చిత్రం: అతిధి దేవోభవ (2022) సంగీతం: శేఖర్ చంద్ర నటినటులు: ఆది సాయికుమార్, నువేక్ష దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్ నిర్మాతలు: రాజబాబు మిరియాల, అశోక్ రెడ్డి మిరియాల విడుదల తేది: 2022
Songs List:
బాగుంటుంది పాట సాహిత్యం
చిత్రం: అతిధి దేవోభవ (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల గానం: సిద్ శ్రీరాం నూతన మోహన్ బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగ నువ్వు వాలితే బాగుంటుంది నిన్ను తాకితే బాగుంటుంది నువ్వు ఆపితే బాగుంటుంది కంటికున్న కాటుకంతా ఒంటికంటితే అహహహా బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా లాలిస్తే తగ్గిపోతుంది బహుశా ఈ మనసు ప్రేమ బానిస అయితే బుజ్జగించుకుంటానే నిన్నే నెత్తినెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే చెలి చెలి జాలి చూపవే తడి చేసేద్దాం పెదవులని ముడి వేసేద్దాం మనసులని దాచేసుకుందాం మాటలని దోచేసుకుందాం హాయిని కాదంటానేంటి చూస్తూ నీ చొరవ వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ నీ నుంచి నేను తప్పుకోవడం సులువా కౌగిళ్ళలోకి లాగవా టెన్ టూ ఫైవ్ అమ్మో నువ్వు గడుసు కదా అన్నీ నీకు తెలుసు కదా, (తెలుసు కదా) అయినా బయటపడవు కదా, (పడవు కదా) పదపదా ఎంతసేపిలా వెలివేసేద్దాం వెలుతురుని పరిపాలిద్దాం చీకటిని పట్టించుకుందాం చెమటలని చుట్టేసుకుందాం ప్రేమని నువ్వేమో పెడుతుంటే తొందరలు నాలోన సిగ్గు చిందరవందరలు అందంగా సర్దుతూ నా ముంగురులు మోసావు అన్ని దారులు కొంచెం వదిలానంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెలా వేరే దారి లేక నేనిలా బంధించానే అన్ని వైపులా బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే బాగుంటుంది గుండె మీద గువ్వలాగ నువ్వు వాలితే
నిన్ను చూడగానే పాట సాహిత్యం
చిత్రం: అతిధి దేవోభవ (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: భాస్కరభట్ల గానం: అనురాగ్ కులకర్ణి నిన్ను చూడగానే నా గుండె జారిందే ఉన్న ఒక్క ప్రాణం నీ చుట్టూ తిరిగిందే నిన్ను చూడగానే కాలం ఆగిందే ఉన్నట్టుండి లోకం అందంగా మారిందే ఒక నవ్వే కదా… ఒక చూపే కదా ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా నువ్వేలే నా శ్వాస నువ్వేలే నా ధ్యాస నీతో కలిసి బ్రతకాలన్నది నాదో చిన్న ఆశ నీలో నన్ను చూశా నాలో నిన్ను మోశా అవునన్నా నువ్వు కాదన్నా నా మనసే నీకిచ్చేశా పూట పూట గుర్తొస్తున్నావే నీటి మీద నడిపిస్తున్నావే కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే నూటికి నూరుపాళ్ళు నచ్చేస్తున్నావే ఈ జన్మ నీతోనే మరుజన్మ నీతోనే వచ్చి వచ్చి గుండెల్లోన వాలిపోవే గువ్వలా నువ్వేలే నా ఆట నువ్వేలే నా పాట నువ్వుంటేనే సంతోషాన్ని వెయ్యలేను కాటా నువ్వే ఉన్న చోట కాదా పూల తోట హృదయం మొత్తం రాసిచ్చేస్తా నాకేం వద్దు వాటా
No comments
Post a Comment