చిత్రం: కలవారి కోడలు (1964) సంగీతం: టి.చలపతిరావు నటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి నిర్మాత, దర్శకత్వం: కె.హేమాంబరధర రావు విడుదల తేది: 14.03.1964
Songs List:
మంచి మనసు పాట సాహిత్యం
చిత్రం: భాగ్య చక్రము (1964) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: నార్ల చిరంజీవి గానం: యస్. జానకి మంచిమనసు తెలిపేదే స్నేహము, మనిషి విలువ నిలిపేదే స్నేహము మనసు మనసు కట్టుకున్న, మరుమల్లెల వంతెనయే స్నేహము మనిషిలోని మంచికే మారుపేరు స్నేహము ఆపదలో ఆదుకొనీ ఆనందము పంచునులే స్నేహము కలిమిలేమి అంతరాలు కానబోదు స్నేహము, స్నేహమే, స్నేహము మల్లెకన్న తెల్లని, జాబిల్లికన్న చల్లని తేనెకన్న తీయని, ఏనాటికైన మాయనిదీ స్నేహము
ఎందుకే ఎందుకే పాట సాహిత్యం
చిత్రం: కలవారి కోడలు (1964) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల, సరస్వతి ఎందుకే ఎందుకే ఎందుకే ఎందుకే పొంగి పొంగి లేతవయసు ఛెంగుమన్న దెందుకే కదిలే పిల్లగాలి కైపు రేపు నెందుకో మల్లెల పరిమళాలు వత్తుగొలుపు నెందుకే ఎందుకా ? ఊఁ ఎందుకో తెలుపనా ? ఇపుడే తెలుపనా ? ఎదలో పడుచుదనం ఎదిగిపోయినందుకే తెలిసెనా, తెలిసెనా, ఎందుకో తెలిసెనా ? కమ్మని నిదురలో కలవరింత లెందుకే, మెత్తని పాన్పుపై మేను నిలువదెందుకే ? ఎందుకా ? ఎందుకో తెలుపనా ? ఇపుడే తెలుపనా ? చక్కని ఊహలకే రెక్కలొచ్చినందుకే తెలిసెనా, తెలిసెనా, ఎందుకో తెలిసెనా ? ఎన్నడు లేనిరీతి కన్నులదురు నెందుకే వెన్నెలవానలోన వేడి కలుగునెందుకే ? ఎందుకా? ఎందుకో తెలుపనా ? ఇప్పుడే తెలుపనా ? మనసే మెఱుపువోలె చెణుకులొలికి నందుకే తెలిసెనా ? తెలిసెనా ? ఎందుకో తెలిసెనా ?
దొంగ చూపులు పాట సాహిత్యం
చిత్రం: కలవారి కోడలు (1964) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, జిక్కి (పి.జి. కృష్ణవేణి) దొంగ చూపులు చూచి, దోరవయసు దోచి కొత్తవలపులు చిలికితివా, మత్తుకనులా చినదానా దొంగచూపులు చూచి, దొరవయసు దోచి మత్తుమందు చిలికితివా. మనసుపడినా చినవాడా ముచ్ఛటైన కురులుదువ్వి, మొగలిరేకుల జడను వేసి మోజుతీర ముస్తాబు చేసి, మోమాటపడ నేల ఓ చిన్నదానా కోరమీసాల మెలేసి, కోటిసరసాల వలేసి చిలిపిసైగల పిలిచావు కానీ చెప్పేటి కబురేమి ఓ చిన్నవాడా హంసలాగ నడచిరాగా అందమంతా పొంగిపోగా కోయిలల్లే గొంతెత్తిపాడ, గుండెల్లొ గిలిగింతలయ్యేను పిల్లా పూలతావుల చేరదీసి, గాలితీగల ఓడగట్టి మబ్బుదారుల కేరింతలాడీ మైమరచిపోదాము ఓ చిన్నవాడా
భలేగా నవ్వితివి పాట సాహిత్యం
చిత్రం: కలవారి కోడలు (1964) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల బలేగా నవ్వితివి, ఎలాగో చూచితివి, చెలాకీ చూపితివి మత్తుగా, మెత్తగా మనసు దువ్వితివి మధువును చిలికే నీ చూపే, మరలెను మెల్లగ నా వైపే బంగరు వలపులు, రంగుల తలుపులు తొంగి తొంగి చూచే గాలికి నీ కురులూగినవి, నాలో వూహలు రేగినవీ ఱువ్వున నీ నడుమాడినదీ, ఝుమ్మని నామది పాడినదీ గువ్వల పోలిక కోరికలేవో కువ కువ లాడినవీ కన్నుల బాసలు విన్నాను, ఎన్నడో నిను కనుగొన్నాను అందము నాదనుకున్నాను, అందుకె నిను రమ్మన్నాను డెందములోపల ఎందుకొ తీరని తొందర కలిగేనూ
ఏమిటో ఈ విపరీతం పాట సాహిత్యం
చిత్రం: కలవారి కోడలు (1964) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల ఏమిటో యీ విపరీతం, విధి కెందుకు నా పై కోపం తలచేడొకటి జరిగే దొకటి, ఎవరికి ఎవరో ఏమొ ఆశించుటయే నేరమో ఏమో వెతలే మిగిలిన వేమో ప్రేమగాధలే విషాద కధలా, లోకముతీరు ఇదియేనా చిరునగవునకూ చోటే లేదా ? చివరకు ఫలితమిదేనా జీవితమా యిది కలయా, నిజమా, చెదరని చీకటి మయమా ఆరని వెలుగుల ఆశాజ్యోతిని, ఏనాటికైనా కనలేమా
విరిసిన పూవును పాట సాహిత్యం
చిత్రం: కలవారి కోడలు (1964) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల విరిసిన పూవునునేనూ, వెన్నెలతీవనునేనూ మిసమిసలాడే పసిడి యౌవనపు విసురుసైపలేను ఇన్ని దినాలుగ ఎదలో దాగిన, కమ్మని ఊహలు కనవేలా మౌనముగా నామదిలో సాగిన మంజులగానము వినవేలా తొలకరి వలపుల చెలినే కాదని కలలూ కలతలూ నీకేలా వెన్నెలపందిరి వెచ్చని కౌగలి రమ్మని పిలువగ రావేలా
నీ సొగసే పాట సాహిత్యం
చిత్రం: కలవారి కోడలు (1964) సంగీతం: టి.చలపతిరావు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు నీ సొగసే లాగుతున్నది, నిను చూస్తూవుంటే నా మనసే వూగుతున్నదీ ఓ వలపుల జిలిబిలి వయారి హంసా, నీ సొగసే లాగుతున్నదీ నీ నడకజూడ నడకందముజూడ, నడకకుతగ్గ నాధుడు ఎవరే? నాకన్నా నాధుడు ఎవరే ? ఓ వలపుల జిలిబిలి వయారి హంసా నా వరాల హంసా నీ సొగసే లాగుతున్నదీ కాశీపట్నం చూపిస్తా, గంగాస్నానం చేయిస్తా గోవిందా, గోవిందా, కొంగుపట్టుకుని గోవిందాయని ఏడుకొండలూ ఎక్కేస్తా, చంద్రమండలు చెక్కేస్తా కొండలు పిండిగ కొడతానే, ఆ పిండితో మేడలు కడతానే మేడలో నిన్ను కూర్చో బెట్టి, ఊయలగట్టి ఊగిస్తానే ఉయ్యాలో, జంపాలో నీకోసం నే పాడతా, నీకంటే బాగా పాడతా మరి చెప్పలేదేం ? ఇప్పుడు చెప్పానుగా ! సానిస దనిపా మసగా మాపాదనిసా దనిసరి సనిదపగని సానీసా, దనిసరి, ససనిప, పమగరి, సనిపమ, మమగగ దిదినని సానిసా మామా, మా మామా - మా మామ నూటికి సర్దార్ అత్తా మా అత్తా - మా అత్తంటేనే కబడ్డార్ ఇక కట్టి పెట్టవోయ్ నీ జోరూ ఇక మూసి పెట్టవోయ్ నీ నోరూ. డో. చి. వి. వి. మో.
No comments
Post a Comment