Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Karpura Harathi (1969)




చిత్రం: కర్పూర హారతి (1969)
సంగీతం: టి. వి. రాజు
నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ, చంద్రమోహన్, లక్ష్మీ, హేమలత
దర్శకత్వం: వి.రామచంద్రరావు
నిర్మాత: ఎస్. ఎల్. నాహతా, ఎస్. సౌండప్పన్
విడుదల తేది: 28.11.1969



Songs List:



బుల్లి బుల్లి రాణెమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: కర్పూర హారతి (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వసంత, విజయలక్ష్మి

బుల్లి బుల్లి రాణెమ్మ
బుజ్జి నా చెల్లమ్మ
బంగరుబొమ్మా - రావే మాయమ్మ

చరణం: 1 
నీ చిరునవ్వుల్లో వెన్నెలలూరేను
తీయని మాటల్లో తేనెలు జారేను
నీవున్న మాయిల్లు కలకలలాడేను
మా లక్ష్మి ఏ ప్రొద్దు కిలకిలలాడేను రాణెమ్మా

చరణం: 2
పుట్టిన యింటికీ - కీర్తిని దెచ్చేవు
మెట్టిన చోటున మెప్పు గడించేవు
ముద్దుల మూటపై పువ్వులబాట వై
చక్కగ మగని మనసు మురిపించేవు రాణెమ్మా.... ||
బలెబలె అన్నయ్యా
బంగారు అన్నయ్యా
ఓ వదినమ్మా అమ్మా మాయమ్మా

చరణం: 3
తల్లిగ లాలించి తండ్రిగ పాలించి
కొరతే లేకుండా - దిగులే రాకుండా
కన్నులలో నుంచి నను పెంచారులే
నిజముగ మీ ఋణము తీర్చలేనులే అన్నయ్య




వస్తుంది వస్తుంది పాట సాహిత్యం

 
చిత్రం: కర్పూర హారతి (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణం

వస్తుంది వస్తుంది
వరాల పాప వస్తుంది ఓలాలి | లాలి...
తెలుగులాంటి తీయని పాప
వెలుగులొలికే నా కనుపాప

||వస్తుంది||

చల్లనిపాప తన వెంట చంద్రవంకలు తెస్తుంది
బోసినవ్వులో దోసెడు దోసెడు ముత్యాలే కురిపిస్తుంది
చిన్నారిపాప రాకముందే నిన్ను నీవే మరిచేవు
ఆ వెన్నెలతునక ఒడిలోవుండే నన్ను సాంతం మరిచేవు

 ||వస్తుంది||

పుట్టిన బిడ్డకు ఓయమ్మో తమ పోలిక లే వస్తాయే మో
అది పిచ్చిగ మారాము చేస్తుందో సుతిమెత్తని దెబ్బలు తింటుందో
ముచ్చటగొలిపే పాపను చిరుముద్దుల్లో తేలిస్తాను
మాయిద్దరి నడుమ నువ్వోస్తే
వస్తే?!
ఒక ముద్దు నీకు విసిరేస్తాను

||వస్తుంది||




కిల్లా డెంకటసామి పాట సాహిత్యం

 
చిత్రం: కర్పూర హారతి (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: కె. వి. అప్పలాచార్య
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత, ఏ. ఎస్. ఎన్. మూర్తి

కిల్లా డెంకటసామి బలే
వకీలయాడోయ్  ప్రేమ కేసు పట్టాడోయ్
తారవలే నువ్వు బలే
తయారయావే పాత కేసు వయావే

(కిలా డెంకట)

కనుగొనగలనో లేనో
ప్రాణముతో సుతనూ (2)

తారవలె నేనుకూడ
తయారయానే ప్రేమ కేసు పట్టానే
నాది బలేకేసు - అహ అందమైన ఫేసు
ఫీజు కోరుకుంటావా పోజు చాలునంటావా

||కనుగొన||

కోర్టుకదా హార్టు యమ కోర్కెలున్న పార్టు
రోజు వచ్చి పోవాలి ఫీజు కూడ యివ్వాలి తప్పదు

||కిలా డెంకట||

ఆకాశవీధిలో మెరుపులా మెరిశావు
ఆశలో ననుత్రోసి మాయమైనావు
యాడ నీవున్నావో కొమ్మా !
అడ్రసైనా ఇచ్చి పొమ్మా ||
నీ  అడ్రసైనా ఇచ్చి పొమ్మా ||

పున్నమి వెన్నెలరేయీ ఈ
లాంతరు ఎందుకు రోయీ?
కులుకులా నటినోయీ
మనకలో కనవోయీ

ఇక నా గులాము నీవే
నిన్నేలు రాణి నేనే
నా పైట గొనుము రాజా!
నాచేత తినుము కాజా

కిల్లాడెంకటసామి బలే
కిల్లాడయాడోయ్ ప్రేమ
కేసు పెట్టాడోయ్||

తారవలే నువ్వు బలే
తయారయావే పాత కేసువయావే
చల్ మోహన రంగా నీకు నాకూ
జోడు కలసెనులే
చల్ మోహనరంగా
కొంగులోనే హంగు ఉన్నదిలే నీ
కొంగులోనే హంగు ఉన్నది పదవే |



ఎందాకా ఈ పయన పాట సాహిత్యం

 
చిత్రం: కర్పూర హారతి (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ఎందాకా ఈ పయనం ఎందాకా
ఎక్కడ విధి కాటు వేయదో
ఎక్కడ కన్నీరు మండదో
అందాకా నా పయనం అందాకా

||ఎందాకా!||

నవ్వుతూ బ్రతికేవారు కొందరు
ఏడుస్తూ చితి కెవారు కొందరు
నా సంగతి వేరురా నే జీవించేనురా
నవ్వుతూ ఏడవలేక ఏడుస్తూ నవ్వలేక హుఁ
 
||ఎందాకా!||

చెల్లినే తల్లిలాగా చూశాను
ఇల్లాలిని గుండెల్లోన దాచాను
ఆ యిరువురు దూరమై నా దైవం క్రూరమై
మలతోటలో చితిమంటలు చూశాను

||ఎందాకా!||

ఈ లోకం కొండంత గూడులు అందులో
ఎన్ని గువ్వలై నా ఒదిగిపోవురా
నష్టజాతకుని నీడ
నాన్నా! నీ కెందుకురా ?
పచ్చని ఏ పంచనైనా బ్రతకరా నువ్వైనా

||ఎందాకా!||




# పాట సాహిత్యం

 
చిత్రం: కర్పూర హారతి (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం:  దాశరధి
గానం: పి. బి. శ్రీనివాస్, విజయలక్ష్మి

కలసిన హృదయాలలో
కురిసెను ముత్యాలవాన
కలనిజమాయె కలతలుపోయె

||కలసిన||

నిన్నే వెదికే కన్నులలోనా
వెన్నెలు విరిసెను ఈ వేళ

||కలసిన||

కన్నుల నీవే మననున నీవే
కలలో ఇలలో అంతటనీవే

మోమున తిలకం మురిసిన వేళా
నా మది ఊగెను ఉయ్యాల

||కలసిన॥

సంపదలేలా స్వరాలేలా
నాలో సగమై నీవున్న వేళ

||కలసిన॥



# పాట సాహిత్యం

 
చిత్రం: కర్పూర హారతి (1969)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం:  ఆరుద్ర 
గానం: పి. సుశీల

చక్కని పాప చల్లని పాప
పాలూబువ్వా - పాలూబువ్వా కావాలా!
వెండిగిన్నెలోన నీకు వేడిబువ్వతేనా
వెన్నా మీగడ పంచదార గిన్నెలో కలిపేనా
ముద్దులమూటకు వెచ్చని గోరుముద్దలు పెట్టేనా
చిట్టి పొట్టి బంగరుకొండా నువ్వేనా

||చక్కని పాప||

పుట్టినిల్లుదాటి నేను మెట్టలేదే ఇల్లు
చిట్టితండ్రికి నా చేతులతో తొట్టిని కట్టేనా
నవ్వులవాన పువ్వులసోస నువ్వేనా బాబూ
నువ్వూ నేనూ - నువ్వూ నేను ఆడాలి

||చక్కని నపాప||

చిన్ని బాబూ నీకు నేను అన్ని ఇవ్వగలను
కన్న తల్లి ప్రేమ మాత్రం ఎక్కడ తెచ్చేది
కల కమ్మని మదిలో తీయని మమత కలిగే నీవల్ల
అమ్మలాంటి పిన్ని నీకు కావాలా

||చక్కనిపాప||

No comments

Most Recent

Default