చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: నార్ల చిరంజీవి, అప్పలా చార్య, కొనకళ్ల వెంకటరత్నం, బి. వి. నరసింహారావు గానం: మోహన్ రాజు, చిత్తరంజన్, విజయలక్ష్మీ శర్మ, రామలక్ష్మి, పుష్పలతా శ్యామ్యూల్ నటీనటులు: కృష్ణ , విజయనిర్మల, బేబీ శ్రీదేవి దర్శకత్వం: తాపీ చాణక్య నిర్మాత: సి. వి. ఆర్.ప్రసాద్ విడుదల తేది: 12.03.1970
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Songs List:
విధి విలాసమేలే పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల గానం: కె.బి. కె.మోహన్ రాజా విధి విలాసమేలే అంతా విధి విలాసమేన అది బలీయమేలే దాని వేగమాగదులే భయము ఎందుకు? - భయము ఎందుకు? నడువు ముందుకు కాలానికి హృదయం లేదు - కన్నీటికి విలువేలేదు! జరిగేదేదో జరగకపోదు- జగతిని నడిపే దెవంకలదు!! మనసుండటమే మనిషికి శిక్ష - అది వుండటమే నీతికి రక్ష చనిపోదామని నీవనుకున్నా - చావుకు నీపై దయయే రాదు మనసుండటమే మనిషికి శిక్ష - అది వుండటమే నీతికి రక్ష !!
వల్లరి బాబోయ్ కావురోరయ్యా పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల గానం: చిత్తరంజన్, రామలక్ష్మి వల్లారి బాబోయ్ కావురోరయ్యా ! - జరుగు జరుగుమన్నా! నే జరగలేనన్నా ! - కొండకి పోవాల! పువ్వులు తేవాల! నంది వాహనా గజాననా -మూషిక వాహన గజాననా భాయీ భాయీ గజాననా! పార్వతి నందన గజాననా! మాపిటేలకీ సరాసరీ ! - తోపు సేలకీ వత్తావా ! హై! కంచె సాటునా కూకోనీ - మంచి చెడ్డా ఇంటావా? అహ కూకోమంటే ఎట్టయ్యో - కూడు కూరా నండద్దా (మరి) అయ్యో రామ ఏందయ్యో - ఆనకమళ్ళా రావయ్యో ! అయ్యో రామ -- అమ్మా కామాక్షమ్మ తిరుణాళ్లంటా ఆ.. ఆ.. ఎగువ యాదగిరి దిగువ జొన్నవాడ - మా ఇంటో అందరు ఎల్తారంటా ఒంటిగ నన్నే వుంచేరంటా! అయితే ఇంకేం! అయిసరబజ్జా ! అదును దొరికింది అడ్డు సెప్పకా - ఆయారకి నేనాడికి వస్తా!!
ముసురేసిందంటే పైన పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల గానం: చిత్తూరు వి. నాగయ్య మునుచేసిందంటే పైన - అసలే మతిపోతది పిల్లా ! ససి చెడినటుంటది లోలోన - ఓ చక్కని చుక్కా ! ససి చెడినటుంటది లోలోన - ముసురేసిందంటే పైన అసలే మతి పోతది మావా ! ససి చెడినట్లుంటది లోలోన ఓ ముద్దుల మావా ! పసి చెడినట్లుంటది లోలోన మబ్బుతెరల మసకలలోన మంచుపొగల మెలికలలోన మనసేటో సిక్కడినట్లే - మనేద కుదిపేస్తది లోని పసుపాడిన పెరులె నడుమా - పడగెత్తిన సన్ననితోవ నువు మసిలే చెలకలవంకే - నురగలు కక్కే నది యేమో కోవెల చిరుగంటలు చెవిలో- కావాలని కత కలిపించీ, మన యిద్దరినీ మురిపిస్తె మరులు గొలిపి తెగబులిపిస్తె ఏటి మలుపులో ధనసలే - తోట వొడలు విరిచిన వేళ ఆ నాటి మన పరాసికాలు నవ్వుతాళె అంటది మెరుపు
ఆగవోయి ఒకసారి పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొనకళ్ల వెంకటరత్నం గానం: కె.బి. కె.మోహన్ రాజా, విజయలక్ష్మీ శర్మ ఆగవోయి ఒకసారీ - వెళ్ళిపోకు వేసారీ కనిపించినదే నిజమనుకుంటే - విధి శాపానికి బలియౌతావు విధి విలాస మేలే—అంతా విధి విలాస మేలే అది బలీయమేలే-దాని వేగ మాగదులే తిరిగి చూడవోయి వెను తిరిగి చూడవోయీ నీ వెనుకే నీ నీడ వున్నదోయీ సీతారాములు విడిపోలేదా ? విధి ఎవరిని విడిచినదోయీ - నలుడే దాస్యము చేసెను కాదా? అది చెప్పిన కధలెన్నో వున్నాయి. నొసటిరాతలు సరిగావుంటే - మనసు కోతలు మనుషులకుండవు కాలం ఎదురై నిలిచిందంటే కల్లే నిజమె కనబడుతుంది.
కృష్ణా కృష్ణా నా రాధ ఇలా పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల గానం: కె.బి. కె.మోహన్ రాజా, విజయలక్ష్మీ శర్మ కృష్ణా! కృష్ణా! కృష్ణా! నా రాత ఇలా, నలుగురిలో - సవ్వల పాలేనా? కలత లేని వలపులో మెలకువు గొరిగినవాడు కానరాడు.నా పై, తన కలలనిన నడు లోకానికి వింత నాలోగల వలపంతాం ఏక దాగినావో అని ఎకెడ వెదకుదు నేను. ఎచట దాచితివే దొరవని - ఎల్లరు నన్నడిగేరు ఏడ కెగినావో మరి - ఏడ కెగినావో ! సరససున్న వేళ నా దౌర, నేనొకటని పొగరు జాడ తెలియదాయె ఇక రాడని ఒక టే జెదుగు - ఏక మనసు కోత ఒక ఏటికి ఎదురీత! కృష్ణా! కృష్ణా!!
బరువైనది రేయి పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: గానం: చిత్తూరు వి.నాగయ్య బరువైనదీ రేయీ కరువైనదీ హాయీ కనుమూయలేను శిలనైన కాను!! విను వీధి నేలే రాజా ! నా రాజు ఏడీ ? కనిపించితే నా గాధా వినుపించుతావా ? వివరించు బాల గమనించలేవా ఏమేమో ఊహాగానం చేశాను నాలో నా పాట ముగి సేలోగా-చెయిజారే వీణ వీణ తునక ఒకటే నే దాచుకున్నా మనలేని మమకారంతో వెదికాను లోకం ఎటు పోయినావో ఏమో - మిగిలింది శోకం! మిగిలింది శోకం! - బ్రతికాను నా బాబు కోసం
అయ్యయ్యో వంటరిదాన్ని రా పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: గానం: విజయలక్ష్మీ శర్మ అయ్యయో వొంటరిదానర ఓ మావో రారా వోఁ మావో జంటగా వొస్తివ మంచిది అత్తకొడుకు ఊరెళ్ళాడు ఆరు నెలలదాకా రాడు ముసలత్తకు రేజీకటిరో అబ్బబ్బ - ఈ వెన్నెల రేయి అయ్యయో మత్తు మత్తుగా కళ్ళున్నాయి గమ్మత్తులు చేస్తున్నాయి. పూసిన గంధం ఆరింది. వేసిన పూవులు వాడాయి. వెన్నెల వేడిగా మారింది. యౌవన రుచి చూపిస్తా అరచేతికి స్వర్గం తెస్తా కోరినదంతా ఇస్తారో గుండె గుండె రగిలిస్తాను తోడులేక ఎద కాలింది.
గాంధీ కి పెద్ద గుడి కడదాం పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: గానం: చిత్తరంజన్ గాంధీకి పెద్దగుడి కడతాం కడతాం కాన్కలూ చందాలు పడతాం పడతాం. ప్రజల కె మేము పుడతాం గిడతాం బహు తెల్ల టోపీలు పెడతాం పెడతాం శ్రీ గాంధీ నామాలు మరువాం మరువాం చందాలు ఇవ్వంది వదలాం కదలాం సిమెంటు బదులుగ బూడిద కలిపాం కట్టకముందే, ఇంతెన కూలింది ఆ వంతెన కూలిందీ. లంచాలిచ్చీ మంచాల్ వాల్చీ లక్షలు లక్షలు సంపాదించాం తెగ సంపాదించాం ఎగుమతి దిగుమతి ఎక్స్పర్ట్ లమని కలితీ పండిట్' బిరుదంయిచ్చారు. దొడ్డ బిరుదంపట్టాము. ఉడతా భక్తిగ మిము సేవింపగా ఉరుకున పరుగున పడి వొచ్చామండి జై కొట్టిమూర్ఖుల్ని రెచ్చ గొడుతుంటాము చందాల్ని కాజేసి మేడలను కడతాము లాడ్జీలు క్లబ్బులూ నడుపుతూ వుంటాము రౌడీల్ని గూండాల్ని మేపుతూవుంటాము దారి తప్పిన స్త్రీల బిజినెస్సు పెట్టాము దండిగా మొండిగా లక్షలార్జించాము మీ రక్తమును-ప్రజలారా మీ రక్తమును మేము దానమిస్తుంటాము మిము గొల్వ వచ్చాము ఘన దేశ భక్తులం ! చిల్లర మంత్రికి చెల్లెలి కొడుకుని ఎస్సెల్సీలో ఏడేళ్లున్నా ! ఎమ్మెల్యేకొక ఆఫరు వుంది లక్షల కట్నం బేరం వుంది! కాలక్షేపం కలిసొస్తుందని ఈ విరాళాలు వేటకు వొచ్చా ! ఎప్పటికైనా మంత్రిని అవుతా ఇప్పటినించే చందాలివ్వండి! భోంచేస్తుంటాను ఎందుకయ్యా వొచ్చినావు? ఓ గాంధీ నీవు ఎవరి కొంపా కూల్చుతావు ఓ గాంధీ !! చచ్చి స్వర్గాన్నుండలేవా? ఓ గాంధీ మాకు చిచ్చు పెట్టగ వొచ్చినావా ఓ గాంధీ ! తాడి చెట్టంతగుడి తక్షణం కట్టించి నిలువెత్తు నీ బొమ్మ నీటుగా పెట్టించి రాళ్ళ రప్పల పైన రాయిస్తు నీ పేరు నిత్య నైవేద్యాలు నీకె పెట్టిస్తురా ! శాంతి శాంతంటాపు సత్యమంటావు హింస వొద్దంటావు ఎందుకొచ్చిన ఖర్మ ? మంత్రాలతో చింతకాయలి క ఠాలవు మా మాటవిని మనసు మార్చుకొని వెళ్ళిపో మా పొట్టపై దెబ్బ కొట్టొద్దు కొట్టొద్దు మా బ్రతుకు తెరువుల్ని పాడు చేయొద్దు వచ్చినా దోవనె మళ్లి తిరిగెళ్ళిపో వెళ్ళిపో ! వెళ్ళిపో ! వెళ్ళిపో ! వెళ్ళిపో !
ఆగండి దేశ ద్రోహులారా పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: గానం: ఆగండి! దేశద్రోహులారా! ఆగండి! బాపూజీ జిందాబాద్ ఇన్క్వి లాబ్ జిందాబాద్ చాలు చాలు మీ ఆగడాలు ఆపండి మహాత్ముని మాటలు మరుచుట తగదండీ భారత జాతికి జీవంపోసి- బానిస బ్రతుకులు బాపిన దైవం బాపూజీ మన బాపూజీ జిందాబాద్ మానవులందరు ఒక్కటస్ మంచిని మదిలో పెంచమనీ దేశంకోసం బ్రతకమనీ - బోధించెను మన బాపూజీ బాపూజీ మన బాపూజీ జిందాబాద్. సోమరితనమును మానాలి - శాంతి అహింసలు స్థాపించాలి. ప్రగతి పథములో నడవాలి ప్రతిమనిషీ హాయిగా బ్రతకాలి అపుడే భారతభూమికి క్రాంతి- అపుడే గాంధీ ఆత్మకు శాంతీ శాంతి, శాంతి, శాంతి.
మంచివాళ్ళు ఈ బాబులు పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: బి. వి. నరసింహారావు గానం: విజయలక్ష్మీ శర్మ, పుష్పలతా శ్యామ్యూల్ మంచివాళ్ళు యీ బాబులు మా మంచి వాళ్ళు యీ అమ్మలు రంగు రంగుల బుడగలు కొంటారూ. పిల్లలకిచ్చీ మురిపిస్తారూ-చల్లగ మురిపిస్తారూ! ఇల పసి పాపలె పరమాత్మలన్నారు ఈ యింటికి బంగరు దీపాలన్నారు. పిన్నా పెద్దలు మెచ్చే బుడగలు వన్నె చిన్నెల వెన్నెల ముద్దలు లాలాలా పాల బుగ్గల బాలలకిస్తే పకపక నవ్వులు కురిపిస్తారూ అల్లరిచేసే పిల్లల కిస్తే అల్లరి గిల్లరి జాన్తానై - లా లా లా కల్లాకపటం తెలియని పాపలు-అల్లీ బిల్లీ యని తిరిగేరూ కొట్టుకున్ననూ తిట్టుకున్ననూ ఇట్టే కలిసి ఒక కై పోతారు. లాలాలా గుళ్లో దేవుడు గుడికే అందం ఊళ్లో పిల్లలు ఊరికే అందం అందంచందం తెలిసిన పెద్దలు అన్నీ మాపిల్లల కే యిస్తారు. పిల్లలకే యిస్తారు – లా లా లా
విధి విలాసమేలే పాట సాహిత్యం
చిత్రం: విధి విలాసం (1970) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: అప్పలా చార్య కొడకండ్ల గానం: కె.బి. కె.మోహన్ రాజా విధి విలాస మేలే అంతా విధి విలాస మేలే అది బలీయమేలే - దాని 'వేగ మాగదులే అనుబంధానికి ఆవేదనకూ కనిపించని ఒక సంకెల వుంది ఆవేదన వలదనుకుంటె అనుబంధానికి అర్థం లేదు! చీకటిలోనే వెలుగు పుట్టును - చింతనలోనే దొరుకును సుఖమూ ఆశ నిరాశల కలగలుపే ఈ మానవ జీవిత మోతుంది !!
No comments
Post a Comment