చిత్రం: నాట్యం (2021) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ నటినటులు: సంధ్యా రాజు, కమల్ కామరాజు, రోహిత్ బిహల్, ఆదిత్యా మీనన్, భాను ప్రియ దర్శకత్వం: రేవంత్ కోరుకొండ నిర్మాత: సంధ్యా రాజు విడుదల తేది: 22.10.2021
Songs List:
ఓ నమశ్శివాయై పాట సాహిత్యం
చిత్రం: నాట్యం (2021) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య గానం: కాలభైరవ, లలిత కావ్య చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ ధిమిల్ల కాయైచ జటాధరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృత స్మరాయై వికృత స్మరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశ్శివాయై చ నమశ్శివాయ విశాల నీలోత్పల లోచనాయై వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయై చ నమశ్శివాయ మందారమాలా కలితాలకాయై కపాల మాలాంకిత కంథరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ తకిట తకిటతై తకిట తోం తకిట తకిటతై తజున తజున తా తా తా తా తరికిట తరికిట తరికిటత జుంజునంగు తరికిట తజ్జూమ్ తజ్జూమ్ తాతై తై తై తోం తతోం తతోం తతోం తతోం తకిట దొంతిట తకిట దొంతిట భం భం భోలే భం భం భోలే అంభోధర శ్యామల కుంతలాయై తటిత్రభా తామ్ర జటధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రై నమశ్శివాయై చ నమశ్శివాయ ప్రదీప్త రత్నో జ్జ్వల కుండలాయై స్ఫురన్మహా పన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశ్శివాయై చ నమశ్శివాయ ఏతత్పఠే దష్టక మిష్టదం యో భక్త్వా స మాన్యో భువి దీర్ఘ జీవీ ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం భూయాత్సదా చాన్య సమస్త సిద్ధి ఓ నమశ్శివాయై, ఆ ఆఆ ఆ నమశ్శివాయై జై జై శంకర జై జై… జై జై శంకర జై జై జై జై శంకర జై జై… జై జై శంకర జై జై జై జై శంకర జై జై… జై జై శంకర జై జై
పోనీ పోనీ ఈ ప్రాణమే పాట సాహిత్యం
చిత్రం: నాట్యం (2021) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల గానం: లలిత కావ్య పోనీ పోనీ ఈ ప్రాణమే కలకై జరిగే ఓ త్యాగమే ప్రేమే చిందించే రక్తమే కలకందించే ఆరాధనే హృదయమే అణువణువున ఊపిరై నిను నిలిపినా ప్రణయమే తను నిలువునా పతనమై పోవాలి సుమా మనసు విరిచి ఆ మంటలపై ఆశల దహనం నేనిక చేయుటెలా గుండె చిదిమి ఆ గురుతులపై ఆశయ రథమై కదలాలి తప్పదిక కలకే బ్రతికే దారి చూపించరా కరుణే కలిగి కర్కసుడివవ్వరా వలపే విషమై మారిపోనివ్వరా మనవిని వినరా మరణమే ఇవ్వరా రెక్కతెగిన ఒక గువ్వనురా ప్రేమల తీరం నే చేరలేను కదా ముక్కలైన నా హృదయమిక మరుజన్మైనా నీకే అర్పించెదరా
తూరుపు పడమరలకే… పాట సాహిత్యం
చిత్రం: నాట్యం (2021) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల గానం: చిన్మయి శ్రీపాద తూరుపు పడమరలకే… దూరమే కాస్త తగ్గినదే తీరులో కొత్త మలుపే… తియ్యని మార్పు తెచ్చినదే తేరు వేరైన కథలే… ఇక చేరువై నేడు కదిలే మౌనమై ఉన్న ఎదలే… మాటలే కలిపినవిలే తూరుపు పడమరలకే… దూరమే కాస్త తగ్గినదే తీరులో కొత్త మలుపే… తియ్యని మార్పు తెచ్చినదే చిలిపి చిలిపి తగువుల్లో చిగురు తొడిగే ఒక చెలిమే చిలికి చిలికి కలతల్లో చెదిరి పడెనుగా అహమే పిలిచి పిలిచి పిలుపుల్లో పరిచయములు పెరిగినవే నడిచి నడిచి అడుగుల్లో పయనమిచట మారినదే మనసుకైనా తెలియని మహిమ ఏదో జరిగెనే నిమిషమైనా కదలని తుంటరి తుంటరి హాయిదే తూరుపు పడమరలకే దూరమే కాస్త తగ్గినదే తీరులో కొత్త మలుపే తియ్యని మార్పు తెచ్చినదే
వేణువులో చేరని గాలికి… పాట సాహిత్యం
చిత్రం: నాట్యం (2021) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల గానం: అనురాగ్ కులకర్ణి కాలి అందియలు ఘల్లు ఘల్లుమన గణపతి రాజా… తయ్ తయ్ తయ్ చక్కని తాళం వేసెద… తయ్ తయ్ చెయ్యర నాట్యం… దిద్దాంద్డ తయ్ . దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్దిత్తయ్ తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్ తయ్ తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్ తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్ తయ్ తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్ వేణువులో చేరని గాలికి… సంగీతం లేదా వెల్లువలా తుళ్ళిన చినుకులలో… నాట్యం లేదా ఒకసారి చూడు మనసు అనే… కనుపాపతోటి సరిగా హృదయానికున్న ముసుగులనే… తొలగించి దాటి రా పల్లానికి పారిన ఏటికి… వయ్యారం లేదా ఆకారమే ఉండని మెరుపులకి… తళుకు సొగసు లేదా కాలి అందియలు ఘల్లు ఘల్లుమన గణపతి రాజా… తయ్ తయ్ తయ్ చక్కని తాళం వేసెద… తయ్ తయ్ చెయ్యర నాట్యం… దిద్దాంద్డ తయ్ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్దిత్తయ్ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్దిత్తయ్ తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్ తయ్ తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్ వేణువులో చేరని గాలికి… సంగీతం లేదా వెల్లువలా తుళ్ళిన చినుకులలో… నాట్యం లేదా ఒకసారి చూడు మనసు అనే… కనుపాపతోటి సరిగా హృదయానికున్న ముసుగులనే… తొలగించి దాటి రా పల్లానికి పారిన ఏటికి… వయ్యారం లేదా ఆకారమే ఉండని మెరుపులకి… తళుకు సొగసు లేదా ఎవరు పొగిడేనని… నెమలి ఆడేనట ఒకరి కోసం అని… పూలు పూస్తాయ ఎగిరిన గువ్వ రెక్క… నింగి నలుపు చూసి హద్దు అంటు ఆగిపోదుగా గుండెలోన పొంగుతున్న కలయిది ఆనకట్టలేయకే ఇకా చెదిరిపడిన చిరు మువ్వైనా నిశ్శబ్దాన్ని చీల్చుతూ మోగునుగా అడుగునాపు గీతాల్ని చెరిపి రాలేవా తడబడేటి పసి పాదాలైనా నాట్యానికి పాఠాలు అని తెలుసుకుంటె నీ తనువులోని ప్రతి కదలిక భంగిమ కాదా మరి అంతులేని ఓ సంద్రమల్లె నీలోన దాగిన నటనలని అణువు అణువునా నింపుకుంటు ఆనంద తాండవం చేసేయ్యనీ నింగిలోని మేఘాల వెనుకనే లోకం ఉందని జాబిల్లి నిదురించనంటే తన వెన్నెలంతా చీకటి పాలైపోదా అది కట్టడాల స్తంభాల వెనుకనే కళ ఉందని పొరపాటు పడి ఆపమాకు నీ అడుగు అడుగుని అవధులు దాటుతూ నర్తించనీ కాలి అందియలు ఘల్లు ఘల్లుమన గణపతి రాజా… తయ్ తయ్ తయ్ చక్కని తాళం వేసెద… తయ్ తయ్ చెయ్యర నాట్యం… దిద్దాంద్డ తయ్ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్దిత్తయ్ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్ది తడిగిడ దిద్దిత్తయ్ తకిట తకిట దిమి తయ్ తయ్ తయ్ తయ్ తకదిమి తకదిమి దిద్దాంద్డ తయ్
No comments
Post a Comment