చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు నటీనటులు: నాగేశ్వర రావు, వాణిశ్రీ, రామకృష్ణ , వెన్నిరాడై నిర్మల దర్శకత్వం: టి.లెనిన్ బాబు నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి విడుదల తేది: 09.06.1972
Songs List:
అందానికి అందానివై పాట సాహిత్యం
చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: దాశరథి గానం: బాలు, సుశీల పల్లవి: అందానికి అందానివై ఏనాటికి నా దానవై నా ముందర నిలచిన దానా... నా దానా.. అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై నా మదిలో మెదిలే రాజా... నా రాజా చరణం: 1 వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు వలపించావు వల వేశావు నను నీలోనే దాచేసావు మనసు సొగసు దోచావు మనసు సొగసు దోచావు మదిలో నన్నే నిలిపావు నిలిపావు అందానికి అందానివై ఏనాటికి నా దానవై నా ముందర నిలచిన దానా... నా దానా.. అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై నా మదిలో మెదిలే రాజా... నా రాజా చరణం: 2 నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి నీలాకాశం నీడలలోన నిర్మల ప్రేమ వెలగాలి వలపే విజయం పొందాలి వలపే విజయం పొందాలి మమతల మధువే కురవాలి కురవాలి అందానికి అందానివై ఏనాటికి నా దానవై నా ముందర నిలచిన దానా... నా దానా.. అనురాగమే నీ రూపమై కరుణించిన నా దైవమై నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా
చక్కాని చిన్నవాడే పాట సాహిత్యం
చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: సినారె గానం: సుశీల పల్లవి: చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే ఎవరో... తెలుసా గారాల బావ తెలుసా చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే చరణం: 1 ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. అత్తకొడుకని విన్నానే అయిన వాడనుకున్నానే ఓహో.. ఓహో..ఓ..ఓ.. ఓహో.. ఓహో..ఓ..ఓ.. వల్లమాలిన సిగ్గేసి తలుపు చాటున చూసానే ఏమి అందం ఏమి చందం ఏమి అందం ఏమి చందం.. గుండెల్లో రేగెను గుబగుబలేవో గుసగుసలేవో చక్కాని చిన్నవాడే హహహా చుక్కల్లో చందురూడే హహహా.. మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే ఎవరో... తెలుసా.. గారాల బావ తెలుసా చరణం: 2 హ..హ..హ...హ..ఊఁహుహూహు.. ఆ..ఆ..ఆ...ఆ..ఆహహా..ఆ.. ఆ..ఆ..ఆ...ఆ.. ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. ఆ..ఆ...ఆ...ఆ.. ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. ఆహాహాహా.. ఆహాహాహా.. ఆహాహాహా..ఆ..హా..ఆ..హా లల్లాలలా.. లల్లాలలా.. లల్లాలలా.. లాలలా.. మెల్లగా.. హాయ్ మెల మెల్లగా.. హాయ్.. హాయ్.. హాయ్.. హాయ్ మెల్లగా నను చూసాడే కళ్ళతో నవ్వేసాడే మెత్తగా నను తాకాడే కొత్త కోరికలు లేపాడే ఏమి వింత ఈ గిలిగింత ఏమి వింత ఈ గిలిగింత రెపరెపలాడే నా ఒళ్ళంతా ఏదో పులకింత చక్కాని చిన్నవాడే హహహా.. చుక్కల్లో చందురూడే హహహా.. మెరుపల్లే మెరిశాడే తొలకరి వానల్లే కురిశాడే ఎవరో... తెలుసా.. గారాల బావ తెలుసా
గంపా నెత్తిన పెట్టి పాట సాహిత్యం
చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: సినారె గానం: ఘంటసాల, సుశీల పల్లవి: గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాయ్ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం: 1 తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి.. ఆహా.. తలుపు చాటుగా నువ్వు తొంగి చూస్తివి నీ చిలిపి కళ్ళతో నన్ను లాగేస్తివి అదను చూసి నా చేయి పట్టుకుంటివి ఆనాటి నుంచి నా మదిలో.. అల్లరి పెడుతుంటివి గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా ఆఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం: 2 నీ కందీరగ నడుమేమో కదులుతున్నది దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది నీ కందీరగ నడుమేమో కదులుతున్నది దాని అందుకోను నా మనసే ఉరుకుతుఉన్నది నీ ఉంగారాల జుట్టేమో ఊగుతున్నది దాన్ని ఒక్కసారి నిమరాలని ఉబలాటం ఉన్నది హోయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా చరణం: 3 పైర గాలి నా చెవిలో ఊగుతూ ఉన్నది పైర గాలి నా చెవిలో ఊగుతున్నది నీ పడుచుదనం రుచి ఎంతో చూడమన్నది లగ్గమాడే రోజు దగ్గెరున్నది మనం లగ్గమాడే రోజు దగ్గెరున్నదీ... ఈ ఈ ఈ ... అందాకా ఈ తొందర ఎందుకులే అన్నది హాయ్.. గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లు మన్నాదే రంగమ్మా గుబులు గుబులు గున్నాదే రంగమ్మా హాఁ చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వొస్తుంటే చెంగు నిలవకున్నాదే బావయ్యా సిగ్గు మొగ్గ ఏస్తుందీ బావయ్యా.. హా...
మా చేను బంగారం పాట సాహిత్యం
చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల మా చేను బంగారం
మనసైన ఓ చినదాన పాట సాహిత్యం
చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: సినారె గానం: ఘంటసాల, రమోల పల్లవి: మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా - ఓహో.. మనసైన.. ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. అహహహహా.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. అహహహహా.. చరణం: 1 నా గుండెలోన అందమైన గూడు ఉన్నది ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది - ఆహ.. నా గుండెలోన అందమైన గూడు ఉన్నది ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది ఆ చోట ఉంటావా - ఆ.. నా మాట వింటావా - ఊఁహూఁ.. ఆ చోట ఉంటావా - ఆ.. నా మాట వింటావా..ఆ..ఆ.. నా మాట వింటావా.. గుణపాఠం తీర్చుకుంటావా మనసైన.. ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. అహహహహా.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. అహహహహా.. చరణం: 2 మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది ఆ పానుపు అడిగింది - ఊఁ.. నీ రాణి ఎవరంది - ఓహో.. ఆ పానుపు అడిగింది నీ రాణి ఎవరంది మన కోసం చూస్తూ ఉంది మనసైన.. ఓహ్ చినదాన.. ఒక మాటుంది వింటావా ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. అహహహహా.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.. అహహహహా.. చరణం: 3 నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి - ఊఁ.. నీ నవ్వులే ఈ తోట నిండా కమ్ముకున్నాయి నీ పొంగులే నా గుండెలో ఉప్పొంగుతున్నాయి కొంచెం చూడనిస్తావా - నో..నో.. పోని తాకనిస్తావా - ఆహ.. కొంచెం చూడనిస్తావా..ఆ..ఆ.. పోని తాకనిస్తావా నను నీతో చేర్చుకుంటావా..ఆ.. మనసైన.. ఓహ్ చినదాన ఒక మాటుంది వింటావా ఆ.. సిగ్గుపడే.. ఓహ్ చిలకమ్మా కంది చేనుంది పోదామా
పిల్లోయ్ జాగర్త పాట సాహిత్యం
చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: సినారె గానం: ఘంటసాల, సుశీల పల్లవి: పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త మళ్ళీ మళ్ళీ పేలితే.. చెవులు పిండి చేతికిస్తా పిల్లోడోయ్ జాగర్త. ఒళ్ళుపొగరా ? జాగర్త పిల్లంటె పిల్లకాదు పిడుగురోయ్ జాగర్త జాగర్త జాగర్త పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త చరణం: 1 ఆడదిలే అని వొదిలేస్తుంటే అడ్డు తగులుతున్నావా? నా దెబ్బ చూపమంటావా ? ఆడదిలే అని వొదిలేస్తుంటే అడ్డు తగులుతున్నావా? నా దెబ్బ చూపమంటావా ? పాపం పోనీ పసివాడంటే పైకి పైకి వస్తావా ? ఒక పట్టు పట్టమంటావా ? నా గట్టు కెందుకొచ్చావ్ - నిన్ను చూసి పోదామని అంత బాగున్నానా ? - అయ్యో చెప్పాలా? హనుమంతుడి తమ్ముడు అడ్డం దిడ్డం మటలంటే హద్దుపద్దు మీరుతుంటే గడ్డిమొపులా నిన్నే కట్టేస్తా మోసేస్తా పిల్లోయ్ జాగర్త ఒళ్ళు కాస్తా జాగర్త పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త మళ్ళీ మళ్ళీ పేలితే చెవులు పిండి చేతికిస్తా పిల్లోడోయ్ జాగర్త ఒళ్ళుపొగరా? జాగర్త పిల్లంటె పిల్లకాదు పిడుగురోయ్ జాగర్త జాగర్త జాగర్త పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త చరణం: 2 కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా కాలుదువ్వుతున్నావా? ముక్కు తాడు వెయ్యమన్నావా? కొమ్ములు మొలిచిన కోడెగిత్తలా కాలుదువ్వుతున్నావా? ముక్కు తాడు వెయ్యమన్నావా? కూతకొచ్చిన కోడిపెట్టలా ఎగిరి కేరుతున్నావే ఏ పుంజు కోసమున్నావే నువు పుంజువ అయితే మరి నేను పెట్టనేంటి అబ్బో పెద్ద మొగాడివి అప్పుడే ఏం చూశావ్ ఇక ముందు చూడు సూటిపోటి మాటలంటె గోటుగాడవనుకుంటే మేకపిల్లలా నిన్నే పట్టేస్తా ఎత్తేస్తా పిల్లోడోయ్ జాగర్త ఒళ్ళుపొగరా? జాగర్త పిల్లంటె పిల్లకాదు పిడుగురోయ్ జాగర్త జాగర్త జాగర్త పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త పిల్లోయ్ జాగర్త ఒళ్ళుకాస్తా జాగర్త మళ్ళీ మళ్ళీ పేలితే చెవులు పిండి చేతికిస్తా పిల్లోడోయ్ జాగర్త, పిల్లోయ్ జాగర్త, పిల్లోడోయ్ జాగర్త పిల్లోయ్ జాగర్త
గౌరమ్మ తల్లికి పాట సాహిత్యం
చిత్రం: దత్త పుత్రుడు (1972) సంగీతం: టి. చలపతిరావు సాహిత్యం: సినారె గానం: ఘంటసాల, సుశీల గౌరమ్మ తల్లికి
No comments
Post a Comment