చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ నటీనటులు: సయ్యుద్ సోహెల్, రూపా కొడువాయుర్, సుహాసిని దర్శకత్వం: వింజనంపతి శ్రీనివాస్ నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవి రెడ్డి విడుదల తేది: 2022
Songs List:
హే చెలీ అడిగానే కౌగిలి పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి, లలితా కావ్య ధీం దిన దిననా ధీం దిన దిననా ధీం దిన దిననా దిన దిననా ధీం దిన దిననా ధీం దిన దిననా తానెన నెనెన తానెన నెనెన హే చెలీ అడిగానె కౌగిలి తియ్యగా తీరాలి ఈ చలి హే సఖి విరహాలు దేనికి చేరవ అడుగేసి చెంతకీ నీ మాటలో తీపి ఏ తాపమో రేపి నీ చూపు చేజాపిన చూపునే ఆపి వర్షం గొడుగూ జంట దారి అడుగూ జంట నువ్వు నేనేనంటా ప్రేమ కవితే ఒకరే ఒకరై మనమే ఒకటే పయనం మనమే విడిగా అడుగే పడని జతగా మనమే ధీం దిన దిననా ధీం దిన దిననా ధీం దిన దిననా దిన దిననా ధీం దిన దిననా ధీం దిన దిననా తానెన నెనెన తానెన నెనెన ధీం దిన దిననా ధీం దిన దిననా ధీం దిన దిననా దిన దిననా ధీం దిన దిననా ధీం దిన దిననా తానెన నెనెన తానెన నెనెన నువ్వు విడిచే ఈ క్షణం నాకు గురుతయ్యే క్షణం మరుక్షణంకై వీక్షణం మనదే ఈ కథనం ప్రళయ కలహం ఓ క్షణం ప్రణయ విరహం ఓ క్షణం మన ప్రయాణం ప్రతీ క్షణం మలుపెరుగని పయనం హే చెలీ అడిగానె కౌగిలి తియ్యగా తీరాలి ఈ చలి హే సఖి విరహాలు దేనికి చేరవ అడుగేసి చెంతకీ నీ మాటలో తీపి ఏ తాపమో రేపి నీ ఊపిరే గుండెసవ్వళ్ళలో నింపి వర్షం గొడుగూ జంట దారి అడుగూ జంట నువ్వు నేనేనంటా ప్రేమ కవితే ఒకరే ఒకరై మనమే ఒకటే పయనం మనమే విడిగా అడుగే పడని జతగా మనమే
ఏమైనదో తెలిపేదెలా పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: శుభం విశ్వనాధ్ గానం: యాజిన్ నిజార్ ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా చూసానిలా నీ జతలో నీ పిలుపు కాదా మధురం ఈ మలుపు పేరే ప్రణయం నీ కనులు కంటూ నయనం నను మరిచిపోయే హృదయం ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా చూసానిలా నీ జతలో కదిలే కాలాన్నే ఆపానే ఇదిగో ఈ జన్మ రాసానే వెతికా నన్నింకా నీలోనే కలలే కంటాను నీతోనే నేనిప్పుడే నీ గుండెపై చేశానుగా తొలి సంతకం ఇక ఎప్పుడూ నీలో సగం నేనే కదా కనులెప్పుడూ గుర్తించనీ నీ కలలనే నేనీ క్షణం కన్నానులే నీ ధ్యాసలో నాలోకమే నీవై పుడమిని తాకి మురిసిపోదా కరిగిన మబ్బు మొదటిసారి మానసిక తెలిసి కలిసి పోదా చెరిసగమైన కొత్త దారి ముడిపడమంటూ సాగిపోదా త్వరపడుతున్న ప్రేమ కోరి పరిచయమంతా మారిపోదా పరిణయమల్లే నిను చేరి ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా చూసానిలా నీ జతలో నీ పిలుపు కాదా మధురం ఈ మలుపు పేరే ప్రణయం నీ కనులు కంటూ నయనం నను మరిచిపోయే హృదయం
కథ వేరుంటది పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ ప్రెగ్నెంట్ (2022) సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సాహిత్యం: కిట్టు విస్సప్రగడ గానం: మోహన్ భోగరాజు ఓ సక్కనోడా… నాకు తగ్గ జోడా నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ సందమామ రాతిరేళ ధిష్ఠి కొట్టడా నీ గుట్టు లాగేట్టు… నా చుట్టు చేరేట్టు సోగకళ్ళ సోకుతోటి గాలమెయ్యనా నీ పక్క కూసింత చోటుంటే చాలంటు కన్నవాళ్ళు ఇంటి పేరు మార్చి పంపరా ఓ సక్కనోడా… నాకు తగ్గ జోడా నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ సందమామ రాతిరేళ ధిష్ఠి కొట్టడా మాసు లుక్కులోడా నువ్వు ఊ అంటే చాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే చాలు కథ వేరుంటది మాసు లుక్కులోడా నువ్వు ఊ అంటే చాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే చాలు కథ వేరుంటది ఊపిరాడకుంటది ఉక్కపోతగుంటది నిన్ను సూడకుండా గడిపే రోజు గుండె సాలకున్నది దాచలేను అన్నది వంద రెట్లు ఉన్న నీపై మోజు మాట దాటలేక దాగి ఉన్నది పైకి చెప్పలేని భాష ప్రేమది పరాయిదాని లాగ నన్ను చూడబోకని ఈ గాలిపైన లేఖ రాసి నీకు పంపనీ ఓ సక్కనోడా… నాకు తగ్గ జోడా నిన్ను చూసి పుట్టుకొచ్చె గుండెలో దడ ఓ అల్లరోడా బుగ్గ గిల్లి సూడ సందమామ రాతిరేళ ధిష్ఠి కొట్టడా మాసు లుక్కులోడా నువ్వు ఊ అంటే చాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే చాలు కథ వేరుంటది మాసు లుక్కులోడా నువ్వు ఊ అంటే చాలు కథ వేరుంటది సొట్ట సెంపలోడా నువ్వు సై అంటే చాలు కథ వేరుంటది
No comments
Post a Comment