చిత్రం: జయమ్మ పంచాయితి (2022) సంగీతం: ఎం.ఎం.కీరవాణి నటీనటులు: సుమ కనకాల, దేవి ప్రసాద్, డేనిష్ కుమార్ , శాలిని కొండేపూడి దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు నిర్మాత: బలగా ప్రకాష్ విడుదల తేది: 06.05.2022
Songs List:
తిప్పగలనా చూపులు పాట సాహిత్యం
చిత్రం: జయమ్మ పంచాయితి (2022) సంగీతం: ఎం.ఎం.కీరవాణి సాహిత్యం: రామాంజనేయులు గానం: PVNS రోహిత్ తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపైనా ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా వస్తావు నువ్వే తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ ఓఓ నువ్వెళ్ళగానే నేనింకా లేనే నీ లాగే అయిపోతానే ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా నేనెందుకు పుట్టానంటే… ఏమివ్వను బదులే నీ కోసమే అన్నానంటే… తిడతావో ఏమోలే నాకెవ్వరు నచ్చారంటే… ఏం చెప్పను మాటే నీ కన్నా ఎవరుండరు… అంటే, కొడతావేమోలే అనలేక, ఓ… ఏమనలేక ఓ మిగిలానే ప్రేమలేఖలా వస్తావు నువ్వే తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ నువ్వెళ్ళగానే నేనింకా లేనే నీ లాగే అయిపోతానే ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపైనా ఆపగలనా అడుగులు నా చెంతే కాసేపైనా వస్తావు నువ్వే తెస్తావు నన్నే ఇస్తావు నాకే ఓ ఓఓ నువ్వెళ్ళగానే నేనింకా లేనే నీ లాగే అయిపోతానే ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా ఒలాలా ఒలాలా ఓలలా… ఓ లాలా
కాసింత భోళాతనం పాట సాహిత్యం
చిత్రం: జయమ్మ పంచాయితి (2022) సంగీతం: ఎం.ఎం.కీరవాణి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీకృష్ణ కాసింత భోళాతనం కూసింత జాలి గుణం కాసింత గండ్రతనం కూసింత మొండి గుణం కాసింత భోళాతనం కూసింత జాలి గుణం కాసింత గండ్రతనం కూసింత మొండి గుణం అచ్చమైన పల్లెటూరి ఇత్తనం ఎక్కడైనా ఆమెదేగా పెత్తనం ఈ అమ్మోరు తల్లి తూఫాను ముందర తూనీగలే మనమందరం హెయ్, జయమ్మ జయమ్మ జయమ్మ జయమ్మ జయమ్మ చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ అసలైన సంగతి నిజంగానే వేరమ్మా మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా పక్క ఇంటి లక్ష్మి పంచదార అప్పు తీర్చలేదు పోస్టుమ్యాను భద్రం వారం రోజుల్నుంచి రాడం లేదు సికెను షాపు సీను ఎనకట్లాగా తూకం తుయ్యట్లేదు అట్టా ఎల్లే ఎంకాయమ్మ నన్ను సూసి పలకరించలేదు పొద్దున గొన్న బీరకాయల్ నాలుగింట్లో మూడు చేదు ఎందోగాని నా గాచారం ఒక్క సంగతి సరిగ్గాలేదు ఫో ఫో ఫో సివంగి లెక్కన లేస్తది గానీ సిన్న పిల్ల మనసు ఇట్టాగ ఎందుకు పుట్టించాడో ఆ దేవుడికే తెలుసు పట్టాసు తీరున పేలుద్ది బాబోయ్ నోటి మాటే పెళుసు జయమ్మ గొంతు లెగిసిందో చాలు భూజగమే సైలెన్సు బుస్సున ఆకాశమంటే కోపం, తకధిమి సప్పున సల్లారిపోతది పాపం, తకధిమి బుస్సున ఆకాశమంటే కోపం, తకధిమి సప్పున సల్లారిపోతది పాపం, తకధిమి తక తక తప్పుకోక తప్పదు ఆ అరనిమిషం భూకంపం హెయ్, జయమ్మ జయమ్మ జయమ్మ జయమ్మ జయమ్మ చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ అసలైన సంగతి నిజంగానే వేరమ్మా మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా అమ్మాడియమ్మో జయమ్మా అమ్మాడియమ్మో జయమ్మా జయమ్మో జయమ్మో జయమ్మ జయమ్మో జయమ్మో జయమ్మ ఎదురింట్లోని చంటిపాప ఏడుపింకా ఆపట్లేదు ఖతారెళ్లిన కాంతం కొడుకు ఏమయ్యాడో పత్తా లేడు రచ్చబండ హనుమంతుడికి ఎండా వానా నీడే లేదు అబ్బులు గారి చూలు గేదే అన్నం నీళ్లు ముడతలేదు సుబ్బాయమ్మ మొగుడికి దానికి నిమిషం కూడా పడుతలేదు అబ్బబ్బా ఈ కష్టాలకి అంతు పొంతూ లేనే లేదు ఫో ఫో ఫో అమ్మాడియమ్మో జయమ్మా అమ్మాడియమ్మో జయమ్మా జయమ్మో జయమ్మో జయమ్మ జయమ్మో జయమ్మో జయమ్మ పొరుగోళ్ళకి సాయం చెయ్యడమంటే ఇష్టమండి తనకు తిరిగి సాయం చెయ్యకపోతే ఇరకాటమే మనకు నిద్దరోతే ఒట్టు పక్క వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచే వరకు అట్టాగే మనని తోడుండమంటది తనకొచ్చే ఆపదకు లేదే మోమాటం ఇంటావంటా, తకధిమి తనదేననుకుంటది ఊరూరంతా, తకధిమి లేదే మోమాటం ఇంటావంటా, తకధిమి తనదేననుకుంటది ఊరూరంతా, తకధిమి ఎవరేమేమనుకున్నా మరో మాటే లే దం ట హెయ్, జయమ్మ జయమ్మ జయమ్మ జయమ్మ జయమ్మ చూసే జనం కళ్ళకు సూర్యకాంతమ్మ అసలైన సంగతి నిజంగానే వేరమ్మా మచ్చలేని ఆ మనసే ఆకాశమంతమ్మా
బాగుంది కదా స్నేహం పాట సాహిత్యం
చిత్రం: జయమ్మ పంచాయితి (2022) సంగీతం: ఎం.ఎం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: అనిరుద్ సుస్వరం, నీలిమ శంకుల నువ్వో రెక్క… అరెరే నేనో రెక్క రెక్కలు రెండు కలిపి చూద్దామింకా మనదే కాదా చుక్కల ఆకాశం మనతో రాదా రంగుల సంగీతం బాగుంది కదా స్నేహం ఆగింది కదా కాలం ఇక నీది నాదొక సరదా సరదా సామ్రాజ్యం ఈడ అల్లరి అల్లరి సందడి సందడి మన సొంతం నువ్వో రెక్క… అరెరే నేనో రెక్క రెక్కలు రెండు కలిపి చూద్దామింకా మనదే కాదా చుక్కల ఆకాశం మనతో రాదా రంగుల సంగీతం బాగుంది కదా స్నేహం ఆగింది కదా కాలం ఇక నీది నాదొక సరదా సరదా సామ్రాజ్యం ఈడ అల్లరి అల్లరి సందడి సందడి మన సొంతం తరరా రరరా రారార తరరా రరరా రార తరరా రరరా రారార తరరా రరరా రార భయము లేదు ఇక్కడ భాధ లేదు పుస్తకాల సంచీ బరువూ లేదు కలత లేదు ఇక్కడ కొరత లేదు రాత కూతలంటూ దిగులు లేదు ఆడే ఆటకు హద్దే లేదు పాడే పాటకు పొద్దే లేదు ఏదో ఏదో కోరిక లేదు ఏ చోట క్షణము తీరికలేదు ఉన్నదంటూ ఒక్కటే నీతో ఉన్నదంటూ ఒక్కటే ఉల్లాసం బాగుంది కదా స్నేహం ఆగింది కదా కాలం ఇక నీది నాదొక సరదా సరదా సామ్రాజ్యం ఈడ అల్లరి అల్లరి సందడి సందడి మన సొంతం
గొలుసుకట్టు గోసలైపోయే పాట సాహిత్యం
చిత్రం: జయమ్మ పంచాయితి (2022) సంగీతం: ఎం.ఎం.కీరవాణి సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: చారు హరిహరన్, ఎం.ఎం.కీరవాణి కలిసి బతికే కాలమే… మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే అలిసిపోనీ ఆశలేమాయే అయ్యో గొలుసుకట్టు గోసలైపోయే పొరపాట్లు కొన్ని… పంతాలతోని మరి ఎంతకీ… తేలదు పంచాయితీ కలిసి బతికే కాలమే… మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే పుట్టకతో పూజకు తగవని కోవెల కొలువుకే గోలాయే వలపులే దూరపు తలపులై ప్రేమకు తలుపులే మూసాయే వెంటాడే మా భయ్యాలే దయ్యాలై మంచీపైనే మన్నేసెలే ఖర్మే కాలి పెద్దోళ్లు చెడ్డోల్లై బంధీలైనారా..! నారే నా ఆ ఆ ఆ ఓ ఓ ఓ నారే నా ఆ ఆ ఆ ఓ ఓ ఓ కలిసి బతికే కాలమే… మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే వెలుగునే చూడని కలుగులో చీకటి బతుకులై పోయేనే తిరుగుతూ ఆశను వెతుకుతూ ఏ దిశ కొసలనే చేరేనో ఇచ్చేశాక వచ్చేదా చచ్చేదా కచ్చెలోలో గిచ్చేనమ్మ సొమ్మూ రాక సొంతమ్మి కనరాక సొమ్మాసిల్లేవా కలిసి బతికే కాలమే… మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే అలిసిపోనీ ఆశలేమాయే అయ్యో గొలుసుకట్టు గోసలైపోయే పొరపాట్లు కొన్ని… పంతాలతోని మరి ఎంతకీ… తేలదు పంచాయితీ
No comments
Post a Comment