చిత్రం: కృష్ణ వ్రింద విహారి (2022) సంగీతం: మహతి స్వర సాగర్ నటీనటులు: నాగ శౌర్య , షెర్లీ సేతియ దర్శకత్వం: అనీస్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉష మల్పూరి విడుదల తేది: 06.05.2022
Songs List:
వర్షంలో వెన్నెల్లా పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ వ్రింద విహారి (2022) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: శ్రీమణి గానం: ఆదిత్య ఆర్.కె, సంజన కల్మన్జీ రా వెన్నెల్లో వర్షంలా రా వర్షంలో వెన్నెల్లా అందాలిలా అందాయిగా తాగిపోరా ఓ మనోహరా నీ ఏకాంతం నాదేరా నా ఏదైనా నీదేరా వందేళ్ళిలా ఉండాలిరా మొత్తం నువ్వే నా సొంతం కారా నీ కురులతో సూర్యున్నే కప్పేసి రేయల్లే మార్చావుగా నా మనసుకే రెక్కల్నే కట్టేసి ఆశల్లో విసిరావుగా, ఆ ఆ హే, ఫాలింగ్ నీ ఒళ్ళో హే, ఫ్రీజింగ్ కౌగిట్లో హే, బ్రీతింగ్ నీ ఊపిరిలో హే, ఇన్నాళ్ళు సోలో హే, ఈరోజే ఫ్లో లో హే, అవుతున్నా నిను ఫాలో నీ కౌగిళ్ళు దాటి కాలం ఉన్నదా నీ నీడల్ని దాటి లోకం ఉన్నదా నీ బొమ్మే గుండెల్లో స్కెచ్చై నువ్వంటే నాకే పిచ్చై ఏ మచ్చ లేనట్టి చందమామవు నీవో కలలాగినా అలలాగినా ఈ దారిన మన అడుగాగునా, ఆ ఆ హే, ఫాలింగ్ నీ ఒళ్ళో హే, ఫ్రీజింగ్ కౌగిట్లో హే, బ్రీతింగ్ నీ ఊపిరిలో హే, ఇన్నాళ్ళు సోలో హే, ఈరోజే ఫ్లో లో హే, అవుతున్నా నిను ఫాలో
ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు పాట సాహిత్యం
చిత్రం: కృష్ణ వ్రింద విహారి (2022) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: హర్ష గానం: హరిచరణ్ ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపు రేఖలా కురులలో చిక్కుకున్నాయి చూపులే పైటలే దారి చెప్పవే హలా అతిలోకాన్నే వదిలేసినా దేవతవి నువ్వేమో అనుకున్న నిను పూజించి పిలిచారంటే యుద్ధమైన ప్రకటించేయనా ఏ కవులు పాడని ఏ కథలు రాయని అందాన్నే చూస్తున్నా ఈ భువికి చెందని ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా జిలుగులే చల్లే ఆ పాలపుంతని పెదవిపై పోసి నవ్వకే అలా కాలాలలో మోయలేనంత హాయిని కనులలో దాచి వెళ్లకే అలా, హలా
No comments
Post a Comment