Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ante Sundaraniki (2022)




చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
నటీనటులు: నాని , నజ్రీయ నజీం
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ 
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ 
విడుదల తేది: 10.06.2022



Songs List:



పంచకట్టు పాట సాహిత్యం

 
చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: హసిత్ గోలి
గానం: అరుణ సాయిరాం 

సారోరు ఫేడైపోయే ఫ్రీడం
మీదింకా… ఎహె మీదింకా
సారోరు డూపే లేకుండా
ఫ్రీడం ఫైటింకా..! మీతో మీకింకా

ఆ ఆఆ, ఫోజే బిగించి, ఎటు చేరారు
మోజే వరించే సారూ
అరె సారం గుణించి బరి దాటారు
మరి మోగే ముగింపోమారు

ఆ ఆ ఆఆ
రంగంలో దుంకారు
భలే అందంగా మాష్టారు
హే, సరదాల సరుకే మీరు, ఊఊ ఊ

సయ్యంటూ దుకారు
ఇక సుందరు మాస్టారు
హే సరదాకే సురకేసారు, ఊఊ ఊ

జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా
జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా
జగు జిగాక్కు జిగు జిగాక్కు
జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా

ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే, ఆ
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా, హహ్హా

తేలనందా సోకు
దాగి దాగనందా
తీరనందా దాహాల ఈ ఎడారి
ఆ ఆ ఆగనంటూ ఆగేటి బాటలోనే
సాగమంటూ పేచీనే తోడయిందా

అంతే గారంగా వేగంగా దూరంగా
మారే మీ గాధ ఓ వింతలే
అంతే లేనంత రానంత కోరిందా
తూగే ఈ మూగ మేళాలనే

రంగంలో దుంకారు
అందంగా మాష్టారు
సరదాల సరుకే మీరు, ఊఊ ఊ

సయ్యంటూ దుకారు
ఇక సుందరు మాస్టారు
హే సరదాకే సురకేసారు, ఊఊ ఊ

రంగంలో దుంకారు, సారోరు
ఇక సుందరు మాస్టారు
ప ని నిని ప ని నిని ప ని నిని ప ని
సయ్యంటూ దుకారు
నిస నిస నిస పని పని పని పని మప
అందంగా మాష్టారు
మ పనిస మపనిస మపనిస ని గ సా

సారోరు ఫేడైపోయే
ఫ్రీడం మీదంటా
సారోరు డూపే లేకుండా
ఫైటే మీదంటా

ఆ ఆ, ఫోజే బిగించి, ఎటు చేరారు, చేరారు
మోజే వరించే సారూ, సారూ
అరె సారం గుణించి బరి దాటారు
మరి మోగే ముగింపోమారు, సారో

ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా, ఎందుకింకా

ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా, ఎందుకింకా

ఉన్నదంతా మాయే లేరా
ఎందుకింకా బేరాలే
ఉన్నదంతా బేరాలేరా
ఎందుకింకా, ఎందుకింకా





ఎంత చిత్రం పాట సాహిత్యం

 
చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి, కీర్తన విధ్యానాథన్

మ్ మ్, ఎంత చిత్రం
మ్ మ్, ఎంత చిత్రం
ఇన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా
మ్, ఎంత మాత్రం ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా

మ్ మ్, ఎంత చిత్రం
ఇన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా
మ్, ఎంత మాత్రం ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా

ఒల్లలా విరుచుకుంటూ
రోజు తెల్లవారుతోంది ఎంచేతో
ఓ, అస్సలేం జరుగుతుందో ఏమో ఏమిటో

ఏమని నన్నడిగా ఏమైందని
మ్, ఆమని నా మనసంతా
పూలు చల్లే రమ్మని

ఎక్కడో చిన్ని ఆశ
ఎక్కడో చిన్ని ఆశ
కులాసా ఊయలేసా
నిన్నలో నన్ను తీసా
కొత్తగా రంగులేసా

ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ
మ్, అద్దాలకే కన్ను కుట్టేలా
అందాల ఆనందమౌతున్నా
ఏమైందేమిటే హలా

మ్, ఆ వెన్నెలే వెన్ను తట్టేలా
లోకానికే కాంతినిస్తున్నా
ఇంతలో ఇన్ని వింతలా
ఫలానా పేరు లేనిదే
ఉల్లాసమే నా జతైనదే
ఈ గాలిలో జో లాలిలో
గతాల డైరీ కదులుతోంది, హేయ్

ఇన్నాళ్లకిన్నాళ్ళకు మళ్ళి
మరింత నాకు నేను దొరికానే
కాలమే మాయ చేసెనే, ఆ ఆ
కాలమే మాయ చేసెనే, ఆ ఆ

ఈ కొన్నాళ్లలో నిన్నలోకెళ్ళి
ఆనాటి నన్ను నేను కలిసానే
ఓరి మా చిన్ని నాయనే
ఓ సుఖీసుఖాన జీవితం
ఊరంతా కేరింతలాడెనె
ఈ కొంచమే ఇంకొంచమై
ఎటెల్లి ఆగుతుందే ఏమో

ఏమని నన్నడిగా ఏమైందని
ఏమని నన్నడిగా ఏమైందని
మ్, ఆమని నా మనసంతా
పూలు చల్లే రమ్మని




రంగో రంగ పాట సాహిత్యం

 
చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: సెనాపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: కారుణ్య

మ్ అనుకుందోటి అయ్యిందోటి
రంగో రంగ… రంగో రంగ
మొక్కిందోటి దక్కిందోటి
రంగో రంగ… రంగో రంగ

నీకుంది నిక్కచ్చి పిచ్చి
కాలంకి నీపైన కచ్చి
అచ్చొచ్చినట్టే తానొచ్చి
అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
మచ్చోటి వచ్చేట్టు సచ్చేట్టు గిచ్చిందిరా

ఓరి బాబోయ్..! హహహా
చెప్పలేని, హిహిహీ… నొప్పి నీదోయ్
హహహా హిహిహీ, ఊఊ ఉ

ఆహూ, ఊహూ
(ఇయమ్ ఆకాశవాణి, సంప్రతి వార్త: శ్రూయంతామ్ ప్రవాచక: బలదేవానంద సాగర)

ఆమ్ చెయ్యంటూ… హహహ
ఆమ్ చెయ్యంటూ ఆకేసారోయ్
రంగో రంగ… రంగో రంగ
కూర్చోమంటూ పీటేసారోయ్
లోనున్న ఆకల్ని చూసి, చూసి
వేడేడి వంటల్ని చేసి, చూసి

పప్పేసి బువ్వేసి నెయ్యేసి
ఆశల్ని రాసుల్గా పోసేసి
ఇన్నోటినొడ్డించి ఇస్తర్నే లాగేస్తరా

వీరబాబో..! హహ హా
తిండిలేకా, హిహిహీ… పస్తులేనా..?
హహహా హిహిహీ, ఊఊ ఉ
తిండిలేకా పస్తులేనా వీరబాబో
పస్తులేనా..???



తందనానంద పాట సాహిత్యం

 
చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శంకర్ మహదేవన్, శ్వేతా మోహన్ 

చెంగుచాటు చెగువేరా
విప్లవాల విప్ర సితార, హా
జంట చేరుకోగా లీలాబాల
ఉత్తినే ఊరుకుంటారా..?

పీప్పి పిపీప్పి పీప్పి పీప్పిపీ
పిపిపి పీప్పిపీ పిపి పీ
పీప్పి పీ పీ పిపీప్పి పీప్పి
పిపీ పిపీ పి పీ పి పీ పీ

ఆ, దేశావళి పులిహోర, ఆహా
కలిపినారుగా చెయ్యారా, హా
కంచిదాక కధ సాగిస్తారా
మధ్యలోనే మునకేస్తారా

హా, అటువారు ఆవకాయ ఫ్యాన్సు
మరేమో ఇటువీరు కేక్ వైన్ ఫ్రెండ్సు
ఆ, భలేగా కుదిరిందిలే ఈ అలయన్సు
లల్లల్లారే లల్లా…

అంటే సుందరానికింకా పెళ్లేనా
లీలాపాప బుగ్గన్ చుక్క థ్రిల్లేనా, హే హే
ఆల్ ద సైజు అక్షింతల జల్లేనా
చర్చ్ వెడ్డింగ్ బెల్సు… ఘల్లు ఘల్లేనా

తందనానంద చయ్య చయ్య చాంగురే, ఓ
తందనానంద తయ్యారే తలాంగురే, ఓ
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహ ఓహో హో అబ్బబ్బో, ఓ వాట్ ఎ బ్యూటీ

తందనానంద చయ్య చయ్య చాంగురే, ఓ
తందనానంద తయ్యారే తలాంగురే, ఓ
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహ ఓహో హో అబ్బబ్బో, ఓ వాట్ ఎ బ్యూటీ
(వాట్ ఎ బ్యూటీ… వాట్ ఎ బ్యూటీ)

టట్టా టట్టాయ్ లగ్గం టైము రానే వచ్చేసింది
అందర్లో ఆనందం… తన్నుకు వచ్చేసింది, ఆహా
అంతలో ఓ దారుణం… మరి జరిగిపోయేనండి, అయ్యో
పెళ్లి ఉంగరాలు… తాళి బొట్టు మాయమాయేనండి..!!

అయ్యయ్యో అదేంటండీ..!
అంటే, అంటే…!!
అంటే సుందరానికింక అంతేనా
మూడుముల్ల ముచ్చటింక డౌటేనా, హా హాహ
లైఫు లాంగు బ్రహ్మచారి వంటేనా
పాపం పెళ్లి సిగ్నలందుకోదా ఆంటెనా

తందనానంద చయ్య చయ్య చాంగురే
రెయ్ రెయ్ రెయ్, రేయ్ ఏంట్రా ఇది
ఇది ప్రోమో సాంగ్ రా,
కరెక్టే అన్నా..! కానీ పెళ్లి…!
అయితే, రెయ్ సుందరానికి పెళ్ళైన కాకపోయినా ఏమైనా సెలబ్రేషనేరా, మ్..
ఏంటి నమ్మట్లేదా..!
లీలా… కొంచం వాళ్లకు చెప్పు.
హలో ముజిషన్స్..! కొట్టండమ్మా…

తందనానంద చయ్య చయ్య చాంగురే, ఓ
తందనానంద తయ్యారే తలాంగురే, ఓ
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహ ఓహో హో అబ్బబ్బో, ఓ వాట్ ఎ బ్యూటీ

తందనానంద చయ్య చయ్య చాంగురే, ఓ
తందనానంద తయ్యారే తలాంగురే, ఓ
తందనానంద చయ్య చయ్య చాంగురే
ఆహ ఓహో హో అబ్బబ్బో, ఓ వాట్ ఎ బ్యూటీ

తందనానంద… పిపీ పిపీ పి పీ
తందనానంద… పిపీ పిపీ పి పీ
తందనానంద… పిపీ పిపీ పి పీ
తందనానంద… పిపీ పిపీ పి పీ

ఆహ ఓహో హో అబ్బబ్బో, ఓ వాట్ ఎ బ్యూటీ
అంటే సుందరానికి..!
హు హు హు హు… తధాస్తు



చిరు పాట సాహిత్యం

 
చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: సెనాపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: మనో 

చిరు పాట 



ఓరోరి సంచారి పాట సాహిత్యం

 
చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: సెనాపతి భరద్వాజ్ పాత్రుడు
గానం: సచిన్ బాలు 

ఓ ఓ ఆఆ ఆ ఓ ఆ ఆ
ఓరోరి సంచారీ… ఒగ్గేసి నీ దారి
సూద్దువురా ఈ సిత్రం ఓ సారి

ఓ, కళ్ళల్లో నీరూరి… ఎండల్లో ఏసారి
ఎన్నెల్లో సేరిందోయ్ గోదారి
హో, దూరం దూరం జరిగిపడగా
లోలో భారం తరగలేదా

నీరెండలో కురిసే సినుకా, ఆ ఆ
నీకుండగా కిరణం జతగా, ఆ ఆ
ఓ మెరిసే అందాలిట్టా లేవా
ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ

ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ
ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ
ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ

ఓ ఓ, లోలో ఉసూరంటూ సాగే తమాషా
పైపై చెమక్కుల్లో ఏదో నిరాశ
ఏంటో మొరాయిస్తూ దాగేటి చిరునవ్వులే
నీకై వెతుక్కుంటూ రావా

ఇటుగా సమీపించే సుదూరాలలో
జతగా ప్రయాణించలేవా
ఓరోరి సంచారి… ప్రశ్నల్లో చేజారి
తేలిందా లేదా నీ దారీ

ఓరోరి సంచారీ… ఒగ్గేసి నీ దారి
సూద్దువురా ఈ సిత్రం ఓ సారి

ఎన్నెల్లో సేరిందా… గోదారే తుళ్ళిందా
సన్నాయి రాతిరిలో… సేదతీరుతానందా
ఎన్నెల్లో రోజంతా గోదారే ఇంతింత
పొద్దు తిన్న వెన్నెల్లా… సల్లంగా ఉంటుందా

ఆగలేక అడుగే వేయక
కొనసాగుతావా ఇంకా ఏ దిక్కు తోచకా
నీ ఈ మజిలీ నడపాలి నిన్ను నువ్వొదిలి
నిన్నటి ఆ నిన్ను నీను కలిసేలా

ఆ విచ్చే అబద్ధంలో గుచ్చే నిజాలెన్నో
లోకం కథగా ఎంతో కలగా
ఇంకా ఎన్నాళ్ళు దాచుంచగలవో

ఓరోరి సంచారీ… ఒగ్గేసి నీ దారి
సూద్దువురా ఈ సిత్రం ఓ సారి
ఓ, కళ్ళల్లో నీరూరి… ఎండల్లో ఏసారి
ఎన్నెల్లో సేరిందోయ్ గోదారి




తెర తీసింది నీవే పాట సాహిత్యం

 
చిత్రం: అంటే సుందరానికి (2022)
సంగీతం: వివేక్ సాగర్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: శక్తి శ్రీ గోపాలన్ 

తెర తీసింది నీవే
తుది లేనట్టి నాటకమే
కధ సాగింది చాలులే
ఓఓ ఓ తెర దించాలి నీవే

రంగులన్నీ తీసి చూడు నువ్వే
అంతరంగం నేడే
వేషమంతా వీడి నీలా మారే
కాలమింకా చేరే
ఆ ఆఆ మ్ మ్ ఆ ఆ ఆ హే


 
ఓ, అంతా చీకటైన వేళా
కళ్ళలో ఇవ్వాళ
కానరావు కానరావు కాంతిరేఖలే

కధ కాని కథలోనే
తెరచాటునున్న భ్రాంతి నీవని
ఎనలేని మౌనమే సరితూగే ఆటకు
బంధమై నిలిచావే


No comments

Most Recent

Default