చిత్రం: రిపబ్లిక్ (2021) సంగీతం: మణిశర్మ నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్ , జగపతి బాబు, రమ్యకృష్ణ దర్శకత్వం: దేవ కట్టా నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లయ్య విడుదల తేది: 01.10.2021
Songs List:
Gaana of Republic పాట సాహిత్యం
చిత్రం: రిపబ్లిక్ (2021) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రెహ్మాన్ గానం: అనురాగ్ కులకర్ణి, ధనుంజయ, పృద్విచంద్ర, హైమత్ మహమ్మద్, ఆదిత్య అయ్యంగార్ ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో నా ప్రాణంలోని ప్రాణం… నా దేహంలోని దాహం నా మౌనం పాడే గానం… నా ప్రశ్న సమాధానం అది అందమైన అందరాని కన్నెరా లక్ష అక్షరాలు రాయలేని కవితరా ఈ ప్రపంచమే కోరుకునే అతివరా పెను విప్లవాల విశ్వకన్య స్వేచ్చరా నా కళ్ళలోన రంగుల కలరా, ఆ ఆఆ నా కళ్ళలోన రంగుల కలరా నా ఊహలకే ఉనికే తనురా నా బతుకులోన బాగం కదరా నా ఊపిరికే అర్థం తనురా ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో తెల్లవాడినెదిరించి నల్లని చీకట్ల నుంచి పిల్లను విడిపించి తెచ్చి సంబరాలు చేసుకుంటే, ఏ ఏ అంతలోనే తెలిసిందది మాయమై పోయిందని ముందుకన్నా ముప్పుఉన్న పంజరానా ఉన్నదని అసలెక్కడుందో తెలియకుంది చూడరా అది లేక మనిషికింకా విలువేదిరా ఏ పోరాటంతో దానిని చేరాలిరా, ఆ ఆఆ ఏ ఆయుధంతో దానిని గెలవాలిరా ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో అనాదిగా ఎవడో ఒకడు… అది నాకే సొంతమంటూ నియంతలై నిరంతరం… చెరలో బంధించారు, ఊఊ ఊ రెక్కలనే విరిచేసి… హక్కులనే చెరిపేసి అడిగే ప్రతి ఒక్కడిని… అణిచి అణిచి వేసినారు నరజాతి చరిత్రలో నలిగిపోయెరా చల్లారని స్వాతంత్య్ర కాంక్ష స్వేచ్చరా నరనరాల్లోనా ప్రవహించే ఆర్తీరా, ఆ ఆఆ కనిపించక నడిపించే కాంతిరా ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ఏయ్ రారో ఎయ్ రారో… ఏయ్ రారో ఎయ్ రో ||2||
జొర్సే బార్సే పాట సాహిత్యం
చిత్రం: రిపబ్లిక్ (2021) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ సాకీ: శ్రీనివాస్ దరిమి శెట్టి గానం: అనురాగ్ కులకర్ణి సిగురు సింతల మీద రామ సిలకలోయ్ పగలెదిగినాయి సూడు సెంద్రవంకలోయ్ సెరుకూ పిల్లాడు సూసే సూపు సురుకులో కలికీ బుగ్గలమీద సిగ్గు మరకలోయ్ సూడబోదమా ఆడబోదమా..!! సూడబోదమా ఆడబోదమా..! హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా సూడబోదమా ఆడబోదమా..! హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ ఢమఢమ జాతర పండుగరోయ్ గుమగుమ పువ్వుల దండలు వెయ్ కనులతో కాచే తల్లికి జై తనువుతో పొర్లి దండం సెయ్ ఢమఢమ జాతర పండుగరోయ్ గుమగుమ పువ్వుల దండలు వెయ్ కనులతో కాచే తల్లికి జై తనువుతో పొర్లి దండం సెయ్ ఎన్నెల్లో కొల్లు యేరు తానమాడుతున్నాదంటా… ఎల్దామా ఎల్దామా సరసుతోని సెందురుడు సరసమాడుతున్నాడంట… ఎల్దామా ఎల్దామా గాలి సెంపా గిల్లుతుంటే పూలు సిగ్గు పడతాయంటా… ఎల్దామా ఎల్దామా వలసా పచ్చులొచ్చి నీళ్ళ హోళీ జల్లుకుంటాయంట సూడబోదమా ఆడబోదమా..! హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా సూడబోదమా ఆడబోదమా..! హే, సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే, ఏ ఏఏ జొర్సే బార్సే తెరసాప జార్సే పడవనింకా జొర్సే, ఏ ఏఏ పసుపుకుంకాలు గాచే పార్వతమ్మ రూపమంటా పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ కొల్లేరు బిడ్డల కోసం కొలువైన తల్లేనంటా పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ రంగురంగుల ప్రభాలు కట్టి… తారంగమాడుకుంటా ఎల్దామా ఎల్దామా ఏ, ముడుపుకట్టుకున్న జంట… ముళ్ళు ఏసుకుంటాయంటా జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ జొర్సే బార్సే తెరసాప జార్సే… పడవనింకా జొర్సే, ఏ ఏఏ
No comments
Post a Comment