చిత్రం: మంచి మనుషులు (1974) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: శోభన్ బాబు, మంజుల నిర్మాత, దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 01.10.1974
Songs List:
నీవు లేని నేను లేను పాట సాహిత్యం
చిత్రం: మంచి మనుషులు (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ… ఆహా హా ఆహా హా ఆహా హా నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు తీగల్లో నువ్వూ నేనే అల్లుకునేదీ పువ్వుల్లో నువ్వు నేనే మురిసి విరిసేదీ (2) తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ తేనెకు మన ముద్దేలే తీపిని ఇచ్చేదీ, తీపిని ఇచ్చేదీ నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరమూ జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు కొండల్లే నువ్వున్నావు నాకు అండగా మంచల్లే నువ్వున్నావూ నాకు నిండుగా, ..(2) ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా నిన్నా నేడు రేపే లేని ప్రేమ జంటగా, ఆ ఆ ప్రేమ జంటగా…ఆ ఆ నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు ఆహా హా ఆహా హా ఆహా హా
నిన్ను మరచి పోవాలని పాట సాహిత్యం
చిత్రం : మంచి మనుషులు సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం : బాలసుబ్రహ్మణ్యం నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసు రాక మానుకున్నా (2) నువ్వు విడిచి వెళ్ళినా నీ రూపు చెరిగిపోలేదూ నువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ (2) తలుపు తెరిచి ఉంచుకొనీ తలవాకిట నిలిచున్నా వలపు నెమరేసుకుంటూ నీ తలపులలో బ్రతికున్నా నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసు రాక మానుకున్నా (2) ఎందుకిలా చేశావో నీకైనా తెలుసా నేనెందుకింకా ఉన్నానో నాకేమో తెలియదూ (2) నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే నిన్ను చేరు వరకు నా కళ్ళు మూతపడవులే నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసు రాక మానుకున్నా (2) గుండెలోన చేశావూ ఆరిపోని గాయాన్నీ మందుగా ఇచ్చావు మన వలపు పంట పసివాణ్ణీ (2) ఆ లేత మనసు తల్లికోసం తల్లడిల్లుతున్నదీ నీ తల్లి మనసు తెలియకనే దగ్గరవుతూవున్నదీ నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసు రాక మానుకున్నా (2)
పడకు పడకు వెంట పడకు పాట సాహిత్యం
చిత్రం: మంచి మనుషులు సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల పల్లవి: పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు పోపోరా... చినవాడా... పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు పోపోరా... చినవాడా... పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే... చినదానా.... పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే... చినదానా.... చరణం: 1 లైలా... మజ్ఞూ....మంజూ.... మేలిముసుగులో పైడిబొమ్మలా మిసమిసలాడే లైలా నీ సొగసుకు సలాము చేస్తున్న నీ సొగసుకు సలాము చేస్తున్నా సొగసును మించిన మగసిరితో నా మనసును దోచిన మజ్ఞూ నీ మమతకు గులామునవుతున్న నీ మమతకు గులామునవుతున్న పెళ్ళికూతురై.....వెళ్ళుతున్నావా... మన ప్రేమను ఎడారి చేశావా, మన ప్రేమను ఎడారి చేశావా పెళ్ళి తనవుకే....చేశారూ.... మన ప్రేమ మనసుకే వదిలారూ, మన ప్రేమ మనసుకే వదిలారూ లైలా.... పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా... చినవాడా... ఏహే.....పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే... చినదానా.... చరణం: 2 అనార్.... సలీం.. గులాబి పూలతోటలో.... ఖవ్వాలి తీపిపాటలో గులాబి పూలతోటలో ఖవ్వాలి తీపిపాటలు సలీము లేత గుండెకు షరాబు మత్తు చూపినా.... అనార్కలీవి నువ్వు అనార్కలీవి నువ్వు ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ మొఘల్ సింహాసనానికి.. ఆ.... కసాయి శాసనానికి మొఘల్ సింహాసనానికి.. కసాయి శాసనానికి సవాల్‌గా జవాబుగా గరీభ్నేవరించినా... జహాపనావు నువ్వు జహాపనావు నువ్వు సలీం....సలీం....సలీం.... అనార్........ పవిత్ర ప్రేమకు సమాధి లేదులే... చరిత్ర మొత్తమే విషాధగాథలే... విషాధగాథలే... పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు పోపోరా... చినవాడా... ఏహే....పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు పోలేనే... చినదానా... పోపోరా... చినవాడా... ఏహే.... పోలేనే... చినదానా.... పోపోరా... చినవాడా...
పెళ్ళయింది ప్రేమవిందుకు పాట సాహిత్యం
చిత్రం: మంచి మనుషులు (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: బాలు, సుశీల పల్లవి: పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది వయసు ఉరికింది సొగసు బెదిరింది పెదవి అదిరింది పంటానొక్కింది పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది వయసు ఉరికింది సొగసు బెదిరింది పెదవి అదిరింది పంటానొక్కింది పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది చరణం: 1 కమ్మని కల వచ్చింది ఆ కలకొక రూపొచ్చింది కమ్మని కల వచ్చింది ఆ కలకొక రూపొచ్చింది జరిగినది గురుతొచ్చింది ఇక జరిగేది ఎదురొచ్చింది జరిగినది గురుతొచ్చింది ఇక జరిగేది ఎదురొచ్చింది కళ్ళకు జత కుదిరింది కతలెన్నో చెబుతుంది పెదవి మీద రాసుంది చదివి చెప్పమన్నది పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది చరణం: 2 కుర్రతనం కొత్త రుచులు కోరింది రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది కుర్రతనం కొత్త రుచులు కోరింది రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది గడుసుతనం కొసరిస్తా.. అసలు ఇవ్వనన్నది ప్రతి రోజు కొసరిస్తే అసలు మించిపోతుంది పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది చరణం: 3 ఎప్పుడో నన్నిచ్చాను ఇంకిప్పుడేమి ఇస్తాను ఇన్నాళ్ళు ఇవ్వనివి మిగిలి ఎన్నెన్నో ఉన్నవి ఎప్పుడో నన్నిచ్చాను ఇంకిప్పుడేమి ఇస్తాను ఇన్నాళ్ళు ఇవ్వనివి మిగిలి ఎన్నెన్నో ఉన్నవి ఇపుడే తెలిసింది ఎప్పుడేప్పుడని ఉంది మూడుముళ్ళు వేసినది ఏడడుగులు నడిచినది అందుకే... ఆ విందుకే... అహహా... అహహా... అహహా... ఆ... ఆ... పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది వయసు ఉరికింది సొగసు బెదిరింది పెదవి అదిరింది పంటానొక్కింది పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది ప్రేమవిందుకు వేళయింది ప్రేమవిందుకు వేళయింది
విను నా మాట విన్నవంటే పాట సాహిత్యం
చిత్రం: మంచి మనుషులు (1974) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల పల్లవి: విను నా మాట.. విన్నావంటే... జీవితమంతా....ఆ పూవ్వుల బాట... విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట చరణం: 1 ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు కష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ కంటికి వెలుగూ ఇంటికి వెలుగూ ఆరని జ్యోతి నువ్వే నువ్వే విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట చరణం: 2 బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ ఆటలు హాయిగ ఆడాలి చదువులు పెద్దవి చదవాలీ ఇంటికి పేరూ, ఊరికి పేరూ, తెచ్చేవాడివి నువ్వే నువ్వే విను నా మాట విన్నావంటే జీవితమంతా పూవ్వుల బాట చరణం: 3 తల్లీతండ్రి ఒకరైనా దైవసమానం తల్లి సుమా తల్లీతండ్రి ఒకరైనా దైవసమానం తల్లి సుమా దీవిస్తుంది నీ అమ్మ దేవునిలాగే కనపడక చల్లని మనసూ, తీయని మమత, చక్కని బ్రతుకూ నీదే నీదే ఇది నీమాట... విన్నానంటే... జీవితమంతా... పూవ్వుల బాటా ఇది నీమాట విన్నానంటే జీవితమంతా పూవ్వుల బాటా
నీవు లేని నేను లేను (Sad Version) పాట సాహిత్యం
చిత్రం: మంచి మనుషులు (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు (2) అందరిలా నాకు ఒక అమ్మ ఉందనుకున్నాను ఏది నాన్న అమ్మ ఏదని ఎన్నోసార్లడిగాను (2) నిన్ను సరే చూడలేదు రూపైనా చూడలేదు నువ్వుంటే రాకుంటావా నన్ను చూడకుంటావా నన్ను చూడకుంటావా... నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు కొమ్మలేక ఎక్కడైనా పిందె పెరుగుతుందా కాడలీక ఏనాడైనా పువ్వు నిలిచి ఉంటుందా సృష్టి లోన జరగని వింత మనిషి చేతనౌతుందా బిడ్డలెరుగని తల్లికైనా పేగు కదలకుంటుందా ప్రేమ య్తేలియకుంటుందా నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు కొండల్లే నేనున్నాను గుండె పగలక మంచల్లె నువ్వెల్లావు వలపు తెలియక (2) ఎన్ని జన్మలో అనుకున్నాము ఈ కలయిక నిన్న నేడే మాచిపొతే రేపులేదిక రేపులేదిక నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు
హరిలో రంగ హరి పాట సాహిత్యం
చిత్రం: మంచి మనుషులు (1974) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల పల్లవి: శ్రీమద్రమారమణ గోవిందో...హరి హరిలో రంగ హరీ... అమ్మాయి గారి పని హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలో రంగ హరీ... అమ్మాయి గారి పని హరి శ్రీమద్రమారమణ గోవిందో...హరి హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి చరణం: 1 చల్లగాలి తగిలిందంటే పిల్లదానికి రెపరెపలు (2) పిల్ల గాలి సోకిందంటే కుర్రవాడికి గుబగుబలు (2) గుబులు రేగిన కుర్రవాడు కూడ కూడ వస్తానంటే గూబ మీద చెయ్యి ఒకటి గుయ్యీమంటూ మోగిందంటే హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలో రంగ హరీ... అమ్మాయిగారి పని హరి చరణం: 2 వెంటపడిన కొంటే వాణ్ణి ఇంటిదాక రానిచ్చి తోడు వచ్చిన దొరబిడ్డా పోయి రమ్మని తలుపే మూస్తే హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి తలుపు మూసిన తలుపుల్లోన తరుముకొస్తూ వాడేవుంటే (2) తెల్లవార్లూ కలలోకొచ్చి అల్లరల్లరి చేశాడంటే హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి చరణం: 3 దోర వయసు జోరులోన కన్నుమిన్ను కానరాక జారిజారి కాలు జారి గడుసువాడి వడిలో పడితే హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి మనసు జారి పోతేగాని కాలు జారదు కన్నెపిల్ల (2) గడసువాడది తెలుసుకోక వడిని పట్టి లొట్టలేస్తే హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలో రంగ హరీ... అమ్మాయి గారి పని హరి హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి (3) హరి హరి హరి హరి హరి హరి హరి హరి
విను నా మాట (Sad Version) పాట సాహిత్యం
చిత్రం: మంచి మనుషులు సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: బాలసుబ్రహ్మణ్యం పల్లవి: విను నా మాట.. విను నా మాట విన్నావంటే... విన్నావంటే జీవితమంతా.... జీవితమంతా పూవ్వుల బాట...పూవ్వుల బాట ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు కష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ కంటికి వెలుగూ.. కంటికి వెలుగూ ఇంటికి వెలుగూ.. ఇంటికి వెలుగూ ఆరని జ్యోతి నువ్వే నువ్వే... నువ్వే నువ్వే..
No comments
Post a Comment