం: గోపిసుందర్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: రామ్ మిరియాల రాజు వెడలె రవితేజము లలరగ నారీమణుల కళ్ళు చెదరగా వైరి వీరుల గుండెలదరగా అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ కల్లుకైనా కనికరించవా మందుకైనా మన్నించవా అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజ మొలతాడైన గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా అనుభవించు రాజ ఒకే ఒక జీవితం నీకు తెలియదా సుఖాలలో ముంచేద్దాం… అదేం ఖరీద ఆలోచిస్తే బుర్ర పాడు అందుకనే ఆడి పాడు రాజా అనుభవించు రాజ అనుభవించు రాజా అనుభవించు రాజా అడిగేదెవడు నిన్ను… ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజా మొలతాడైన గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా అనుభవించు రాజ సంపాదించేయడం అంతా దాచేయడం తినడం తొంగోడం… రోజు ఇంతేనా కొంచం సరదాగా… కొంచం సరసంగా ఉంటే తప్పేంటి… మనిషై పుట్టాక చెయ్యి దురదెడితే కాలీగెందుకుండాలి ముక్కులో పుల్లెట్టి తుమ్మేస్తుండాలి మంచిదో సెడ్డదో… ఏదో ఒక రకంగా ఊళ్ళో మన పేరు మోగిపోతూ ఉండాలి, ఈఈ అనుభవించు రాజ అనుభవించు రాజా అనుభవించు రాజా అడిగేదెవడు నిన్ను… ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజా దీపం ఉన్నపుడే అన్నీ సర్దేద్దాం వయసులో ఉన్నపుడే అన్నీ చూసేద్దాం బతికిన కొన్నాళ్ళు బాగా బతికేద్దాం పాపం పుణ్యాలు దేవుడికొదిలేద్దాం కాలే కదపకుండా… ఉంటే నీడ పట్టున వయసై పోయినట్టు ఎంత సులకనా మనిషికి ఉండాలి కొంచం కళాపోషణ లేదా ఏం లాభం… నువ్వెంత బతికినా, ఆఆ అనుభవించు రాజ అనుభవించు రాజా అనుభవించు రాజా అడిగేదెవడు నిన్ను… ఆపేదెవడు నిన్ను నువ్వు నీ మాట విను రాజా అనుభవించు రాజా మొలతాడైన గాని మనతో రాదు అని త్వరగా తెలుసుకోరా రాజా అనుభవించు రాజ
నీ వల్లేరా పాట సాహిత్యం
చిత్రం: అనుభవించు రాజా (2021) సంగీతం: గోపిసుందర్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: రమ్యా బెహ్రా ఏంటో నిను తలచి తలచి కనులు తెరిచి కలగంటున్నా ఏంటో నువు ఎదురు పడితే ఎదని అదుపు చెయ్యలేకున్నా నీ వల్లేరా… నీ వల్లేరా నే తొలిసారి… మబ్బుల్లో తిరుగుతున్నా నీ వల్లేరా… నీ వల్లేరా నే ప్రతిసారి… ఊహల్లో ఒరుగుతున్నా, హో ఓ ఓ నా మనసులో ఈ తకధిమి నే ఇప్పుడే వింటున్నది నీ వల్లేరా… నీ వల్లేరా నా మాటల్లో… తడబాటే పెరుగుతోంది నీ వల్లే రా… నీ వల్లే రా నా నడకల్లో… తేడా తెలిసిపోతోంది, హో ఓ ఓ ఏంటో నిను తలచి తలచి కనులు తెరిచి కలగంటున్నా ఏంటో ఇది అదని ఇదని కథలు కథలు పడిపోతున్నా నా పెదవుల… ఈ గుసగుస నీ చెవులకే… ఏం తెలపదా నీ వల్లేరా… నీ వల్లేరా నే పడిపోయా… దూకే మనసు ఆపలేక నీ వల్లేరా… నీ వల్లేరా నేనైపోయా అచ్చంగా… నువ్వు నాలా, హో ఓ ఓ
బతికేయ్ హాయిగా పాట సాహిత్యం
చిత్రం: అనుభవించు రాజా (2021) సంగీతం: గోపిసుందర్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: దీపు బతికేయ్ హాయిగా ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా ప్రతిదీ అంతలా… భూతద్దంలోంచి చూడక బతికేయ్ హాయిగా ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా ప్రతిదీ అంతలా… భూతద్దంలోంచి చూడక నచ్చితే కలిపేసుకుపోరా… వదులుకోకు ఏ ఒక్కరిని ఏయ్ నువ్ సర్దుకుపోరా… నచ్చకున్నా గాని మనసే పడి హత్తుకుపోరా… వంద ఏళ్ళ ఈ బహుమానాన్ని గోలా గొడవలతో నింపెయ్యకురా దాన్ని తెల్లారి లేవగానే… గజిబిజిగా పరుగులేరా ఈ జానెడు పొట్ట కోసం… దినదిన గండంరా చుట్టూ ఓ సారి చూడు… ఎవడు సుఖపడుతూ లేడు నీలాగే వాడు కూడా తడబడుతున్నాడు కనుకే ఎపుడైనా… నీ మనసుని నొప్పిస్తాడు ఎదో పొరపాటే చేస్తాడు… పోన్లే అని నువ్వే నీలో అనుకుంటే వాడు వీడు మనవాడే అయిపోతాడు బతికేయ్ హాయిగా ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా ప్రతిదీ అంతలా… భూతద్దంలోంచి చూడక కోపాలే పెంచుకుంటే… ఆవేశం అంచునుంటే మన కంటికి బుద్ధుడైన… శత్రువు అయిపోడా సరదాగా పలకరిస్తే… చిరునవ్వే చిలకరిస్తే వద్దంటూ ఎవ్వడైనా… దూరంగుంటాడా ఎదో ఒక లోపం ఉన్నోడే మనిషవుతాడు లేదా అయిపోడా దేవుడిలా, ఆ ఆ ఎపుడూ ఎదుటోల్లో… తప్పుల్నే వెతికేటప్పుడు నువ్వు మనిషే అని… గుర్తు చేసుకోవా (హాయిగా, రాదుగా… అంతలా, చూడక హాయిగా, రాదుగా… అంతలా, చూడక)
కాకి నెమలికే ఓటు పాట సాహిత్యం
చిత్రం: అనుభవించు రాజా (2021) సంగీతం: గోపిసుందర్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: రోల్ రిడ నిలబడి హామీ ఇస్తున్నాడు అడగని ప్రామిస్ చేస్తున్నాడు అడిగితే ప్రాణం పెట్టేస్తాడు గతుకుల బ్రతుకులు మార్చేస్తాడు ఆన్ లైన్ లోనే ఉంటాడు వాట్ కెన్ ఐ డు అంటాడు ఓటమి ఎరుగని కుర్రాడు ఓట్ల కోసం వచ్చాడు లేడీస్ కి అంత హార్డవర్క్ వద్దని ఇచ్చేస్తాడు వాషింగ్ మెషిన్ చేతులు నొప్పెడుతాయని చెప్పి తెచ్చిస్తాడు గ్రైండింగ్ మిషిన్ పెళ్ళీడొచ్చిన పాపల కోసం గిఫ్ట్ ఇస్తాడు టీవీ సెట్ కాకి నెమలికే ఓటు మీకు ఉండేదే లోటు వీడికేస్తే మీ ఓటు మారుతాది మీ ఫేటు తరుగు లేదు ఆ బంగారానికి తిరుగు లేదు ఈ బంగారానికి ఆలోచిస్తారింకా దేనికి గుద్ది పడేద్దాం కాకి నెమలికి రండి రండి… రండి తరలి రండి రండి రండి… రండి కదలి రండి కాకి నెమలికి కాకి నెమలికి కాకి నెమలికి రండి రండి రండి రండి కాకి నెమలికి కాకి నెమలికి
No comments
Post a Comment