చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి నటీనటులు: యన్.టి.రామారావు, రాజశ్రీ దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్ నిర్మాత: బి.విఠలాచార్య విడుదల తేది: 17.10.1969
Songs List:
లేడి కన్నులు పాట సాహిత్యం
చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మం ఓలమ్మీ .... ఓలమ్మీ సై.... కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే ఓరబ్బీ .....ఓరబ్బీ పై వాగులా గలగల ఉరికీ తీగలా మెలికలు తిరిగి గుండెలో అల్లుకుపోతే గువ్వలా గుసగుస పెడితే... ఓలమ్మీ పై .... ఓలమ్మీ పై ... వాలుగా చూపులు చూసే పూల బాసలు చేసి ముదుగా ఉందామంటే ఇద్దరం ఒక టేనంటే ఓరబ్బీ .... ఓరబ్బీ పై .....
సరి సరి మగసిరి పాట సాహిత్యం
చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి సాహత్యం: కొసరాజు గానం: గాయనీ గాయకులు బృందం సరిసరి మగసిరి నీ అందము మరిమరి మనసుకు ఆనందము చక ఝణత తక ధిమిత రా రా రతిరాజా ! చిలకల కులుకులు చూడు జిల్ జిల్ జిల్ సొగవే జోడు వినరా హే సుకుమారా ధీరా కౌగిట చేరగ రా ! రా! లల్లలా జురా....జుం....జుం .... ముసిముసి నవ్వుల తీరు విసిరే చూపుల జోరు భళిరా రాజకుమారా రా రా చల్లని వేళయిదేరా
అలాంటి దాన్ని పాట సాహిత్యం
చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి సాహత్యం: కొసరాజు గానం: పి.సుశీల అలాంటిదాన్ని గౌనుః యిలాంటిదాన్ని గాను ఎలాంటిదాన్నో నేను నీకిపుడె తెలిసిపోను లబ్జలకిడి లబ్జలకిడి చక్కని చకెర చక్కని చక్కెరకేళి॥ ఒయ్యారం ఒలక చూసే చిన్నదానినోయ్ చూపులతో గాలమేయు సుందరాంగినోయ్ ఎవరనుకున్నావు నన్నెరుగవులే నీవు అబ్జలకిడి..... కమ్మంగా పాటపాడి కవ్విస్తానోయ్ గజ్జెకట్టి ఆటలాడి నవ్విస్తానో య్ ఎవరనుకున్నావు నన్నెరగవులే నీవు అబ్జలకిడి.....
పిలిచింది అందాల పాట సాహిత్యం
చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల హాయ్ లల్లలా.... లల్లలా లల్లలా.... లల్లలా.. యే యిదిగో నిన్నే... నిన్నే నిన్నే ... పిలిచింది అందాల బాల నిను వలచింది మందార మాల హాయ్ రాజ రాజ ఠారా! అందాలే అందుకోరా!! జాబిలిలేని కలువను నేను కౌగిలిలేని పరువము నేను కలలో నిన్నే కనుగొన్నాను హాయ్ రాజ... రాజ... వేచెను నీకె ఈ మధుమాసం పూచెను వీకై నాదరహాసం దాచితి నీకై ఈ అవకాశం హాయ్ రాజ... రాజ...
ఎవరో నీవెవరో పాట సాహిత్యం
చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల ఓ ప్రియతమా.. రావేలా... చెలిని చేరగ ఈ వేళ! ఎవరో... నీవెవరో ఎదలో పిలిచీ ఎదురుగ నిలిచీ తీయని ఊహల ఊయల లూపేవు చొక్కపు బంగరుమేను: పొగరెక్కిన సింగపు నడుము చుక్కల రాయని సోయగమ్ము నెక సక్కెములాడే మోము :: ఏ గంధర్వ లోకాల ఉన్నావో ఏ నీలాల గగనాలు దిగినావో శత వసంతముల ప్రతినిధివీవు ప్రతిలేని రతిరాజు ప్రతిరూపమే నీవు చంద్ర ఖండములు చెక్కిళ్లు ఇంద్ర నీలములు ముంగురులు అ పాలకడలి కెరటాల కరణి నాలోన పొంగినవి మరులు నీ అధరాన చిరునవ్వు విరిసింది నా హృదయాన విరిజల్లు కురిసింది. వనమయూరీవోలె తనువూగినది ఒక చింత గిలిగింత ఉయ్యాలలూపింది
రవ్వల నవ్వుల పాట సాహిత్యం
చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల రవ్వల నవ్వుల రాజకుమారీ నా నవజీవన నాట్యమయూరీః అందెలు పలుకగ రావే: గంధము చిలుకగ రావే! ఈ వేళలో! ఏమున్నదో పలెకెనులోన కల్యాణ వీణ ఆ రాగ మంజరిలోనా అనురాగ మాధురి లేదా రవ్వల నవ్వుల రాజకుమారా రాజకుమారీ మానసచోరా నా అణువణువున నీవే: నా ప్రాణములన్నీ నీవే..... నయనాలలో నడిరేలలో విరబూసె నాలో నీరూపమాల ఆ రూప మాలిక నీకై అందిచు కానుక కాదా ....
కాకి ముక్కుకు దొండపండు పాట సాహిత్యం
చిత్రం: అగ్గి వీరుడు (1969) సంగీతం: విజయ కృష్ణ మూర్తి సాహత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల అత్తరులో మునిగివున్న నవాబూ...ప్యారే నవాబ్ :. మత్తుగా తూలుతున్న జనాబూ....హాయ్ జనాబ్ : కలికి వలపే పూలచెండు: మగువ సొగసే దొండపండు। కాకిముక్కుకు దొండపండు దండగః దండగః అది రామచిలకకు దొరికితేనే పండగః పండగః వరహాల మూటలకన్న వజ్రాల కోటలకన్న ఖరీదైనది ప్రేమించే దిల్ అది వుంటేనే అందుతుంది బుల్ బుల్ కడకన్నులతో వేటాడేవా... కను బొమ్మలతో ఆటాడేవా చిరునవ్వుల పువ్వుల దోసిలితో వెంటాడేవాః కన్నెపిల్ల కనబడితే... గాజుల గలగల వినబడితే అంతలోనే మైమరిచేరు కడకు అడియాసల పాలౌతారు: దొరబాబుల తీరు అంతేలే నవ్వాబుల జోరు ఇంతేలే..... ఆ నాటికి నేటికి మిగిలింది ఈ వింతేలే...
No comments
Post a Comment