చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి నిర్మాత: కంకణాల ప్రవీణ విడుదల తేది: 2022
Songs List:
కృష్ణ అండ్ సత్యభామ పాట సాహిత్యం
చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: యాజిన్ నిజార్ , శిరీష భార్గవతుల నేనూహించలే నేననుకున్న అమ్మాయి నువ్వేనని అసలూహించలే..! నేనూహించలే ఇంతీజీగా నే నీకు పడతానని అస్సలూహించలే..! ఏంటో ప్రతి పాటలో చెప్పే పదమే కదా అయినా ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా వేరే పనిలేదుగా ప్రేమే సరిపోదుగా ఇక చాలు చాలు అని కొంతసేపు మరి కొంతసేపు పోనీదు అంత త్వరగా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా అందం తప్పేలే కంట్రోలే తప్పిస్తుందే అరె చెయ్యేమో నా మాట వినబోదులే ఈ మాటలే తగ్గించరా నీ చెంపపై తగిలిస్తే వినునా కోపాలు డూపేలే… నీకైనా ఒకేలే ముద్దంటే పైపైకే తిడతావులే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా డ్రెస్సే బాగుందే మంటల్నే పుట్టిస్తుందే గాని పరికిణీలో నీ బ్యూటీ ఓ రేంజేలే నా ఇష్టమే నాకుండదా నీ టేస్టులే రుద్దేస్తే తగునా డ్యూయెట్టు సెంటర్లో ఈ ఫైటు ఆపమ్మా వద్దంటే కామెంటే చేయబోనులే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా
బుల్లెట్ లా పాట సాహిత్యం
చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: సామ్రాట్ గానం: రితేష్ జి. రావు చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: సామ్రాట్ గానం: రితేష్ జి. రావు బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే కమ్మిట్టులా అయిపోయానే చాక్లెట్టులా నీ నవ్వునే చూసి నేను హాట్ కేకులా మెల్టయ్యానే ప్రతి రోజూ నీ కళ్ళనే తొంగి తొంగి నే చూసే ఆ కళ్ళు నన్ను పిలిచే వేళలో ఇంకేం ఇంకేం కావాలే చంపేయకే మనసిట్ఠే నువ్వు లాగి పీకి తోసేయకే ముద్దు ప్రేమలో ఇలా నింపేయకే చిన్ని గుండెల్లోన ఇంత ప్రేమ నింపెయకే చిత్రహింసలేంటి ఇలా నిన్న మొన్న లేని హాయే నువ్వొచ్చాకే చుట్టేసిందే నాకే నీను నచ్చేసానే నన్నే నీకు ఇచ్చేసానే నీ మాటల్లో మాయేదో గమ్మత్తుగుందే ఏ బాటిల్ లో లేనంత మత్తుందిలే రేయైన పగలైనా హాయైన దిగులైన నాతోడు నువ్వుంటే నాకింక సమ్మతమే చంపేయకే మనసిట్ఠే నువ్వు లాగి పీకి తోసేయకే ముద్దు ప్రేమలో ఇలా నింపేయకే చిన్ని గుండెల్లోన ఇంత ప్రేమ నింపెయకే చిత్రహింసలేంటి ఇలా నిదుర లేదే నేరం నీదే హద్దే లేనీ ప్రేమే నాదే ఇద్దరమొకటై బతికేద్దామే వద్దనకుండా హత్తుకుపోవే ఏ చోటున్న నీ గొంతే వినిపిస్తూ ఉందే ఏ పాటిన్న రానంత కిక్కుందిలే జగమంతా సగమైన క్షణమేను యుగమైన ఈ వలపు మలుపుల్లో సతమతము సమ్మతమే చంపేయకే మనసిట్ఠే నువ్వు లాగి పీకి తోసేయకే ముద్దు ప్రేమలో ఇలా నింపేయకే చిన్ని గుండెల్లోన ఇంత ప్రేమ నింపెయకే చిత్రహింసలేంటి ఇలా బుల్లెట్టులా నీ వైపే నేనొస్తున్నానే కమ్మిట్టులా అయిపోయానే
బావ తాకితే పాట సాహిత్యం
చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: సెనాపతి భరద్వాజ్ పాత్రుడు గానం: మల్లికార్జున్, మాళవిక తననం తననం… తననం తననం తననం తననం… తననం తననం తననం తననం, ఆ ఆ… తననం తననం, ఆ ఆ తననం తననం, ఆ ఆ… తననం తననం చిటపట చినుకులు కురిసెనులే, మ్ మ్ ఎదలో అలజడి రేగే, జుం జుం జుం జుం పడి పడి తపనలు తడిసెనులే, మ్ మ్ తనువే తహ తహలాడే, జుం జుం జుం జుం ఏమి జరిగిందో నీ జారు జారు పైట జారిపోతుంది ఈడు దాడుల్లో నా ఒంటి నుండి సిగ్గు పారిపోయిందే కొండల్లో కోనల్లో… వాగుల్లో వంకల్లో ఎన్నెన్నో వేషాలే వేద్దామా ఎంచక్కా ఇంపుల్లో… తైతక్క ముద్దుల్లో ఊరేగి ఆహ అందామా బావ తాకితే… మురిసే మురిసే లేత పరువం మెరిసే భామ కులుకులు… తెలిసే తెలిసే ఆగనన్నది వయసే తననం తననం… తననం తననం తననం తననం… తననం తననం తననం తననం… తననం తననం తననం తననం… తననం తననం తననం తననం… తననం తననం తననం తననం… తననం తననం లాల లలలలా లాల లలలలా లల లాల లలలలా లల లల లలలలలా జుం జుం జుం జుం జుం జుం జుం జుం మాటా మాటా… చూపు చూపు ఏకం చేసే వేళల్లోనా, మ్మ్ మ్మ్ కాలక్షేపం చేయొద్ధంది కొంటె కోరిక జుం జుం జుం జుం రాలేనంటూ రారమ్మంటూ సైగల్లోనే సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్న నేను హాయ్ హాయ్ నాయకా జుం జుం జుం జుం ఏదో ఏదో చేసావే మ్యాజిక్కే మ్యాజిక్కే ఆగేలాగా లేదే లోలో మ్యూజిక్కే వచ్చావంటే వేగంగా నా దిక్కే నా దిక్కే ఐబాబోయ్ అంతా నా లక్కే బావ తాకితే… మురిసే మురిసే లేత పరువం మెరిసే భామ కులుకులు… తెలిసే తెలిసే ఆగనన్నది వయసే జుం జుం జుం జుం జుం జుం జుం జుం నిద్ర గిద్రా మాకేమాత్రం వద్దొద్దంటూ చెప్పే కళ్ళు నలుపు రంగు రాత్రిలోన ఎరుపెక్కాలమ్మా, జుం జుం జుం జుం పెదవి పెదవి సున్నితంగా రాజూకుందే మోజుల్లోన రాణించేటి రాజా నిన్ను ఆపాతరమా జివ్వు జివ్వు అంటుందే… లోలోన లోలోన బజ్జోబెట్టుకోవా నన్ను ఒల్లోన ఏనాడైనా నీ ఇష్టం కాదంటూ ఉన్నానా ఊ అంటే, ఊహు అన్నానా బావ తాకితే… మురిసే మురిసే లేత పరువం మెరిసే భామ కులుకులు… తెలిసే తెలిసే ఆగనన్నది వయసే
నందలాల పాట సాహిత్యం
చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: కరిముల్లా హరిలోరంగ హరి ఇది కదా మొదలయ్యే దారి కనుల కంచె దాటి కల కంచిని వెదికే వారి హరిలోరంగ హరి బరి తెలియని బాలమురారి సరిగా గడసరిగా మారి బైలుదేరే చూద్దమురారి కొనలేని కోరికలన్నీ ఏకరువు పెట్టాడే ఆ కొరత తీర్చే నారీ మరి యాడున్నాదో లోకమే ఏకమై చూసినా తెలియని లోతితడే నందలాల గోకుల బాల కృష్ణ నవ్వుల నది ఇతడేరా గోపీనాథ కోలాహలమై పట్నం బాలికొచ్చెను కదరా నందలాల గోకుల బాల కృష్ణ నవ్వుల నది ఇతడేరా వీధి వీధిలో ఎదురయ్యే కథ మనలాంటోడే కదరా కాలమే పరిగెడుతుంటే కాలితో గొడవడుతాడే మొండిగా నమ్మిందొకటే మంచని అంటాడే కొనలేని కోరికలన్నీ ఏకరువు పెట్టాడే ఆ కొరత తీర్చే నారీ మరి యాడున్నాదో లోకమే ఏకమై చూసినా తెలియని లోతితడే నందలాల గోకుల బాల కృష్ణ నవ్వుల నది ఇతడేరా గోపీనాథ కోలాహలమై పట్నం బాలికొచ్చెను కదరా నందలాల గోకుల బాల కృష్ణ నవ్వుల నది ఇతడేరా వీధి వీధిలో ఎదురయ్యే కథ మనలాంటోడే కదరా
తెలుసో లేదో పాట సాహిత్యం
చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: హరిచరణ్, దినేష్ రుద్ర జిలుగైన చెంగావి… జిగి మీరు కుచ్చిళ్ళు చిన్ని యడుగుల మీద చిందులాడ నీటైన రత్నాల తాటంకముల కాంతి కుల్కు గుబ్బలమీద గునిసియాడా గురుతైన అపరంజి గొప్పముత్తెపు సత్తు మోవిపై నొక వింతా ముద్దుగుల్కా తెలుసో లేదో కలలో చూశా అపుడెపుడో నాలో నిన్నే కలిశా ఎవరిని చూసో ఎవరన్నావో పరుగొదిలిక కొంచం ఆగే మనసా సో సో… తెగ పోరుతో లైఫులో సోలో… అనుకుంటూ పడుంటే స్లోమో… ఎలివేషన్ లోన నువ్వొచ్చావా అన్నో, తెగ ఊహలు వద్దుర అమ్మో, తన లెక్కలు వేరో ఏమో, కలిసే ఇక చూడరా ఏమౌతుందో ఎపుడూ ఒకటే పరిపాటా తనకే పడదా సరదా అసలే పడవే పనీపాటా మనసే వేయదే పరదా వీరు వీరే మరి వారు వారే అరె వేరే వేరే దిశలొకటిగా కలిసెనా..? సో సో… తెగ పోరుతో లైఫులో సోలో… అనుకుంటూ పడుంటే స్లోమో… ఎలివేషన్ లోన నువ్వొచ్చావా అన్నో, తెగ ఊహలు వద్దుర అమ్మో, తన లెక్కలు వేరో ఏమో, కలిసే ఇక చూడరా ఏమౌతుందో రంగవల్లి నేలలా చంటిపాప జోలలా అంటుకోనె ఉండదా జంట తారలా టెన్ టు ఫైవ్ అమ్మలా ఆలోపే ఆలిలా మారదా ఓపిగ్గా కనులను నిమురుతూ కలలను నిలపదా అల తాకిడి లేకనే కడలై ఎద మారే మనసంచులదాకా ఏదో హాయే అల తాకిడి లేకనే కడలై ఎద మారే మనసంచులదాకా ఏదో హాయే
ప్రేమా ఇది ఏమో పాట సాహిత్యం
చిత్రం: సమ్మతమే (2022) సంగీతం: శేఖర్ చంద్ర సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: ఆదిత్య RK నిమిషమైనా ఆగునా నిలవదే ఎపుడు కాలమే క్షణము కూడా ఉండదే తిరగడం మాని భూమిదే ఎవరికో ఎందుకో మనసులే మారితే ఎలా లేదు ఎవరి మీద హక్కు నీకు తెలియదా..? ఇంతే తెలుసుకుంటే ఎపుడు నీకే తెలియలేదెలా నిమిషమైనా ఆగునా నిలవదే ఎపుడు కాలమే క్షణము కూడా ఉండదే తిరగడం మాని భూమిదే నిన్నింత నమ్మిందనే నీకింత అలుసా ప్రేమిస్తే అయిపోతుందా బానిస ప్రతిదీ నీతో పోల్చి అడిగితే తనది కూడా నీవే బ్రతికితే ప్రేమా ఇది ఏమో మరి చేసావులే నీకు నీవే మోసమే ఇంతే తెలుసుకుంటే ఎపుడు నీకే తెలియలేదెలా ఇన్నాళ్లు చూపించిన కోపాలు బహుశా దూరంగా పేరే మార్చి చేరేనా ఇంతా చేసి చోటు వెతికితే సమము కాని కంటతడి ఇదే ప్రేమ ఇది ఏమో మరి చేసావులే నీకు నీవే మోసమే లేదు ఎవరి మీద హక్కు నీకు తెలియదా ఇంతే తెలుసుకుంటే ఎపుడు నీకే తెలియలేదెలా
No comments
Post a Comment