Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shyam Singha Roy (2021)




చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్
దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యన్
నిర్మాత:వెంకట్ ఎస్. బోయనపల్లి
విడుదల తేది: 24.12.2021



Songs List:



పుట్టిందా ఓ అక్షరమే పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి 

పుట్టిందా ఓ అక్షరమే
కాగితపు కడుపు చీల్చే
అన్యాయం తలే తెంచే
అరె కరవాలంలా పదునాకలమేరా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… టెన్ టు ఫైవ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ (2)

పటాసుల్నే లిఖిస్తాడు
నిజం కోసం శ్రమిస్తాడు
జనం కోసం తపిస్తాడు
అరె అజ్ఞానానికి పాతర వేస్తాడు

పడుతూ ఉన్నా ప్రతి పుటపైనా
తన నెత్తురు సిరలా పారేరా
మెడలే వంచే రాజులతోనే
కవి ప్రశ్నల యుద్ధంరా
సింధూరం రంగున్న జెండారా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… టెన్ టు ఫైవ్ సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ (2)

గర్జించే గొంతేరా
తెల్లోడైనా నల్లోడైనా తేడా లేదురా
స్వాతంత్య్రం నీ స్వప్నంరా
ఏ క్రోదాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా

గుడిలో ఉన్నా గడిలో ఉన్నా
స్త్రీ శక్తికి ఇంతటి కష్టాలా
తలలే తెంపే ఆ కాళికకే
చెరబట్టుతూ సంకేతాలా
నీ వల్లే ఈ స్వేచ్ఛే సాధ్యంరా

శ్యామ్ సింగ రాయ్
అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింగ రాయ్
అరె, వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింగ రాయ్… సింగ రాయ్
సింగ రాయ్ సింగ రాయ్… సింగ రాయ్ (2)




ఏదో ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: చైత్ర అంబడిపూడి

ఏదో ఏదో తెలియని లోకమా
ఏదో ఏదో తహ తహ మైకమా

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
టచ్ మీ లైక్ యూ డు
లవ్ మీ లైక్ యూ వాంట్ ఇట్

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ

కైపే తెర తెగిన పడవా, ఆ ఆ
అలజడుల గొడవా, ఆ ఆ
లోలోపలా మరో తీరమే మరి రమ్మనే
ఎరే వేసిన సాయంత్రమా

నువ్వే నా ఎదురుగా ఉంటే
ఏ మధురిమో తాకే
నీ అధరమే గీసే ఓ చిత్రమే
హాయే వరద నది తీరునా
కనుల ఒడి చేరెను ఈ వేళనా

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
టచ్ మీ లైక్ యూ డు
లవ్ మీ లైక్ యూ వాంట్ ఇట్

ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ
ఐ యామ్ సో ఇన్ టూ యూ

ప్రాణం తీసే ఈ అల్లరే
కళ్ళే మూసే ధ్యానాలే
ఈ చలిచలితో ఇలా ఈ తొందరలో
ఓ తమాషా తెగబడుతూ పరిగెడుతూ
ఉరకలు వేసే ఈ అతిశయమే
పెరిగెనులే కొంచం కొంచం
అంతా సొంతం అంటూ

డోంట్ నో వై
యూ లెట్ ద ఫైర్ ఇన్ మై సోల్
కార్చిచ్చే కళ్ళంచుల్లో… కలలు కలబడగా
మోహం తలుపు తెరిచేనా
తెలిసి పెరిగేనా ఈ వేధన

ఏదో ఏదో… తెలియని లోకమా
ఏదో ఏదో… తహ తహ మైకమా




సిరివెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం:  అనురాగ్ కులకర్ణి

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

నెల రాజుని… ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి

అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

తెర దాటి చెర దాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని

ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే, ఓ ఓ
విరబోసే ఆశలై, ఓ ఓ

నవరాతిరి పూసిన వేకువ రేఖలు
రాసినదీ నవలా
మౌనాలే మమతలై, ఓ ఓ
మధురాలా కవితలై, ఓ ఓ
తుది చేరని కబురుల
కథాకళి కదిలెను
రేపటి కధలకు మున్నుడిలా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం

ఇదిలా అని ఎవరైనా
చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి

సంతోషం సరసన, ఓ ఓ
సంకోచం మెరిసిన, ఓ ఓ
ఆ రెంటికి మించిన పరవశ లీలను
కాదని అనగలమా

ఆ, కథ కదిలే వరుసనా, ఓ ఓ
తమ ఎదలేం తడిసినా, ఓ ఓ
గత జన్మల పొడవున
దాచిన దాహము ఇపుడే
వీరికి పరిచయమా

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా (2)

డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం




ప్రణవాలయ పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం:  అనురాగ్ కులకర్ణి

ప్రణవాలయ పాహి
పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీదేవీ
కురిపించవే కరుణాంబురాశి

ధీంతాన ధీం ధీం తాన, జతులతో
ప్రాణమే నాట్యం చేసే, గతములతో
నామషతమ్ముల నథులతో, ఓ ఓ
నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ

శరణంటినే జనని నాధ వినోదిని
భువన పాలినివే, ఏ ఏఏ
అనాథ రక్షణ నీ విధి కాదటే
మొరవిని చేరవటే
ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ

నా ఆలోచనే నిరంతరం
నీకు నివాళినివ్వాలనీ
నాలో ఆవేదనే
నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ

దేహమునే కోవెలగా… నిన్ను కొలువుంచా
జీవముతో భావముతో… సేవలు చేశా
ప్రతి ఋతువు… ప్రతి కృతువు
నీవని ఎంచా… శతతము నీ స్మరణే నే

ధీంతాన ధీం ధీం తాన, జతులతో
ప్రాణమే నాట్యం చేసే, గతములతో
నామషతమ్ముల నథులతో, ఓ ఓ
నాపైన నీ చూపు ఆపేలా, ఆ ఆఆ

శరణంటినే జనని నాధ వినోదిని
భువన పాలినివే, ఏ ఏఏ
అనాథ రక్షణ నీ విధి కాదటే
మొరవిని చేరవటే
ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ

దింతాన దింతాన తోం
దింతాన దింతాన తోం
దింతాన దింతాన తోం



తార పాట సాహిత్యం

 
చిత్రం: శ్యామ్ సింగరాయ్ (2021)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: కార్తీక్
గానం:  కృష్ణకాంత్

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న

తెర పైన కదిలేలా
కధలేవో మొదలే

తార నింగి దిగి నేలా
కింద నడిచేలా వచ్చేనిలా
బాల కోపాల బాలా
వేషాలు నేడే వేసేనుగా

చూస్తూనే ఆ మతే పోయే ప్రతిదీ ఇక
క్షణాల్లోనే పొగ చేసే ప్రతి సృష్టిగా
మాయ కాదా కంటినే మించిన కన్నురా

ఈ లెన్సుల్లో లైఫునే చూడరా
అన్ని మెరుగై చూపదా
నీడే మెరుపై చూపదా

ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే
కష్టాలే ఎన్నున్నా
ఇష్టంగా తోచేనా, ఆ హా

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న

కలలను కంటే… ముగిసిక పోదు
పరుగులతో అవి… నిజమై రావు
కలతలు రానీ… సమయము పోనీ
భరించరా వెన్నే చూపక
నీ కల తీరక చస్తుందా

ఆ రంగులే రెండే కదా
ఆ ఎండే మార్చదా ఏడుగా
రంగేయరా నీ ఆశకే
ఆ వెండి గోడను చేరగా
ఎంతెంత దూరాన గమ్యమే ఉన్నా
నేను సాధించుకోనా..!

ఈ లెన్సుల్లో లైఫునే చూడరా
అన్ని మెరుగై చూపదా
నీడే మెరుపై చూపదా

ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే
కష్టాలే ఎన్నున్నా
ఇష్టంగా తోచేనా, ఆ హా

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న
ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె
ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న

No comments

Most Recent

Default