Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sarkaru Vaari Paata (2022)




చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్
దర్శకత్వం: పరశురామ్
నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, GMB
విడుదల తేది: 12.05.2022



Songs List:



కళావతి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

మాంగల్యం తంతునానేనా 
మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే 
త్వం జీవ శరదాం శతం

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు 
మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ 
తీగలు మోగినాయ పోయిందే సోయ

ఇట్టాంటివన్ని అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె ధడగుంది విడిగుంది జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే

కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి

మాంగల్యం తంతునానేనా 
మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే 
త్వం జీవ శరదాం శతం

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు 
మీదికి దూకినాయ ఏందే నీ మాయ

అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా

రంగ ఘోరంగా నా కలలను కదిపావే
దొంగ అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చడగొడితివి కదవే

కళ్లా అవి కళావతి 
కల్లోలమైందే నా గతి
కురులా అవి కళావతి 
కుళ్లబొడిసింది చాలు తియె

కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి

మాంగల్యం తంతునానేనా 
మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే 
త్వం జీవ శరదాం శతం

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు 
మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ 
తీగలు మోగినాయ పోయిందే సోయ



పెన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: నకాష్ అజీజ్

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ

చెక్ చెక్ దేదే చెక్ చెక్ దేదే
చెక్ చెక్ చెక్కు చెక్కుదే
చెక్కెయ్యాలని చూశావంటే
చుక్కల్ చూస్తావ్ బె

దక్ దక్ దేదే దక్ దక్ దేదే
దకు దకు దకుదే
డేటిచ్చాక దాటిందంటే
ధమ్కీ తప్పదురే

నీ బాబు బిల్ గేట్స్ అయినా
నీ బాబాయ్ బైడెన్ అయినా
నా బాకీ రాలేదంటే
బ్లాస్టే ఏ స్టేటయినా

కాకా నువ్వు లోకల్వైనా
నా మార్కెట్ గ్లోబల్ నయినా
గ్లోబంతా దేకించేస్తా యాడున్నా

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
నీదే అవనీ… నాదే అవనీ
రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో
లాగేస్తా తన్నీ తన్నీ, పెన్నీ

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ
పెన్నీ పెన్నీ పెన్నీ
పెన్నీ పెన్నీ పెన్నీ

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ

చెప్పకురా తోలు తొక్క
తప్పదు నా వడ్డీ లెక్క
నువ్వెగవేతల్లో పహిల్వానైతే
నే న్నీ సైతాన్ బ్రో

అప్పుకి హానెస్టీ పక్కా
తిప్పకు చీరేస్తా డొక్క
నువ్ గుడిలో ఉన్నా గుహలో ఉన్నా
నీకెదురైతాన్ రో

డల్లాస్ లో డాలర్ బిళ్ళా
యూరప్ లో యూరో బిళ్ళా
రక్తాన్ని చిందిస్తేనే గాని రాదోయ్ మళ్ళా
నీ లాకర్ ఫుల్ అవ్వాలా
నా ఫైనాన్స్ డల్ అవ్వాలా
నై చెల్తా మై హో కాబూలీవాలా

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
నీదే అవనీ… నాదే అవనీ
రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో
లాగేస్తా తన్నీ తన్నీ
పెన్నీ పెన్నీ

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ
అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ
పెన్నీ పెన్నీ



మమ మహేషా పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రీకృష్ణ, జోనిత గాంధీ 

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే
ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే
ఏ, ఆదివారం ఒళ్ళోకొచ్చి ఆరుమూరల్
జల్లో పెట్టి ఆడేసుకోమంది అందమే

ఎ, మమ మమ మమ మమ మమ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా (2)

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం - సోమవారం
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం - మంగళారం
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం - బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

కోరస్:
పోరా బరంపురం బజారుకే
తేరా గులాబి మూర
పోరా సిరిపురం శివారుకు
తేరా చెంగల్వ మూర

ఎ, మమ మమ మమ మమ మమ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా (2)

పిలడా నువ్ విసిరేయకోయ్ సిరునవ్వలా
పిక్నిక్ కు పోతానోయ్ లోలోపలా
మగాడా నను చుడతావేం చలిగాలిలా
మత్తెక్కి పోతాందోయ్ నలువైపులా

గల్లా పెట్టె నీ ముద్దుల్తో నిండాల్నే
ప్రతిరోజు ముప్పూటలా
గల్లా పట్టి నా ప్రేమంత గుంజెయ్వె
సిగ్గేటే ఏదో మూల

హే సిగ్గేతప్ప ఎగ్గొట్టిది లేదోయ్ పోకిరి
అరె మొగ్గే తప్ప తగ్గేలాగా లేదీ తిమ్మిరి
ఏ, సగ్గుబియ్యం సేమియాలో తగ్గ పాలు చెక్కెరేసి
పాల గ్లాసు పట్టరా మరీ

ఎ, మమ మమ మమ మమ మమ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా (2)




సర్కారు వారి పాట పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హారిక నారాయణ్

సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
షురూ షురూ అన్నాడురా
అల్లూరి వారి బేటా
 
సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
గిరా గిరా గీస్తాడురా
ఇవ్వాల్సినోడి కోటా

సాఫ్టుగున్నాడంతా సంబరాలు పోక
సాఫు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక
ఈల కొట్టేంతలా యాలమేస్తాడట
ఎవ్వడడ్డొచ్చినా మాడు పగిలి పగిలి పగిలి పడునట

సర్కారు వారి పాట… సర్కారు వారి పాట
సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా

సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా



మురారి వా మురారివా పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శృతి రంజిని , ఎం.ఎల్.గాయత్రీ,  శ్రీకృష్ణ

మురారి వా మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా

హేయ్, చాల్ చాల్లే… చాలు ఊరుకో
ఆ మైకంలోనుండి తేరుకో
ఓ, ఏవేవో మాటలెందుకో
ఏం కావాలో వచ్చి తీసుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలేసుకో… మెలేసుకో, ఓ ఓ ఓ ఓ

మురారివా… మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో… మెరుపుల వారెవ్వా
ముద్దుముద్దు మాటల్తో పడేస్తివా

మధనుడి మాయలోకి… మాధవున్ని లాగినావే భామా
మొదటికి మోసం సుమా
మధువుల బాయిలోకి చేరినాక… మోసమేంది శ్యామా
మనకిక మోమాటమా

ముదిరావే నా బుజ్జి గోపికో
సరే చూద్దాం… నీకెంత ఓపికో
చూపిస్తే నాకేమి కానుకో
అందిస్తా నా గుండె కానుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలేసుకో… మెలేసుకో, ఓఓ ఓ ఓ

No comments

Most Recent

Default