చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు నటీనటులు: సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు నిర్మాత: డి.మధుసూధనరావు విడుదల తేది: 07.01.1959
Songs List:
చెక్కిలి మీద పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, జిక్కీ చెక్కిలి మీద
ఆకాశ వీధిలో పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీశ్రీ గానం: ఘంటసాల, పి.సుశీల ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే తలసారు మేనిమబ్బు పరదాలు నేసీ తెరచాటు చేసీ పలుమారు దాగి దాగి పంతాలూ పోయీ పందాలు వేసీ అందాల చందామామా దొంగాటలాడెనే దోబూచులాడెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోనీ కలకాలము నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ అందాలా చందమామా అనురాగం చాటెనే నయగారం చేసెనే ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారీ తారను జేరీ ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
మై డియర్ మీనా పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, జిక్కీ మై డియర్ మీనా
తిరుపతి వెంకటేశ్వర పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: కొసరాజు గానం: కె.జమునారాణి తిరుపతి వెంకటేశ్వర
వాడిన పూలే పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీశ్రీ గానం: ఘంటసాల, పి. సుశీల వాడిన పూలే
ఔనంటారా పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీశ్రీ గానం: పి.లీల, పి. సుశీల ఔనంటారా
హాయిగా ఆలుమగలై పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీశ్రీ గానం: పి. సుశీల, ఉడుత సరోజిని పల్లవి: హాయిగా ఆలుమగలై కాలం గడపాలి హాయిగా ఆలుమగలై కాలం గడపాలి వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి చరణం: 1 సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి హాయిగా ఆలుమగలై కాలం గడపాలి చరణం: 2 ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి సుఖమైనా అసత్యమైనా సగపాలుగా మెలగాలి హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలుమగలై కాలం గడపాలి చరణం: 3 ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలుమగలై కాలం గడపాలి వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
తెలియని అనుబంధం పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీశ్రీ గానం: పి. సుశీల పల్లవి: తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై పాడేనా హృదయం తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై పాడేనా హృదయం చరణం: 1 కల కల లాడెను వసంత వనము మైమరిపించెను మలయా నిలము కల కల లాడెను వసంత వనము మైమరిపించెను మలయా నిలము తీయని ఊహల ఊయల లూగి తేలే మానసము... ఏమో... తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం చరణం: 2 రోజూ పూచే రోజా పూలు ఒలికించినవి నవరాగాలు ఆ... రోజూ పూచే రోజా పూలు ఒలికించినవి నవరాగాలు ఆ... పరిచయమైన కోయిల పాటే కురిసే అనురాగం... ఏమో.... తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం చరణం: 3 అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలిమంచు తెరలే తరలి అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలిమంచు తెరలే తరలి ఎరుగని వింతలు ఎదుటే నిలిచి వెలుగే వికసించే... ఏమో... తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పెనుచీకటాయే లోకం పాట సాహిత్యం
చిత్రం: మాంగల్య బలం (1959) సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీశ్రీ గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి: పెను చీకటాయె లోకం చెలరేగే నాలో శోకం విషమాయె మా ప్రేమ విధియే పగాయె చరణం: 1 చిననాటి పరిణయ గాథఎదిరించలేనైతినే (2) ఈనాటి ప్రేమగాథ తలదాల్చలేనైతినే కలలే నశించిపోయే మన సే కృశించిపోయే విషమాయె మా ప్రేమ విధియే పగాయె చరణం: 2 మొగమైన చూపలేదే మనసింతలో మారెనా (2) నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా తొలినాటి కలతల వలన హృదయాలు బలి కావలెనా విషమాయె మా ప్రేమ విధియే పగాయె
No comments
Post a Comment