Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kanchu Kota (1967)




చిత్రం: కంచుకోటం (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, దేవిక 
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: యు.విశ్వేశ్వర రావు 
విడుదల తేది: 22.03.1967



Songs List:



ఉలికి ఉలికి పడుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల

ఉలికులికి పడుతుంది
గిలిగింత పెడుతుంది
ఎందుకో ఏమో నామనసు
ఏ సంగతి నాకేమి తెలుసు
ఇన్నాళ్ళ వలెకాదు ఎట్లాగొ అవుతుంది
చన్నీళ్ళ తాకిడికే ఒళ్ళు జిల్లు మంటుంది
చేపల్లే తాకెనో చూపులే సోకెనో
చెప్పలేనయ్యయ్యో సిగ్గుముంచు కొస్తుంది.....
నీటిలో అలలేమొ నిలిచి పొమ్మన్నాయి
తోటలో పూలేమొ లేచిరమ్మన్నాయి
నీటిలో నిలవనా తోటనే పిలవనా
ఉన్నపాటున లేస్తె ఊరంతనవుతుంది....





సిగ్గెందుకే చెలి పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్రిపురనేని మహరధి 
గానం: పి.సుశీల, ఎస్.జానకి

సిగ్గెందుకే చెలీ సిగ్గెందుకే
అందాలకే నువ్వు అందానివీ
సిగ్గెందుకే భామ సిగ్గెందుకే.....

సిగ్గులేని కొమ్మ పూలులేని రెమ్మ
సిగ్గులోని సిరులు పాలమీది తరగ
సిగ్గందమే  స్త్రీకి సిగ్గందమే 
రంభైన అతిలోక చతియైన
సిగ్గందమే స్త్రీకి సిగ్గందమే ....
నీరాజు నినుచేరి సరసాలు సాగించ
సిగ్గేమి చేతువే ఏ చోటు దాతువే
విరిసే పెదవులలో మురిసే హృదయములో
దాచుకొందునె సిగ్గు దోచుకొందునే మనసు....
మనసులోని మమత మనసులోనే దాచ
మనసెట్లు తీరునే మనువెట్లు సాగునే
మనసైన నారాజు మనసార నన్నేల
మమతలు తీరునులే మనువే సాగునులే....




లేదు లేదని పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 1
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

చరణం: 2
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కలలోకొచ్చి కబురులు చెప్పే.. జతగాడైనా లేడు.. జతగాడైనా లేడు
ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం: 3
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
మొగలి రేకుల సొగసు ఉంది.. మొన కన్నులలో పదును ఉంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
అద్దంలో నా అందం చూస్తే.. నిద్దర రానే రాదు.. నిద్దర రానే రాదు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దొస్తావు




ఈ పుట్టిన రోజు పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల

పల్లవి:
ఈ పుట్టినరోజు నీ నోముల పండిన రోజు
దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు

చరణం: 1
తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ (2)
మీలో విరిసే లేత వెలుగులు మా చెలి కన్నుల నింపండి
ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలీ

చరణం: 2
అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా (2)
మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా
ఆ వయ్యారం చూసి చూసి ఆమె ప్రియుడు మురియాలి

చరణం: 3
పురివిప్పి నటియించు నీలాల నెమలి (2)
మీలోని హొయలంత చెలికియ్యరాదా
అందాల చెలి నాట్యమాడేటి వేళ
చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు... ఆ...




ఈడొచ్చిన పిల్లను పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి 

ఈడొచ్చిన పిల్లనోయ్ హొయ్ హొయ్
నిన్ను ఆడించే పిల్లనోయ్ సై సై

నువ్వేసే సుక్కకన్న ఎచ్చనైన దాననోయ్
కవ్విస్తే కరగేదాకా కదలనోయ్ హాయ్ హాయ్
కండలున్న మావయ్యకు గుండేలేదట
గుండెలున్న బావయ్యకు గుణమే లేదట
కండలున్నా గుండెలున్నా కన్నెపిల్ల రమ్మంటే
కత్తిలాంటి మగరాయుడు మెత్తనౌనట....
ఇంపుచూసి నా సొంపుచూసి నువు యీల వేయకోయ్
సెంపమీద అబ్బ నొక్కి నొక్కి నువు చిటికె ఏయకోయ్
పట్టుపట్టీ పంతగించి పైట లాగకోయ్
నా పైట లాగితే మనసు పట్టజాలనోయ్....



భం భం భం పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, జమునా రాణి 

భం భం భం భం పట పట పట పట భజగోవిందం
ఏమిటో యీ అనుబంధం
ఎందుకో ఈ ఆనందం....
జం జం జం జం బలె బలె బలె బలె చిటపట బంగారం.
ఏనాటిదో యీ అనుబంధం
చూడవే బ్రహ్మానందం....

అయ్యను మోసంచేశావు
బావయ్యను మడుగులో దోశాపూ
అమ్మ బాబో నిను నమ్మినందుకు
నట్టనడేటను ముంచేస్తావూ....
సందేహంలో పడతావేలా ఏల
అందరిలా నన్ననకే బాల
పూలలోన నీవోలలాడగా
జోల పాడెదనె యిలా యిలా
జోజోజో జోజో జో....
ప్రేమ ఒలక బోస్తున్నావా
నాటకాలు వేస్తున్నావా
అసలు సంగతి బైటికి వస్తే
అయ్యా అపుడేమౌతావూ
ఏమౌతానా? విను 
ఇంటికి అల్లుడనౌతానే నీకు
ఎదురుగానె కూర్చుంటానే
మళ్ళీ మళ్ళీ మాట్లాడావా
భజన చేస్తు కూర్చుంటానే - రామ
భజన చేస్తు కూర్చుంటానే

హరి హరీలరంగ హరి
వైకుంఠవాస హరి
మనయిద్దరికి సరి
మాటాడబోకు మరి
శ్రీమద్రమారమణ గోవిందో హరి 



సరిలేరు నీకెవ్వరూ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, ఎస్.జానకి

పల్లవి:
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సురవైభవాన భాసుర కీర్తిలోనా
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 1
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ....

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ

చరణం: 2
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
యవ్వనవీణనూ కవ్వించినావూ...

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ

చరణం: 3
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్

అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్

జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ..సరిలేరు నీకెవ్వరూ.....





ఏచటనో గల పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం:  దాశరథి
గానం: ఘంటసాల

ఎచటనోగల స్వర్గమ్ము నిచట దింపి
నన్ను మురిపించి మరపించినావు చెలియ
నీవె జీవితాధారము నీవె దిక్కు
నీదు పాదాల సాక్షిగా నీవె రక్ష





అర్ధరేతిరి కాడ పాట సాహిత్యం

 
చిత్రం: కంచుకోట (1967)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: యు. విశ్వేశ్వర రావు 
గానం: చక్రవర్తి, ఎల్. అర్. ఈశ్వరి 

అర్ధరేతిరికాడ అత్తయ్య నాకు
కలలోకి వచ్చింది మామో

ఎట్టా ? మాయమ్మా ?
ఆ కలలోన నన్ను అనరాని మాటలతో
అదరగొట్టేసింది మామో నన్ను
బెదరగొట్టేసింది మామో
కొట్టదూ మరి ?
నీయబ్బ నువ్వున్ను నాకన్న బాబునీ
నట్టేట ముంచారు అందీ
నిలువునా ముంచారు గందే 
ఆ ఉసురు ఫలితంగ నా దేవుడూ
నాకు దక్కనే దక్కడందీ
పీడా పొయె 
నాదేవుడూ నాకు దూరమయ్యాడంటే
నాకు దిక్కెవరయ్య మామో
నే ఉళ్లా..?
కడసారి చూపుగా ఒకసారి చూసొస్తా 
నీ దయా నాకుంటె మామో - నువ్వు
తలుపులూ తీయించు మా మో ....

No comments

Most Recent

Default