Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhagya Chakramu (1968)




చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
నటీనటులు: యన్.టి.రామారావు, బి.సరోజాదేవి
నిర్మాత, దర్శకత్వం: కె.వి.రెడ్డి 
విడుదల తేది: 13.09.1968



Songs List:



నీతోని వేగలేను పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి 

నీ తోటి వేగలేను పోపోరా
నీ ప్రేమ మానలేను రారారా
చేరగా దీసి మాలిమీ చేసి
జారి పోయేవురా ॥
ఎన్నెన్నొ మోహాలు చూపించేవు
ఎన్నైనా దాహాలు కలిగించేవు
కానీ లాలించగా పోనీ తేలించగా
కోరవు చేరవు ॥

ఎన్నెన్నొ చిందులు వేయించేవు
ఎన్నైనా విందులు గావించేవు
కానీ సయ్యాటకు పోనీ కై లాటకు
చిక్కవు దక్కవు ॥




వాన కాదు వాన కాదు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పి. సుశీల 

వానకాదు వానకాదు వరదరాజా
పూలవాన కురియాలి వరదరాజా ॥

వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరినేలు బాలరాజు చేరరాగా
కోకిలమ్మ పాటపాడ నెమిలిపిట్ట ఆటలాడ
సందడించి నా గుండె ఝల్లు ఝల్లు ఝల్లు మనగ ॥

కొండలోన కోనలోన తిరిగే వేళ
అండదండనీకు నేనే ఉండాలంటూ
పండువంటి చిన్నవాడు నిండుగుండె వన్నెకాడు.
చేరరాగ కాలియందె ఘల్లు ఘల్లు ఘల్లు మనగ ॥

కొండపైన నల్లమబ్బు పందిరికాగా
కోనలోన మెరుపుతీగె తోరణకాగా
మల్లెపూల తేరుపైన పెళ్ళికొడుకు రాగానే
వాని చూచి నామనసు వలె వలె వలె యనగ ..




నీవులేక నిముషమైన పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల, పి. సుశీల 

నీవులేక నిముసమైన నిలువజాలనే
నీవేకాదా ప్రేమ నాలో విరియచేసినది ॥
లోకమంతా నీవుగానే నాకు తోచెనుగా
మరువరాని మమతలేవో మదిని పూసెనుగా ॥
ఒకరికోసం ఒకరమనిన ఊహ తెలిసెనుగా
వీడిపోని నీడవోలె కూడి ఉందుముగా ॥




కుండకాదు కుండకాదు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

కుండకాదు కుండకాదు చిన్నదానా
నా గుండెలదర గొటినావే చిన్నదానా ॥

పరుగిడితే అందాలన్నీ ఒలికిపోయెనే
తిరిగిచూడ కన్నులలోన మెరుపు మెరిసెనే
ఒలికిన అందాలతో మెరిసిన నీ చూపులతో
ఎంత కలచినావో నన్ను ఎరుగవే తివే - ఓ హో హో ||

మొదటి చూపులోనే మనసు దోచుకుంటివే
ఎదుటపడిన నీ వలపు దాచుకొంటివే
దోచుకున్న నా మనసు దాచుకున్న నీ వలపు
అల్లిబిల్లి అయినాగానీ తెలియవైతివే ఓ హో హో ||

నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా
నిన్ను చూచు ఆశతోనే వేచినానుగా
పచ్చినట్టి నీ నెపము వేచినట్టి నా తపము
ఫలమునిలుపు కొందమన్న నిలువపై తివే - ఓ హో హో |



ఆశ నిరాశను చేస్తివిరా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

ఆశనిరాశను చేసితివా
రావా చెలియా రాలేవా
రావా చెలియా రాలేవా ॥
తోడుగనడిచేవనీ - నా నీడగనిలచేవనీ
జీవితమే ఒక స్వర్గముగా - ఇక చేసెదవని నే తలచితినే 
ప్రాణము నీవేయనీ - నా రాణివి నీవేయనీ
రాగముతో అనురాగముతో - నను ఏలెదవని నేనమ్మితినే 



రాజ కుమారి పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత 

రాజకుమారి బల్ సుకుమారి
నీసరి ఏరిధరన్
రాజకుమార బిరబిరా
నాసరి నీవెధరన్

సుందరమగునీ వదనము ముందర
చందురుడెందుకే బాలికా
పొందుగ పొగడిన నామదిపొంగి
చిందులు వేసెను బాలకా 
ఛెళుకున నీవొక కులుకు కులికితే
ఖలుకనె గుండెలు మోహినీ

ఏలా బెదరగ కొంచముగానే
కులికెదలేరా మోహనా ॥
బంగారముతో సింగారముకని
కంగారాయెనే సుందరీ
దొంగవుకావుగ కంగారెందుకు
చెంగున రారా సుందరా
తళుకు బెళుకులా చిలుకలకొలికివి
కళయన నీదే భామరో
నాలో అందము నీకే తెలిసెను
తెలివననీదే బావరో ॥
ఏమీ ? జడయా ?- పామేమోయని
నా మది బెదరెను కాంతరో
పాము మంత్రములు మా మామకు తెలియును
ఏమీ బెదరకు కౌంతుడా
నిన్నుచూచి నీ తీరునుచూచి
ఏమనవలెనో నాయికా
రాణి రాణీ నా రాణీయని
నను వెంటాడుము నాయకా




మనస్వామి నామం పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం 

మనస్వామి నామం పాడండీ
మనస్వామి రూపం చూడండీ ||
మనస్వామి భజనే చేయండీ
మనస్వామి మహిమే తెలియండీ
మానవ మాత్రుడు కాడండీ
మనస్వామి సాక్షాతు హరుడండీ ॥

వేదాలు మనకింక వద్దండీ 
అర్ధాలు తెలియక బెడదండీ
మనస్వామి మాటే మాటండీ
పరమపదానికి బాటండీ ॥

ఆషాడభూతి :
హరి : హారిలోరంగహారి హారిలో రంగహారి హారిలోరంగహారి
వాడు వీడూ ఎవడేకానీ
చూడ నీకడ మేడాలోన
చూడ చక్కని చిన్నదాని
కూడి మాడిన గురుస్వామండీ ॥

మనస్వామి నామం పాడండీ
మనస్వామి రూపం చూడండీ
మనస్వామి నామం - మనస్వామి రూపం
నామం రూపం - నామం రూపం
రహితం రహితం ||





తాళలేని తాపమై పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: పి. సుశీల 

తాళలేని తాపమాయె సామీ నా సామీ
వొళ్ళు కంపరమెత్తిపోయె సామీ నా సామీ 
సింగార రూపము కనగా - నీ రంగు హంగులు వినగా
మది చెదరే - యెద అదిరే అబ్బబ్బా
అబ్బబ్బ నా తల తిరిగెనురా ॥

చాటైన మారుని శరము - గాటైనగాయముశాయ
అసువులకే మోసముగా అబ్బబ్బా -
అబ్బబ్బ నిన్నిక విడువనురా



ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు 
గానం: ఘంటసాల

ఈవికి ఠీవికి ఎనలేని ఇంద్రుడు
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
కంఠాన గరళమ్ము కానరాని శివుండు
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
తలకొక్క తెలివిగా వెలిగేటి శేషుడె
ఇతడు కాకున్నచో ఎవడు వీడు
ఇంతవాడంతయె ఎదిగిన హనుమంతు
డితడు కాకున్నచో ఎవడు వీడు
వాడె వీడని ఎలరు గోడు సేయ
వజ్ర, శివుడును, శేషుడు, వటుకపియును
వీడె వీడని చాటింప వెడలినాడ
వాసి కనువాడ నినుగొల్చి ఓసుతండ్రీ ॥



అవతారమెత్తినావ స్వామిరాజా పాట సాహిత్యం

 
చిత్రం: భాగ్య చక్రము (1968)
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు 
సాహిత్యం: 
గానం: మాధవపెద్ది సత్యం 

భజన

అవతారమెత్తినావ స్వామిరాజా
మమ్మాదరింప వచ్చినావ స్వామిరాజా ॥

ఆడమగ బేధాలు స్వామిరాజా నీకు
అంటనే అంటవయ్యా స్వామిరాజా
అందరికీ చిక్కబోదు స్వామిరాజా నీది
ఆనంద యోగమయ్య స్వామిరాజా ॥

ముక్తి కాంతలో నీవు స్వామిరాజా ఎన్నో
ముచ్చటలు సేతువట స్వామిరాజా
ఎంత వేదాంతులకు స్వామిరాజా - సుంత
అంతుదొరకని తంతునీది స్వామిరాజా ॥

అందరొకే జాతైన స్వామిరాజా - అదే
చిదానంద మన్నావు స్వామిరాజా
అందరినీ అందలాలు స్వామిరాజా - నీవు
ఎక్కించ పుట్టినావు స్వామిరాజా ॥

No comments

Most Recent

Default