Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Undamma Bottu Pedata (1968)




చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, జమున 
దర్శకత్వం: కె. విశ్వనాధ్ 
నిర్మాత: ఆదుర్తి సుబ్బారావు 
విడుదల తేది: 28.09.1968



Songs List:



శ్రీశైలం మల్లన్న పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, పి.సుశీల & కోరస్

శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా 
చేనంతా గంగమ్మా వానా 
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా 
చేనంతా గంగమ్మా వానా
తిరుమల పై వెంకన్న కనువిప్పేనా 
కరుణించు ఎండా వెన్నెలలై నా 
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా 
కరుణించు ఎండా వెన్నెలలైనా 

శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా
చేనంతా గంగమ్మా వానా 
కదిలొచ్చి కలిసొచ్చి
కలుపులు తీసేరో కలవారి కోడళ్ళు
నడుమొంచి చెమటోడ్చి
నాగళ్లుపట్టేరో నాజూకు దొరగార్లు

కదిలొచ్చి - కలిసొచ్చి
కలుపులు తీసేరో- కలవారి కోడళ్లు కలవారి కోడళ్లు

నడుమొంచి చెమటోడ్చి
నాగళ్లుపట్టేరో - నాజూకు దొరగార్లు
దంచకుండ నలిగేనా ధాన్యాలు
దంచకుండ నలిగేనా ధాన్యాలు
వంచకుండ వంగేనా ఆ ఒళ్లు

ఏటికైన ఏతాము ఎత్తేవాళ్లం 
మేమూ అన్నదమ్ములం 
ఏడేడు గరిసెల్లూ నూర్చేవారం

మేమూ అక్కాచెల్లెళ్లం 
ఏటికైన ఏతాము ఎత్తేవాళ్లం 
మేమూ అన్నాదమ్ములం
మేమూ అన్నదమ్ములం 
ఏడేడూ గరిసెల్లూ నూర్చేవారం 
మేమూ అక్కాచెల్లెళ్ళం



రావమ్మా మహలక్ష్మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల & కోరస్

రావమ్మా మహలక్ష్మీ రావమ్మా 
రావమ్మా మహలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ యిల్లు కొలువై వుందువుగాని 
నీ కోవెల ఈ యిల్లు కొలువై వుందువుగాని 
కొలువై వుందువుగాని - కలుములరాణి 
గురివిందా పొదకిందా గొరవంకా పలికే
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే
గురివిందా పొదకిందా గొరవంకా పలికే 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే 

లేచింది తెల్లారి
తెల్లారి పోయింది.పల్లె లేచింది. 
తెల్లారి  పోయింది
పల్లె లేచింది

పల్లియలో ప్రతియిల్లు కళ్లూ తెరచింది 
కడివెడు నీళ్లూ కల్లాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు 
కావెడు పసుపూ గడపకుపూసి గొబ్బిళ్లో గొబ్బిళ్లు 
కడివెడు నీళ్ళూ కలాపి చల్లి గొబ్బిళ్లో గొబ్బిళ్లు 
కావెడు పసుపూ గడపకు పూసి గొబ్బిళ్లో గొబ్బిళ్లు
ముత్యాల ముగ్గుల్లో - ముగ్గుల్లో గొబ్బిళ్లు 
ముత్యాల ముగ్గులో రతనాల ముగులో

ముగ్గులో గొబ్బిళ్లు ముగ్గులో గొబ్బిళ్లు
రతనాల ముగులో ముగులో గొబ్బిళ్లు
కృష్ణార్పణం

పాడిచ్చే గోవులకు పసుపూ కుంకం 
పనిచేసే బసవనికి పత్రీపుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ల భాగ్యం
గాదుల్లో ధాన్యం కావిళ్లా భాగ్యం
కష్టించే కాపులకూ - కలకాలం సౌఖ్యం 
కృష్ణార్పణం
కలకాలం సౌఖ్యం.



ఎందుకీ సందెగాలి పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల & కోరస్

ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి
ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి
తొందర తొందర లాయె విందులు విందులు చేసే
ఆగలేక నా లాగే ఊగే ఈ దీపము
ఆగలేక నా లాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభుని పాదముల వాలగ
తొందర తొందర లాయె విందులు విందులు చేసే

ఏ నాటిదో గాని - ఆ రాధా పల్లవ పాణీ
ఏ మాయెనో గాని - ఆ పిల్లన గ్రోవిని విని 
ఏ నాటిదోగాని - ఆ రాధా వలవ పాణీ 
ఏ మాయెనో గాని - ఆ ఆ పిల్లన గ్రోవిని విని
విని - విని
ఏదీ ఆ యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావనమిక - ఏదీ విరహ గోపిక




చుక్కలతో చెప్పాలని పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల, య.పి.బాలు & కోరస్

చుక్కలతో చెప్పాలని -
ఏమనీ ?
ఇటు చూస్తే తప్పనీ 
ఎందుకనీ?
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అనీ 

చెదిరే ముంగురులూ కాటుకలూ
నుదురంతా పాకేటీ కుంకుమలూ
సిగపాయల పూవులే సిగ్గుపడేనూ
చిగురాకుల గాలులే ఒదిగొదిగేనూ
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అనీ 

మనసులో ఊహ కనులు కనిపెట్టె వేళ
చెవిలో ఒక చిన్నకోర్కె చెప్పేసే వేళ
మిసిమి పెదవి మధువులు తొణికేనని 
పసికట్టే తుమ్మెదలూ ముసిరేననీ
ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అనీ 




అడుగడుగున గుడి వుంది పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో దీపముందీ అదియే దైవం
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ 
ఈసుని కొలువనిపించాలి 
ఎల్ల వేళలా మంచు కడిగినా
మల్లెపూవులా వుంచాలి
దీపం మరి మరి వెలగాలి తెరలూ పొరలూ తొలగాలి

తల్లీ తండ్రీ గురువు పెద్దలూ పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు
తలులు వలచే దైవం
ప్రతి మనిషే నడిచే దైవం
ప్రతి పులుగూ ఎగిరే దైవం



చాలులే నిదురపో పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

చాలులే నిదురపో
జాబిలి కూనా

ఆ దొంగ కలవ రేకుల్లో తుమ్మెదలాడేనా 
నీ సోగకనుల రెప్పల్లో తూనీగ లాడేనా 
ఆ దొంగ కలువ రేకులోతుమ్మెదలాడేనా 
నీ సోగకనుల రెప్పలో తూనీగ లాడేనా 
తుమ్మెద లాడేనా - తూనీగ లాడేనా 
అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా 
ఓసి వేలెడేసి లేవు - బోసి నవ్వులదానా 
అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా 
ఓసి వేలెడేసి లేవు - బోసి నవ్వులదానా
మూసే నీకనుల ఎటుల పూసేదే నిదర అదర
జాబిలి కూనా

ఆ దొంగ కలువ రేకుల్లో తుమ్మెదలాడేనా- 
నీ సోగ కనుల రెప్పల్లో తూనీగ లాడేనా 
తుమ్మెద లాడేనా... తూనీగ లాడేనా
అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే 
కానీ చిట్టితమ్ము డొకడు నీ తొట్టిలోకి రానీ 
అమ్మను బులిపించి - నీ అయ్యను మరిపించావే
కానీచిట్టితమ్ము డొకడు నీ తొట్టిలోకిరానీ
ఔరా.... కోరికలు కలలు
తీరా నిజమయితే - అయితే
జాబిలి కూనా





పాతాళ గంగమ్మ రారారా పాట సాహిత్యం

 
చిత్రం: ఉండమ్మ బొట్టు పెడతా  (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, పి.సుశీల

కోరన్,
గంగమ్మా రా గంగమ్మా రా- గంగమ్మా రా
పాతాళ గంగమ్మ రారారా ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగపట్టే పామల్లే పై కీ పాకీ 
పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ

వగరుసూ గుండెదాక పగిలిందీ నేల 
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేల 
వగరుసూ గుండెదాక పగిలిందీ నేల
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేల

సోలిన ఈ చేవికీ సొమ్మసిలిన భూమికీ 
సోలిన ఈ చేనికీ - సొమ్మసిల్లిన భూమికీ 
గోదారి గంగమ్మా - సేదా తీర్చావమ్మా

పాతాళ గంగమ్మా రారారా 
ఉరికురికీ ఉబికునికీ రా రా రా 
పాతాళ గంగమ్మా రారారా 
శివమూర్తి జటనుంచి - చెదరీవచ్చావో 
శ్రీ దేవి దయలాగా సిరులే తెచ్చావో 
శివమూర్తి  జటనుంచి చెదరీ వచ్చావో 
శ్రీ దేవి దయలాగా సిరులే తెచ్చావో

అడుగడుగున బంగారం - ఆకుపచ్చని సింగారం 
అడుగడుగున బంగారం ఆకుపచ్చని సింగారం 
తోడగవమ్మ ఈ నేలకు సశ్యశ్యామల వేషం

పాతాళ గంగమ్మా రారారా
ఉరికురికీ ఉబికుబికీ రా రా రా 
పగబట్టె పామలే పైకీ పాకీ 
పరుగెత్తే జింకలే దూకీ దూకీ 
పాతాళ గంగమ్మా రారారా


No comments

Most Recent

Default