చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి దర్శకత్వం: ఐ.యన్.మూర్తి నిర్మాత: చిలంకుర్తి విజయ సారధి విడుదల తేది: 11.01.1963
Songs List:
నా మనసంతా తీసుకో పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆరుద్ర గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) నా మనసంతా తీసుకో ఏమైనా నువు చేసుకో రంగేళివై శృంగారములో రాతిరి కలలో కలుసుకో కనులతో మాటాడే జాణ నా కొనచూపులే కోటిసరసాల నజరాన తీయని కాసుక తీసుకువస్తే ఎందుకు నీకు నిరాదరణ ! నవనవలాడే నా వయసంతా చేశా నీకు బహూకరణ మనసుగలవాడె నిజమైన మనిషి! మమత ఫలియించుకే దిల్ రుషీ ! కమ్మని సొగసు కోరిన వలపు కలిగించునులే కైపు! నీవూ నేనూ, ఒకటువుతాము నేడు కాదేని రేపు
ముందు చూపుగా నే పోతుంటే పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: ఎల్.ఆర్.ఈశ్వరి ముందు చూపుగా నే బోతుంట - హూమ్ ముందు చూపుగా నే బోతుంట వెనక ఊపుగా సురొస్తుంటే! అందరు గుసగుస లాడికిరో సైరా నా రాజా ! కిల కిల నవ్వుల్ జూచి - నీ నడకల్ జూచీ నీళ్ళ రేవుకడ పొంచుకేసుకొని నిలుచున్నావుగా హుషారుతోటీ పచారుచేస్తూ ఉలికించావురా మెల్లమెల్లగా కనుసైగలో కవ్వించావురా తోచనివాళ్ళు ఎన్నో నిందలు వేశారురా వెనకవాలుగా కళ్లుమూసి నను తెరిపించావురా వెన్నెలలో సయ్యాటలాడి -బల్ వేధించావురా తోడుతోడుగా జోడుగ షికారు రమ్మన్నావురా పాడులోకమూ ఎందుకో ఓర్వలేదాయరా అదేపనిగ నన్నల్లరి పెడితే ఫలితం లేదుర బావ అదాటుగా మన మనసులు కలిసిన అందం ఉన్నది హాయిహాయిగా ఇద్దరి స్నేహం అల్లుకొనాలిరా చేయీచేయీ గలిపితే లోకులు సిగ్గుపడా లేరా
జిగి జిగేలుమని పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆరుద్ర గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి జిగి జిగేలుమని మన దొరసాని సొగసెవ్వరికొరకోగాని వారెవా జోరు హై పొరుగింటి పుల్లయ్యకోసం ఈరోజున వేసితి వేషం. వారెవా జోరు హై ఇరిగింటెల్లమ్మలు ఇంతేలే పంతానికి కవ్వింతురులే అనగూడదులే - మన కెందుకులే మాటంటే చిటపట మందురులే వారెవా జోరు హై మగవారి ప్రతాపం తెలుసు మా ఆడవారనిన అలుసు ఇకిలింతురులే- సకిలింతురులే తమ బడాయి జూపింతురులే వారెవా జోరుహై ఎంతయినా మేము మొగాళ్ళ మా మూతిని ఉన్నది మీసం జగమిటులైనా యుగమటులైనా చెల్లునులే మా అధికారం వారెవా జోరు హై
మబ్బుల చాటున పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆరుద్ర గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) మబ్బులచాటున చంద్రునిలా పొదమాటున దాగిన చినవాడా ఎందుకు విందుకురావు మన సెందుకు తీసుకోవు ప్రేమించినవారికి భయమేల మగవారికి ఇంతటి సిగ్గేల ఎడబాయనిది కడుతీయనిది మన ప్రేమను తెలుపగ రావేల నీ హృదయములోని కోరికలు నా జన్మదినానికి కానుకలు వసివాడనివి - కుసుమించినవి నా కురులన విరిసిన మాలికలు
కవ్వించేవే కవ్వించేవే పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత కవ్వించేవే - కవ్వించేవే కలువ రేకుల కన్నుల ధాన కవ్విస్తే జవ్వనమంతా గంతేయునె చినదాన నవ్వించేవు నవ్వించేవు కొంటె నడకల కులాసకాడ నవ్విస్తే నాజూకంతా నలిగినో వన్నెకాడ చక్కని నీ రూపు ! ఒలికించు ఓరచూపు వన్నెల చిల్కు - వయ్యార మెలుకు కాదని యనబోకు వాదమాడబోకు ఎంతటి నగుబాటు - ఎవరైన విన్నలోటు వలపుమాటలు - చిలిపి చేష్టలు అతియైతే చేటు - తగదీ అలవాటు నీ వాడనుకాదా - నామీద ప్రేమలేదా కమ్మని రేయి - గుమ్మయిపోయి కలుపు చేయి చేయీ కానరాని హాయి సరసాలు దాచి పెట్టు తెలుసును నీ గుట్టు ఈ విరహాలు ఈ సరదాలు ఇప్పటికి ఉన్నదింక రేపు
సన్నజాజి చెలిమి కోరి పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆరుద్ర గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి సన్నజాజి చెలిమికోరి - చల్లగాలి వీచెను ఆ చల్లగాలి సోకగానె - జాజిమనసు పూచెను పడుచుదనము, గడుసుదనము - పరిమెళాలు చిందెనే ఆ పరిమెళాల సుమదళాలు పరవషమేచెందెనే ఒకరినొకరు చేరగానె - ఊహలు చెల రేగెనే ఆ ఊహల ఉయ్యాలపైన హృదయాలె ఊగెనే ఆకసాన మెరుపుతీగె - అరనిముషము వెలుగునే నా కనులలోన కాంతివగుచు కలకాలము వెలుగుమా
తోటకు వచ్చిందొక చెలియా పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: పి. బి. శ్రీనివాస్, జిక్కి (పి.జి. కృష్ణవేణి) తోటకు వచ్చిందొక చెలియ - దాని దోరవయసుపై పువ్వులు కోసిందొక చిలుక నా మనసు దాని నవ్వుముఖముపై నా మనసు చెట్టుననెక్కే డొకకోతి - వాడి చిలిపి చేష్ట పై నా మనసు కొమ్మల నెక్కే డొకకోతి - వాడి కోరమీసంపై నా మనసు ... .... .... (రాగం) రావిచెట్టెక్కేవు - రాగాలు తీశావు రాలిపోతవు రాలుగాయో - ఎంకయ్య కూలిపోతవు రామ రామ చిరునవ్వు నవ్వుతో - చేయివేస్తే చాలు చింతలన్నీ మాయమౌతాయె చంద్రమ్మ వంతలన్నీ మాయమైనాయె ఒక్క మనసూతోన - చక్కగా మనముం పైన సుక్కలు నవ్వుకోవా - ఎంకయ్య కింద సుక్కలు నడిసిరావా మాలోణ్ణి పెళ్లాడ మరియాద పోతాది మనవు మాటలు ఎత్తరాదె - చంద్రమ్మ మారుమాటలు ఆడబోకె మంచి మనసైతేను – మాలోడి మాటేల కుల మెన్నుకో లేదురో – ఎంకయ్య గుణమునే చూశానురో నీవు నేనూ కలిసి - నీటిలోపల కరిగి ఏక మైపోదాములే - స్వర్గాన ఇంపుగా ఉందాములే! ఎటుచూచిన కురిసే - కన్నీ రే వికసించిన కలలే - శిలలాయె నిర్భాగ్యము నీడగ వెంటాడె నిట్టూర్పులు మదిలో బరువాయె కని పెంచిన హృదయము ఎడబాసి కనుపించని బాధలు చెరువాయె తోబుట్టినవాడు కనరాడె మా త్రోవలు చీలెను - చిననాడె కరుణించినవారికి శాపమునై కడుచల్లని తల్లిని బాసితినే ఈ లోకము కరుణామయమైనా నా దోసిటనిండెను వేదనలే ప్రేమించిన మదిలో – గాయాలా పరమాత్మకు వేడుక కాబోలు
నృత్య రూపకం పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: పి. బి. శ్రీనివాస్, యస్. జానకి నృత్య రూపకం
ఎటు చూసినా పాట సాహిత్యం
చిత్రం: ఇరుగు పొరుగు (1963) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: ఆరుద్ర గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) ఎటు చూసినా
No comments
Post a Comment