చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు , వాణిశ్రీ దర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాత: యన్.యన్, భట్ విడుదల తేది: 14.08.1969
Songs List:
నిన్న నాదే... పాట సాహిత్యం
చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల పల్లవి: నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే ఎవరేమన్నా... ఎన్నటికైనా... ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే ఏహే... Don't Care Master చరణం: 1 కల్లాకపటం ఎరుగనివాణ్ణి.... గాలిపటంలా తిరిగేవాణ్ణి కల్లాకపటం ఎరుగనివాణ్ణి.... గాలిపటంలా తిరిగేవాణ్ణి పెంకిఘంటంలా నిలిచేవాణ్ణి... నిండుగుండెతో బతికేవాణ్ణి. నిండుగుండెతో..బతికేవాణ్ణి.. నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే ఏహే... Don't Care Master చరణం: 2 పైసా అంటే నాకూ ఇష్టం... పైసా లేనిదే మనుగడ కష్టం పైసా అంటే నాకూ ఇష్టం... పైసా లేనిదే మనుగడ కష్టం పైసా కోసం... మోసం చేస్తే..ఏయ్ పైసా కోసం మోసం చేస్తే ... పరువు తీసి పారేస్తాను.. పరువు తీసి పారేస్తాను నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే ఏహే... Don't Care Master చరణం: 3 మంచివాళ్ళతో నేస్తం కడతా... బడా చోరుల భరతం పడతా మంచివాళ్ళతో నేస్తం కడతా... బడా చోరుల భరతం పడతా చింతా చీకు లేకుండా... సంతోషంగా జీవిస్తా.. సంతోషంగా జీవిస్తా.. నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే
పగటి కలలు పాట సాహిత్యం
చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి పల్లవి: పగటి కలలు కంటున్న మావయ్యా గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా మావయ్యా.. ఓ మావయ్యా మావయ్యా.. మావయ్యా గలా గలా నవ్వేటి గంగమ్మా బంగారు మేడలెన్నో కట్టానమ్మా గంగమ్మా.. ఓ గంగమ్మా గంగమ్మా.. ఓ గంగమ్మా చరణం: 1 అందని కొమ్మకు నిచ్చెన ఏస్తున్నాడూ అబ్బాయి యాడాడో చూస్తున్నాడూ అందని కొమ్మకు నిచ్చెన ఏస్తున్నాడూ అబ్బాయి యాడాడో చూస్తున్నాడూ లక్షలు వచ్చేదాక కాచుకొన్నాడూ అందాక మోజులన్ని దాచుకొన్నాడూ అందాక మోజులన్ని దాచుకొన్నాడూ మావయ్యా.. ఓ మావయ్యా హోయ్ హోయ్ .... మావయ్యా.. ఓ మావయ్యా పైసలేంది దేవుడైన పలకరించడే అసలు పలకరించడే పైసలేంది దేవుడైన పలకరించడే అసలు పలకరించడే చూసి చూడనట్లు మొగం తిప్పుకొంటాడే చూసి చూడనట్లు మొగం తిప్పుకొంటాడే ముప్పై లక్షలు వచ్చే రోజు వున్నదే నీకు నాకు జతలేదని రాసివున్నదే గంగమ్మా.. ఓ గంగమ్మా గంగమ్మా.. ఓ గంగమ్మా చరణం: 2 డాబు సరిగ కూసొంటే డబ్బులొస్తాయా మాటలు దులిపేసుంటే మూటలొస్తాయా డాబు సరిగ కూసొంటే డబ్బులొస్తాయా మాటలు దులిపేసుంటే మూటలొస్తాయా మావయ్యా నీ సంగతి తెలుసు లేవయ్యా పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా హాయ్.. పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా మావయ్యా.. ఓ మావయ్యా హోయ్ హోయ్ .... మావయ్యా.. ఓ మావయ్యా రంగడంటే అల్లాటప్ప రంగడు కాదే.. భలే రంగడు వీడే నలుగురిలో దర్జాగ వెలిగిపోతాడే నలుగురిలో దర్జాగ వెలిగిపోతాడే అత్తకొడుకు ఎంతవాడో అపుడు చూస్తావు అబ్బో అబ్బో అని జేజేలు కొడతావు గంగమ్మా.. ఓ గంగమ్మా గంగమ్మా.. ఓ గంగమ్మా పగటి కలలు కంటున్న మావయ్యా గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా మావయ్యా ఓ మావయ్యా మావయ్యా ఓ మావయ్యా
పైసా పైసా పైసా పాట సాహిత్యం
చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: పరువు నిచ్చేది... దొరను చేసేది పట్టపగ్గంలేని పదవి తెచ్చేదీ... పైసా హో... పైసా..పైసా.. పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా చరణం: 1 కాసుంటే కలకటేరు... కలిగుంటే గవరనేరు కాసుంటే కలకటేరు... కలిగుంటే గవరనేరు డబ్బు బాగవుంటే వాడి దెబ్బ కెవరు సాటిరారు పైసా..పైసా.. పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా చరణం: 2 ఉంటే నవాబు సాహెబు... సలాం సలాం... ఆదాబ్ బరజ్ లేకుంటే గరీబు..సాహెబు... గులాం గులాం... హాయ్..అల్లా ఉంటే నవాబు సాహెబు... సలాం సలాం.. లేకుంటే గరీబు సాహెబు... గులాం గులాం.. డబ్బులేక సుఖంలేదు..సుఖం లేక బ్రతుకు లేదు డబ్బులేక సుఖంలేదు..సుఖం లేక బ్రతుకు లేదు అదీ ఇదీ కలిసుంటే..మనిషికేమి లోటులేదు పైసా..పైసా.. పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా చరణం: 3 ప్రతిరోజు చందురుణ్ణి... పలకరించి రావచ్చు కొండమీద చుక్కపూలు... కోసుకొని తేవచ్చు ప్రతిరోజు చందురుణ్ణి... పలకరించి రావచ్చు కొండమీద చుక్కపూలు... కోసుకొని తేవచ్చు రవ మువ్వల తెప్ప.. .రవగాలికి తెరచాప రవ మువ్వల తెప్ప..రవగాలికి తెరచాప వదిలేసి వలవేసీ... వదిలేసి వలవేసీ కడలికడుపులో..ముత్యాల్ గంపెడేసి తేవచ్చు హో... పైసా..పైసా.. పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా
అబ్బబ్బబ్బో చలి... పాట సాహిత్యం
చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం నాగేశ్వరరావు , ఎల్.ఆర్.ఈశ్వరి పల్లవి: అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి నీ ప్రేమకు నే బలీ.. బలి... బలి బలి బలి బలి అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి ఈ దెబ్బతో నువ్... ఖాళి... ఖాళి.. ఖాళి ఖాళి ఖాళి ఖాళి అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి చరణం: 1 నిండు ప్రేమలో పడ్డాను... నిట్ట నిలువునా తడిశాను నిండు ప్రేమలో పడ్డాను... నిట్ట నిలువునా తడిశాను తడిసీ తడిసీ దారి గానకా... నీ కౌగిటిలో తేలాను నీతో నేను తడిశాను... నీపై జాలి తలిచాను నీతో నేను తడిశాను... నీపై జాలి తలిచాను ఈ భాగ్యానికే వణుకుతు ఉంటే... చేయీ చేయీ కలిపాను అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి ఈ దెబ్బతో నువ్... ఖాళి.. ఖాళి.. ఖాళి ఖాళి ఖాళి ఖాళి అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి చరణం: 2 గంగీ నీపై నాకుంది... అందుకె ఊపిరి నిలిచింది గంగీ నీపై నాకుంది... అందుకె ఊపిరి నిలిచింది కొంగు బట్టుకొని నీతో ఉంటే... వెచ్చ వెచ్చగా ఉంటుందీ ఒళ్ళు చల్లబడి పోయిందా..ఆ వేడి వేడి అని అంటుందా..ఊ ఒళ్ళు చల్లబడి పోయిందా... వేడి వేడి అని అంటుందా ఒంటిగ కూర్చొని మంట వేసుకొని... ఇంట్లో ఉంటే సరిపోదా అబ్బబ్బబ్బో చలి అహ ఉహు అహ ఉహు గిలి ఈ దెబ్బతో నువ్.. ఖాళి... ఖాళి... ఖాళి ఖాళి ఖాళి ఖాళి అబ్బబ్బబ్బో చలి అహ ఉహు అహ ఉహు గిలి చరణం: 3 దివానుకే మస్క వేశాను... బంగారపు నగ కొట్టేశాను.. ఎట్టా..ఆ దివానుకే మస్క వేశాను... బంగారపు నగ కొట్టేశాను రంగుగ నీ మెడలో తగిలించి... రంజు రంజుగా చూస్తాను బంగారపు నగలొద్దయ్యో.. ఆహా! సింగారం పని లేదయ్యో.. ఏం బంగారపు నగలొద్దయ్యో... సింగారం పని లేదయ్యో బొంగారమ్ములావున్న నీవే... నా హంగుకు సరిపోతావయ్యో అబ్బబ్బబ్బో చలి... అహ అహ అహ అహా గిలి నీ ప్రేమకు నే బలీ బలి బలి బలి బలీ అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు..గిలి అహ..అహ..అహ..అహా.. అహ..అహ..అహ..అహా..
Hip Hip Hurray పాట సాహిత్యం
చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: Hip Hip Hurray... ఓహో భలే Hip Hip Hurray... ఒహో భలే చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు గెలుపే మెరుపై తెలిపెను... తెలిసెను బతుకు బాటలో మలుపు గెలుపే మెరుపై తెలిపెను... తెలిసెను బతుకు బాటలో మలుపు Hip Hip Hurray... ఒహో భలే చరణం: 1 స్నేహం ఎంతో తీయనా... అది తెలిసిన మనసె చల్లనా ఓ...ఓ... మ్మ్....మ్మ్... ఓ...ఓ.....ఓ.....ఓ...ఓ.....ఓ స్నేహం ఎంతో తీయనా... అది తెలిసిన మనసె చల్లనా తీయని చల్లని లేత మనసు నీ స్నేహం వలన కమ్మనా... నా తీయని చల్లని లేతమనసు నీ స్నేహం వలన కమ్మన Hip Hip Hurray... ఒహో భలే చరణం: 2 నీ కన్నులు చెప్పే కథలు... నా మదిలో చిలికెను సుధలు నీ కన్నులు చెప్పే కథలు... నా మదిలో చిలికెను సుధలు నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు... ప్రతినవ్వు కురిసెను తేనెలు నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు... ప్రతినవ్వు కురిసెను తేనెలు ప్రతినవ్వు కురిసెను తేనెలు Hip Hip Hurray... ఒహో భలే చరణం: 3 పక్కన నీవే ఉంటే... నే కంటా ఎన్నో కలలూ ఓ...ఓ...మ్మ్...మ్మ్... ఓ....ఓ......ఓ....ఓ...... పక్కన నీవే ఉంటే... నే కంటా ఎన్నో కలలూ పండిన కలలో పొంగే అలపై తేలిపోవాలి మనము పండిన కలలో పొంగే అలపై తేలిపోవాలి మనము Hip Hip Hurray... ఒహో బలే చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు Hip Hip Hurray... ఒహో భలే Hip Hip Hurray... ఒహో భలే Hip Hip Hurray... ఒహో భలే
పలుకలేని మౌనగీతి... పాట సాహిత్యం
చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: ఏమిటో... ఇది ఏమిటో ... పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి... ఏమిటో.... ఇది ఏమిటో... ఏమిటో.... ఇది ఏమిటో పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి... ఏమిటో... ఇది ఏమిటో ... చరణం: 1 అద్దంలో నా నీడ ముద్దుముద్దుగా తోచింది ... ఆ నీడా నను చూసి అదోలా నవ్వేసిందీ ... చెప్పకనే చిలిపి పయ్యెదా చప్పున జారిపోయింది ... ఒంటరిగా... పడుకుంటే... ఒంటరిగా పడుకుంటే... కొంటె నిదుర రానంటుందీ ... ఆహ్ ... పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి ఏమిటో... ఇది ఏమిటో... చరణం: 2 చీకటిలో నిదుర రానిచో... చిరుదివ్వెను వెలిగించనా ఆ చిరువెలుగే పనికిరానిచో... నా కనులే వెలిగించనా తలపులు దాటిన నా మనసే... తలగడగా అందించనా కమ్మని కలలే.... పండేదాకా... కమ్మని కలలే పండేదాకా... కథలేవో వినిపించనా ... ఆ అ అ అ ఆ ... ఆహ్ ... పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి ఏమిటో... ఇది ఏమిటో... చరణం: 3 గుండెలోనా వలపు మళ్ళీ కొత్తరేకులు విరిసిందీ... కిటికీలోన జాబిల్లీ కటిక నిప్పులు చెరిగిందీ విరిసిన వలపే ఘుమఘుమలాడే తరుణం రానే వస్తుంది ... కోరిన ప్రియుడే సందిట ఉంటే... గుండె చల్లబడి పోతుంది ... ఆహా... ఊ ... ఏమిటో... ఇది ఏమిటో ... పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి ... ఏమిటో ... ఇది ఏమిటో ...
మెరిసిపోయే ఎన్నెలాయె... పాట సాహిత్యం
చిత్రం: భలే రంగడు (1969) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల పల్లవి: మెరిసిపోయే ఎన్నెలాయె... పరుపులాంటి తిన్నెలాయే నన్ను యిడిసి యాడబోతివిరా... బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా మెరిసిపోయే... ఎన్నెలాయె.. పరుపులాంటి... తిన్నెలాయే నన్ను యిడిసి... యాడబోతివిరా బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా చరణం: 1 గాలి వీచి ఈలయేసే పూలసెండు గేలిసేసె హోయ్..గాలి వీచి ఈలయేసే పూలసెండు గేలిసేసె ఎన్నెలేవో కన్ను గలిపే సుక్కలన్నీ ఎక్కిరించె ఎన్నెలేవో... కన్ను గలిపే సుక్కలన్నీ... ఎక్కిరించె నవ్వులా పాలైతి నే కదరా... బంగారుసామీ.. నువ్వు రానిదీ బతక జాలనురా మెరిసిపోయే... ఎన్నెలాయె.. పరుపులాంటి... తిన్నెలాయే నన్ను యిడిసి... యాడబోతివిరా బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా చరణం: 2 కైపు కనులా సిన్నదాన్ని.. సొంపులెన్నో ఉన్నదాన్ని.. కైపు కనులా సిన్నదాన్ని సొంపులెన్నో ఉన్నదాన్ని పడుసు మనసు నిలువదాయె.. గడుసు వయసు గంతులేసె పడుసు మనసు నిలువదాయె గడుసు వయసు గంతులేసె జంట కోసం కాసుకొన్నారా..రా... రా... బంగారుసామి.. ఒంటిదాన్ని జేసిపొయ్యేవా మెరిసిపోయే... ఎన్నెలాయె.. పరుపులాంటి... తిన్నెలాయే నన్ను యిడిసి... యాడబోతివిరా బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా
No comments
Post a Comment