చిత్రం: భళా తందనాన (2022) సంగీతం: మణిశర్మ నటీనటులు: శ్రీ విష్ణు , కేథరీన్ థెరిసా దర్శకత్వం: చైతన్య దంతులూరి నిర్మాత: రజిని కొర్రపాటి విడుదల తేది: 2022
Songs List:
మీనాచ్చి మీనాచ్చి పాట సాహిత్యం
చిత్రం: భళా తందనాన (2022) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి గానం: ధనుంజయ్ సేపాన మీనాచ్చి మీనాచ్చి మిరియపు సూపు రాకాచి నీ ఘాటైనా సూపులకే పట పట పేలే శివకాచి మీనాచ్చీ మీనాచ్చి ముసుగేసావే మనస్సాచ్చి నచ్చిందే ఈ పిచ్చి నమ్మకపోతే నీ స్సాచ్చి తిరిగాననీ నీ నీడగా నా నీడే నాతో తగువాడే వినలేదని ఇన్నాళ్లుగా నా పేరే మారు మనువాడే పిసినారీ నా దారి మారి పారిపోయె మీనాచ్చి మీనాచ్చి మిరియపు సూపు రాకాచి నీ ఘాటైనా సూపులకే పట పట పేలే శివకాచి సిగురులా సింత ఇగురులా నీలో పులుపే ఇలా పలుపైనదే సెరుకులా నను కొరికితే బాలా కసికందినా కసి తీరదే సప్పగా సంకటే మారినా నీ సుట్టు నే సుట్టడం మారదే సుక్కలే రేయిలో ఆరినా నిన్ను నే సూడటం ఆగదే నాలొ గుంజేసి ఊపిరి నంజేసుకోమరి నన్నింక నాంచారి చేరి సేయి జారిపోకె మీనాచ్చీ మీనాచ్చి దయలేదంటే పిల్లాచి ముసిముసిగా ఎసరేసి నను తాగేసావే వడకాచి సిగలతో నువ్వు సిగినెలే ఇస్తే వచ్చిపొమ్మనా సచ్చిపొమ్మనా బొమ్మ సూడని బ్రహ్మచారిని నన్నే నమ్మలేననా సొమ్ములేదనా పోకిరీ గాడనీ ఎంచకే పూటుగా పుట్టినే ముంచకే కోపమే కొంగుకే కట్టకే పాపమే కంటితో కొట్టకే అంట గట్టేసి సురకలు సూదంటు కులుకులు సేదైన సెణుకులు ఓసి ఆశ తీరదాయే మీనాచ్చీ మీనాచ్చి కొరుకుడు పడని కొరకంచి నీ పైటంచూ ఎరవేసి చేసావే నన్ను సన్నాసి తిరిగానని నీ నీడగా నా నీడే నాతో తగువాడే వినలేదని ఇన్నాళ్లుగా నా పేరే మారు మనువాడే పిసినారీ నా దారి మారి పారిపోయే మీనాచ్చీ మీనాచ్చి మిరియపు సూపు రాకాచి నీ ఘాటైనా సూపులకే పట పట పేలే శివకాచి
రాసానిలా కనబడనీ పాట సాహిత్యం
చిత్రం: భళా తందనాన (2022) సంగీతం: మణిశర్మ సాహిత్యం: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా రాసానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖ చూసానిలా కదలననీ వదలననీ మౌనరేఖ రాసానిలా కనబడనీ వినబడనీ ప్రేమలేఖ నింగిలోని నీరులా నీటిపైన పేరులా కానరాని ప్రేమలేఖా రాసానిలా మీటలేని వీణలా మాటరాని పాపలా అందమైన మౌనరేఖ చూసానిలా పుస్తకంలో దాచుకున్న నెమలికన్ను జ్ఞాపకంలా మనసు దాటలేని మొదటి కవితలా అల్లుకున్న పంజరానే తేలుతున్న పావురంలా గీసుకున్న గీతే దాటలేనెలా తనని నాతో కలపగలిగే పిలుపు ఏదో తెలియక తెలుపలేక నిలుపలేక అలసిపోయా…నికా దాచానిలా నిజమిదనీ ఋజువుదనీ చూపలేకా చేరానిలా ఇరువురిదీ ఒకటి అనీ తీరారేఖ నడి ఎడారిదారిలో మౌన బాటసారిలా ఒంటరల్లే సాగానే నాకు నేనే ఎండమావి గుండెలో మండుతున్న ఎండనే వెన్నెలల్లే కాచావే నీవు నన్నే కలిసి ఉన్న వేళలోన వీలుకాని మాటలన్నీ మనసుతోటి నేడే మాటలాడనా ఊపిరాగి ఆగమన్నా గుండెచప్పుడాపుతున్నా దాచుకున్న ప్రేమే నీకు చూపనా తెగిన గాయం తగదు అన్నా ఆగిపోదే మన కధా చివరి క్షణమే మధురకావ్యం ప్రేమకెపుడూ కదా
No comments
Post a Comment