చిత్రం: శంకు తీర్ధం (1979) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: కృష్ణ, జయప్రద దర్శకత్వం: విజయ నిర్మల నిర్మాత: ఏమ్.జీవన్ కుమార్ విడుదల తేది: 18.10.1979
Songs List:
ఈవేళలో ఈ పూలలో పాట సాహిత్యం
చిత్రం: శంకు తీర్ధం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా. సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల ఈవేళలో ఈ పూలలో ఎన్నెన్ని భావనలో ఏమవున రాగిణులో దేవుని చరణాల వాలాలనీ ! చరణం 1 నెమలి ఆడినా కోయల పాడినా ఆదేవుని ఆరాధనకే మెరుపు మెరిసినా - మబ్బుకురిసినా పరమాత్ముని అభిషేకానికే ప్రతి కిరణం వెలుగుతుంది ప్రతి పవనం సాగుతుంది. ఆ దేవుని సన్నిధి చేరాలని !! చరణం :2 కల్లలు ఎరుగని కలతలు లేని ఈ చల్లని సుమవనిలోన వెదురు వెదురులో విరుల పొదలలో ఉదయించే స్వరనిదులలోన ప్రతి అణువు పరవశించే ! నా మనసే పల్లవించే దేవుని నీడను నిలవాలనీ !!
తలుపు మూయనా పాట సాహిత్యం
చిత్రం: శంకు తీర్ధం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & పి.సుశీల పల్లవి: తలుపు మూయనా లైటు తీయనా గువ్వగా గూడుగా నువ్వు నేనూ రివ్వుమంటూ నవ్వుకుంటూ రేగిపోదామా తలుపు మూయకు లైటు తీయకు రేగకు ఊగకు సువ్వు నేనూ వేరుగుంటే వంటి కెంతో మంచిదంటాలే !! చరణం: 1 ఎదరనీవుంటే నిదరపోనంది ముదిరిపోయింది వలపే!! నిదురపోతుంటే ఎనకవున్న ట్టే ఉలికి పడుతుంది. వయసు హే ! ఈడువేడెక్కి పోతుం టే అంతే నాడిప్పడెక్కి పోలె గల్లంతే మంత్రమే పెట్టనా తంత్రమే చెయ్యనా జలుబు గిలుబు దెబ్బతోనే జబ్బులన్ని తిప్పికొడతాలే "తలుపు" చరణ: 2 పుటకలో వింత పులకరింతుట చిటిక లేసిందియిప్పుడే చిలిపిగా క్రొత్త సలపరింతంట చిగురు లేసింది అప్పుడే హే- ఒళ్ళు పొగరెక్కిపోతుంటే అంతే వయసు పొగరాని సెగలున్న మంటే మడుగులో ముంచనా మంటలే ఆర్పనా పులుపూసలుపూతిమ్మిరంతా ఇప్పుడే నే తిప్పికొడతాలే "తలుపు"
అబ్బా నీరసం పాట సాహిత్యం
చిత్రం: శంకు తీర్ధం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల అబ్బా నీరసం ఎమిటో ఆయాసం బిళ్ళుందా ? లేదు అమ్మమ్మమ్మమ్మ కాలునొ ప్పిగా వున్నట్లుంది. సూది మందుందా ? లేదు లేదా | లేదా ఏంలేదా ' అయ్యో నా రాత ఏమి డాక్టరు పోవయ్యా గొప్ప యాక్టరు నువ్వయ్యా మాటా లేదు మంచి లేదు మనిషికి మనసే లేదయ్యా ఏమ్మా కాలీనొప్పా? ఎక్కడమ్మ యిక్కడ టిష్యూ అహహహ ఇది మాయరోగం అమ్మాయి దీనికి నాటుమందే వెయ్యాలి || ఇదీమాయ|| ఆ జీలకర్ర, సింగినాధం అల్లం బెల్లం పట్టెయ్యాలి చేనులాంటి వయసుంది పైరులాంటి సొగసుంది మసక పడితే మనసులోన చిలకపలికింది వేటాడే చూపు నీది వెంటాడే ఊపు నాదీ అగ్గి గాలి ఏకమైతే భగ్గు మంటుంది. అందుకే అందుకే నాతల్లి తగ్గ మంటుంది నిన్ను తగ్గ మంటుంది ||ఏమిడాక్టరు|| ఏటికైనా ఒడ్డుంది. ఎందుకైనా హద్దుంది. వయసుకై నా మనసువుంటే సరసమవుతుంది ఆహ నీ మొక్కు చెల్లించే దిక్కేదో గాలించు వద్దంటేనే మోజు పెరిగి, ముద్దులడిగేది. అందుకే అందుకే ఒరయ్యో చిక్కు రేగింది నీ పిచ్చిపట్టింది.
కొత్త పొద్దు పొడిచింది పాట సాహిత్యం
చిత్రం: శంకు తీర్ధం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్.పి. శైలజ కోరస్ కోరస్: మామామియో నూ మామియో మామామియో నా సామియో!! పల్లవి : కొత్త పొద్దు పొడిచింది కోడెగాలి వీచింది పల్లె పడుచు గుండెలోనా పాలపిట్ట కూసింది ! చరణం : 1 మామా! ఓచందమామా | నీకెంతటి దీమా! చూపించవు (ప్రేమ ! వలచే చెంగలువ పై న ఏమ్మా ' గుమ్మాడే గుమ్మా ' గోరింటరెమ్మా ! సరసాలొద్దమ్మా అరరే పదిమందిలోన ! సరసమంటే ఒప్పుకోడు సాములయ్య రంజులేమి తెలుసుకోడు రాములయ్య ఈగ వాలనీయడయ్య వెంకటయ్య దీని భావమేమిటయ్య తిరుమలయ్య! అరచాటునుంటే వోదిగివుంటే ఆ అందమే అందం తెరదాటి రాదన్ము తీయని అనురాగం చరణం: 2 అవ్వా ఏచెకుముకిరవ్వా - ఏ లకుముకి గువ్వా ఏముద్దులమువ్వా నిన్నే కాజేస్తుందేమో ఏది ఆ గువ్వ ఏది నీ ఊహనీది ఎందుకు ఈ సోదీ పగలేకలగంటివేమో! ఎన్ని నేర్చినాడమ్మ రామ రామ ఏమి చురక లేసేనమ్మ రామ రామ కొలికేస్తే మెడకేసె రామ రామ చాలు చాలు లెంపలేసుకుందామా సరదాగా అంటే విసురుతుంటే ఉలికిపడతారా ఆడాలి ఈవేళ అందరూ మనసారా !
నామది మధురా నగరి పాట సాహిత్యం
చిత్రం: శంకు తీర్ధం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం నామది మధురా నగరి ని యెద యమునాలహరి కృష్ణ సంగీత మురళి రాధ రాగల రవలి కలసి పిరిసింది అందాల బృందావని చంచల కిరణం నయనం హరిచందన కలశం వదనం నీ నీలికురులు నా నీలగిరులు నీ చిలిసి కనులు నావలపు వనులు ఇవి సంగమించు సంగీత నదులు రవి చూడలేని సాహిత్య నిధులు నీ కరాలు హిమ శికరాలు నీ పదాలు ప్రణయాస్పదాలు అంతులేని అనురాగ సాగరాలు వెన్నెల కెరటం అధరం అది మధురిమ కన్నా మధురం మనరాసలీల మధుమాస హేల సప్త స్వరాల రాగాల డోల మన జవ్వనాలు నవనందనాలు హిమ తుషారాలు సుమకుటీరాలు వీక్షణాలు అతి తీక్షణాలు ప్రణయ కావ్య మధురాక్షరాలు శతవసంత శరద్వేణు స్వాగతాలు "నా మది"
జగమేలే పరమాత్ముడవని పాట సాహిత్యం
చిత్రం: శంకు తీర్ధం (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా. సి. నారాయణరెడ్డి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పల్లవి: జగమేలే పరమాత్ముడవని నిను శరణంటిని ఓదేవా నా మొరను తలచి నీ గిరిని విడిచి ఈ ధరణిని కాపాడరావా తిరుమలేశా ! ఓ శ్రీనివాసా చరణం: 1 ఎన్నెన్ని పూలతో నిను కొలిచినానో ఎన్నేళ్లు నీ మ్రోల నే నిలిచి నానో" అందుకు ఫలమే అడిగితినా క్షణమైనా వీధ్యానం మరచితినా తిరుమలేశా 'ఓ శ్రీనివాసా చరణం: 2 నీకంటి వీడలే మబ్బులనీ నీచేతి చలువలే గాలులనీ ఎంతగ యిన్నాళ్లు నమ్మితిని అది వింత భ్రాంతి అని ఎరిగితిని తిరుమలేశా ! ఓ శ్రీనివాసా పైరుల పెంచే వానలే జడివానలై విషమించగా ప్రాణం నిలిపే గాలులే సుడిగాలులై వికటించగా నదులు పొంగి జలనిధులు పొంగి కట్టలను తెంచి పల్లెలను ముంచి తరువుల సమూలముగ పెళ్లగించి కల్లోలించే వెల్లువలో పెను వెల్లువలో తల్లులనూ, పిల్లలనూ, పై రులనూ, పంటలనూ చుట్ట జుట్టు కొని పోతుంటే , పొట్ట బెట్టుకొని పోతుంటే పండిన పాపం బద లాయేనని అనుకుంటున్నావా ఏ పాపం యెరుగని అమాయకులను బలిగొంటున్నావా వేడుక చూస్తూ ఉన్నావా విధి నిర్ణయమంటున్నావా అయితే ఇది నిర్ణయమైతే తుది నిర్ణయమైతే ఈ పువ్వులు వ్యర్థం ఈ పూజలు వ్యర్థం నీధ్యానం వ్యర్థం - నాజన్మం వ్యర్థం నను. తీసుకెళ్ల పయ్యా ఇక తీసుకెళ్లవయ్యా.
No comments
Post a Comment