చిత్రం: బంగార్రాజు (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతి శెట్టి, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా దర్శకత్వం: కె. కళ్యాణ్ కృష్ణ నిర్మాతలు: అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ విడుదల తేది: 14.01.2022
Songs List:
లడ్డుండ పాట సాహిత్యం
చిత్రం: బంగార్రాజు (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: నాగార్జున, ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియ బాబు తబలా... అబ్బాయ్ హార్మొనీ... తానా న న న న డాంటకు డ డ న రాజు గారు డాంటకు డ డ న అనగా ఏమి హ హ హ హ హ ఓరి బుడ్డోడ ఇంతకాలం తెలుసుకోకుండా ఏమి చేస్తున్నావురా? అడగాలి కదా! డాంటకు డ డ న బంగారు పాపలూ... చెరుకు తోటలో చారెడు బియ్యం వంగతోటలో మరదలి కయ్యం లగెత్తి కొడితే లడ్డుండ లడ్డుండ మాటల్లోనే మల్లెల చెండు చూపుల్లోనే కితకితలుండు బంగార్రాజు కి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి హో కంది సేనుకాడ డాంటకు డ డ న కన్ను కలిపితే డాంటకు డ డ న పంపు షెడ్డు కాడ డాంటకు డ డ న పైట తగిలితే డాంటకు డ డ న లడ్డుండ లడ్డుండ జువ్విచ్చి జువ్విచ్చి తిప్పమాకు మీసాలు వెయ్యమాకు వేషాలు నీ నవ్వు అగరొత్తి నీ చూపు చురకత్తి కొయ్యమాకు ఊచకోతలు ఓ ఆయీ ఆయీ ఆయీ రీలు రీలు రీలు రీలు ఆహా ఇరగదీస్తున్నారు స్త్రీలు మెరిసే బంగారు కళ్ళు తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు లడ్డుండ జువ్విచ్చు లడ్డుండ జువ్విచ్చు హే గడ్డి మేటకాడ డాంటకు డ డ న అగ్గిరాసుకుంటే డాంటకు డ డ న వంగ తోట కాడ డాంటకు డ డ న దొంగచాటుగా డాంటకు డ డ న కల్లని చూస్తే కలుపు పువ్వు వలపులు చూస్తే పాపి కొండలు పిల్లని చూస్తే లడ్డుండ ఇచ్చే లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి లడ్డుండ జువ్విచ్చి ఇచ్చే లడ్డుండ
నా కోసం పాట సాహిత్యం
చిత్రం: బంగార్రాజు (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: బాలాజీ గానం: సిద్ శ్రీరామ్ కొత్తగా నాకేమయ్యిందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్ధం కాలేదే మెరుపులా నీ చూపేమందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీవైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేశావు మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ.. నాకోసం మారావా నువ్వూ... లేక నన్నే మార్చేశావ నువ్వూ.. చరణం: 1 ఓ నవ్వులే చల్లావూ పంచుకో మన్నావూ తొలకరి చిరుజల్లై నువ్వూ... కళ్లకి దొరికావు రంగులా మెరిసావూ నేలపై హరివిల్లా నువ్వూ.. నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మరాలన్ని మంచులాగ మార్చావో నీకోసం మారానే నేనూ... నిండు నూరేళ్ళు ఉండేలా నేనూ.. చరణం: 2 మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్నూ... కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్నూ.. పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలే నాకే ఈవేళ నేనే నచ్చానే నీవల్ల మోమాటాలే దూరం చేసే మాట నీకు చెప్పేలా... నీ వెంటే ఉంటున్నా నేనూ.. నువ్వే లేకుంటే ఉంటానా నేనూ..
వస్సివాడి తస్సాదియ్యా పాట సాహిత్యం
చిత్రం: బంగార్రాజు (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కళ్యాణ్ కృష్ణ గానం: మోహన్ భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్ధన్ చావలి నీకేమైంది బుజ్జీ మూడు లేదు మాస్టారూ.. నీకేమైంది ఏమైందంటే ఏం చెప్పమంటావ్ ఓయ్ బంగార్రాజు నువ్వు పెల్లిచేసుకేల్లిపోతే బంగార్రాజు మా కింకెవ్వడు కొనిపెడతాడు కోక బ్లౌజు నువ్వు శ్రీరాముడు వైపోతే బంగార్రాజు మా కింకెవ్వడు తీరుస్తాడు ముద్దు మోజు నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే బంగార్రాజు మాకు కెట్టుకో బుద్దవ్వదు బొట్టు గాజు నా చేతి గారి తిన్నప్పుడు బంగార్రాజు పొగిడి పొగిడి చంపావు నువ్వారోజు అరె కట్టిపూడి సంతలోన బంగార్రాజు నువ్వు తినిపించ మరచిపోను కొబ్బరి లౌజ్ రెండొకట్ల మూడంటావ్ బంగార్రాజు నీ ఎక్కాలకి పడిపోయా నేనా రోజూ వస్సివాడి వస్సివాడి వస్సివాడి తస్సాదియ్యా పిల్ల జోరు అదిరిందయ్యా హా నువ్వొచ్చినప్పుడు ముద్దిచ్చి నప్పుడు నా గుండె చప్పుడు హండ్రెడ్ నీ చీర కట్టుడు నీ నడుము తిప్పుడు నా గుండె చడుగుడు వాట్ టు డూ ఊరుకున్నడొక్కడు పెళ్లి అంట ఇప్పుడు మేము ఎట్ట బతుకుడు డూ డూ డూ పిల్ల పేరు గిల్లుడు ఇంటిపేరు దూకుడు దీన్ని ఎట్ట ఆపుడు డూ డూ డూ హోల హోలమ్మ హోల హోలమ్మ ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు ముద్దొస్తు ఉన్నాడు వస్సివాడి వస్సివాడి వస్సివాడి తస్సాదియ్యా పిల్ల జోరు అదిరిందయ్యా నువ్వుంటే సందడి నీ రాక గారడీ నీ రాక కొసమే అల్లాడి గారాల అమ్మడి నీ సోకు పుత్తడి కల్లోకి వచ్చేస్తావు అల్లాడి నువ్వు పెద్ద తుంటరి చూపుల్లోన పోకిరి కల్లతోనే కాల్చుతావు తందూరి తేనెపట్టు సోదరి పాలముంజ మాదిరి నిన్ను చూస్తే గుండెజారి రి రి రీ ఈ పిల్లాడు నచ్చాడు మనసైన సోగ్గాడు ముద్దొస్తు ఉన్నాడు వస్సివాడి వస్సివాడి వస్సివాడి తస్సాదియ్యా పిల్ల జోరు అదిరిందయ్యా నువ్వు పెళ్లి చేసుకెల్లి పోయినా బంగార్రాజు మా గుండెల్లో ఉండిపోతావ్ బంగార్రాజు నువ్వు ఎక్కడుంటే అక్కడుండు బంగార్రాజు నువ్వు హ్యాపీగా ఉండాలోయ్ బంగార్రాజు ఉమ్మా... వస్సివాడి తస్సాదియ్యా
బంగారా బంగారా పాట సాహిత్యం
చిత్రం: బంగార్రాజు (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: మధు ప్రియ, అనూప్ రూబెన్స్ కళ్ళకి కాటుక ఎట్టుకొని కాళ్ళకి పట్టీలు కట్టుకొని సెవులకు కమ్మలు ఎట్టుకొని సేతికి గాజులు ఏసుకొని సిలుకు చీర కట్టుకొని సెంటు గట్రా కొట్టుకొని కొత్తగా ముస్తాబయ్యా ఎప్పుడెప్పుడొస్తావయ్యా నిన్ను సూడకుంటె గుండె కొట్టుకోదయ్యా, ఆ ఆఆ బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా ఓ ఓ ఓఓ ఓ, చీరకు కుచ్చిళ్ళలాగా జెడకు రిబ్బను లాగా ఉంటావా ఉంటావా… తోడుగ ఉంటావా ఓ, మూతికి ముడుపులాగ నడుముకి మడతలాగ నీతోనే ఉంటాగా… వదలనంటాగా అంటుకు పోతావా నా ఒంటికి అత్తరులా సిగ్గై పోతావా నా సెంపకి సువ్వి సువ్వాలా నీకింకా ఇంకా ఇంకా ఏం కావాలో చెప్పవే ఇల్లాలా మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగడు పెళ్ళాల్లా, ఆ ఆఆ ఊయ్, బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నువ్వంటే పడిపడి చస్తారా బంగారా బంగారా బుల్లెట్టెక్కి వచ్చేయ్ రా బంగారా బంగారా నీ వెంటే లేచి వస్తారా (బంగార్రాజు బంగార్రాజు)
ఎంత సక్కాగుందిరో పాట సాహిత్యం
చిత్రం: బంగార్రాజు (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: బాలాజీ గానం: సాయి మాధవ్, మోహన్ భోగరాజ్, మేఘన, అపర్ణ, కావ్య రంగు రంగులు ఎగిసి నింగి తాకే సంబరం ఊరు ఊరంతా మెరిసే అంగరంగా వైభవం కోక కొంగు కోలాటాలు ఆడే సరదా కృష్ణుడు పింఛం పిల్లనగ్రోవి లేని మా చిలిపి కృష్ణుడు హే, రంగు ఓణీ రవ్వ గాజు పిల్లని చూస్తే లడ్డుండా ఎంతా సక్కాగుందిరో ఎంత సక్కాగుందిరో అరె కొంగు చాటు దాచుకున్న నడుమును చూస్తే లడ్డుండా ఎంతా సక్కాగుందిరో, యెహే ఎంత సక్కాగుందిరో ఆ, ఘల్లు ఘల్లు గజ్జెలు చూసి గుండెకాయ గుంజీలు తీసే బొంగరాల నడకలోన సక్కాగుందిరో అరె అరె అరె అరే ఎంతా సక్కాగుందిరో ఎంత సక్కగుందిరో లడ్డుండా లడ్డుండా, యెహే లడ్డుండా, ఏ లడ్డుండా హే, రంగు ఓణీ… రవ్వ గాజు పిల్లని చూస్తే లడ్డుండా ఎంతా సక్కగ సెప్పిండే ఎంత సక్కగ సెప్పిండే అరె బతికుండాలి ఖవ్వాలీలా రోజు కొత్త ఉగాదిలా కళ్ళల్లోనే దివాళిలా ప్రతిపూటా పండుగలా నువు పక్కన ఉంటే మహాశయా రోజూ కృష్ణాష్టమేనయా పొగిడావంటే అంతేనయా సందట్లో సడేమియా హే, పాలపిట్టకి పరికిణిలాగ కొండవాగుకి గమకము లాగా చందమామకి చెమికిలాగా ఇరగేస్తుందోరి అరె అరె అరె అరే ఎంతా సక్కాగుందిరో ఎంత సక్కగుందిరో సక్కగుందే సక్కగుందే సక్కగుందే సక్కగుందే
నువు సిగ్గుపడితే… పాట సాహిత్యం
చిత్రం: బంగార్రాజు (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: చిత్ర, రమ్యా బెహ్రా , సాయి చరణ్ నువు సిగ్గుపడితే… నువు సిగ్గుపడితే నువు సిగ్గుపడితే బాగుంటావే ఓ సత్యభామ సిగ్గుల సింగారముంటాదే వద్దన్నా కొద్ది ముద్దొస్తావే నా ఎన్నెలమ్మ కారంగా చూస్తూనే గారం చేస్తావే నువ్వు మాటలతో పడగొడతావే ఓ బంగార్రాజు నవ్వులతో సెగపెడతావే నీ సూపులతో చుట్టేస్తవే… నా రంగుల రాజు సూదంటు రాయల్లే లాగేస్తావే మళ్ళీ పుట్టానా అనిపిస్తుందే ప్రాణం నా నువ్వు నను చేరితే ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా నువ్వు నేనొకటేగా ఏడున్నా నువు నా సొంతమెగా ఏ లోకంలో ఉన్నా యాలె యాలె యాలెయాలె యాలే యాలే యాలె యాలె యాలెయాలె యాలే యాలే హోయ్ సుందరుడా సుందరుడా మీసమున్న సెందురుడా అందమైన ఆశపెట్టే నరుడా, హొయ్ ఊరువాడ పిట్టగోడ దూకినోడ్నే నేనాడా కాసుకుంటానంటే పందెం ఈడా అరె అరె అరె, చెఱుకుగడ పెరుగువడ జున్ను పాల మీగడ మాటల్లోనే చూపించావే గురుడా హో, పూల జడ ఒంపు మెడ హత్తుకున్న పావడా ఎక్కి తొక్కుతున్నాయే గుండె కాడ పొద్దూమాపంటూ ఏం లేదురా స్వర్గమంటే ప్రతీ పూట నీతోటే మా ఆటలే ఓ ఓ ఓఓ, నువ్వు నేనొకటేగా… ఏడున్నా నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా నువ్వు నేనొకటేగా ఏడున్నా నువు నా సొంతమెగా… ఏ లోకంలో ఉన్నా
1 comment
Nice bro good work
Post a Comment