చిత్రం: శుభవార్త (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల (All) నటీనటులు: అర్జున్, సౌందర్య దర్శకత్వం: P. N రామచంద్ర రావు నిర్మాత: M. Y. మహర్షి విడుదల తేది: 1998
Songs List:
అరె బాప్ రే పాట సాహిత్యం
చిత్రం: శుభవార్త (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, చిత్ర అరె బాప్ రే
అచ్చమైన పాట సాహిత్యం
చిత్రం: శుభవార్త (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, చిత్ర అచ్చమైన
జాబిలమ్మ ఆగవమ్మ (Duet) పాట సాహిత్యం
చిత్రం: శుభవార్త (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవా ఈ శుభవార్త జంట ప్రేమ చాటెనమ్మ వేలవన్నెల ఈ శుభవార్త కలే తీయ్యగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని ఈ కనివిని ఎరుగని కళ్యాణం అపురూపం అని రతిమదనులు తొలి అతిధులుగా కదిలొచ్చే కాలమని శ్రుతిముదిరిన తహతహలన్ని ఆహ్వానం పాడని మన కలయిక కలలకు కలగా అనిపించే సమయమని కునుకెరుగక ప్రతి నిమిషాన్ని కౌగిల్లో సాగని చెరోసగమయే సరాగాలతో ఒకే ప్రాణమై ఉందాం రమ్మని ఎడబాటే లేని ఏకాంతన్ని అందించని కలతెరుగని తలపుల హ్రుదయం తను కోరిన కోవ్వెలని కళతరగని వలపుల దీపం మన ఎదలో చేరని ఏ ఋతువున చేదరని స్నేహం మన బ్రతుకున ఉన్నదని మన పెదవుల నిలిచిన చైత్రం చిరునవ్వులు పూయని సదా ఈ జత..ఇదే తీరుగా ప్రతి ఊహని నిజం చెయ్యగా నీ తీయని చెలిమే తీరని రునమై జీవించని
కుళుకు బేబీ పాట సాహిత్యం
చిత్రం: శుభవార్త (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, చిత్ర కుళుకు బేబీ
జాబిలమ్మ ఆగవమ్మ (Sad)మ పాట సాహిత్యం
చిత్రం: శుభవార్త (1998) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.ఓ. జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవ మదిలో మాట రేగిపోయి మూగ ప్రేమ విన్నవించే ఈ యధ కోత అమావాస్యకే బలై మన కథ ఏటెలుతున్నదో నీకు తెలియదా నా బ్రతుకున బ్రతుకై ముడిపడిపోయిన ఓ ప్రియతమా అమావాస్యకే బలై మన కథ ఏటెలుతున్నదో నీకు తెలియదా జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవ మదిలో మాట రేగిపోయి మూగ ప్రేమ విన్నవించే ఈ యధ కోత అమావాస్యకే బలై మన కథ ఏటెలుతున్నదో నీకు తెలియదా నీ మనసుని తన కొలువంటూ నిను చేరిన నా మది అనురాగపు మని దీపముగా ఆ గుడిలో ఉన్నదీ ఏ కలతలు సుడి గాలులకి ఆరని వెలుగే అది నువు వెలివేయాలనుకున్న నీ నీడై ఉన్నదీ ప్రాణమే ఇలా నిన్ను చేరగా తనువు మాత్రము శిలై ఉన్నదీ ఈ శిల చిగురించే చినుకే నీలో దాగున్నది జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవ మదిలో మాట రేగిపోయి మూగ ప్రేమ విన్నవించే ఈ యధ కోత అమావాస్యకే బలై మన కథ ఏటెలుతున్నదో నీకు తెలియదా కనివిని ఎరుగని కలయికగా అనిపించిన జీవితం ఎడబాటును జరిగిన గతమై చినబోయెను ఈ క్షణం విష జ్వాలలు విసిరినా అహమే మసి చేసెను కాపురం ఏ మసకల ముసుగులు లేని మమకారమే శాశ్వతం ప్రణయమన్నది ఇదేనా అని మనని అడగదా లోకమన్నది బదులియకపోతే ప్రేమకి జాబిలమ్మ ఆగవమ్మ ఆలకించవ మదిలో మాట రేగిపోయి మూగ ప్రేమ విన్నవించే ఈ యధ కోత అమావాస్యకే బలై మన కథ ఏటెలుతున్నదో నీకు తెలియదా నా బ్రతుకున బ్రతుకై ముడిపడిపోయిన ఓ ప్రియతమా
No comments
Post a Comment