Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chor Bazaar (2022)




చిత్రం: చోర్ బజార్ (2022)
సంగీతం: అసుర (ద నవాబ్ గ్యాంగ్), సురేష్ బొబ్బిలి, మదీన్ ఎస్.కె.
నటీనటులు: ఆకాష్ పూరీ, గేహ్న సిప్పీ 
దర్శకత్వం: బి.జీవన్ రెడ్డి 
నిర్మాత: వి.ఎస్.రాజు 
విడుదల తేది: 24.062022



Songs List:



చోర్ బజార్ పాట సాహిత్యం

 
చిత్రం: చోర్ బజార్ (2022)
సంగీతం: అసుర (ద నవాబ్ గ్యాంగ్)
సాహిత్యం: అసుర సెల్విన్ ఫ్రాన్సిస్
గానం: శృతి రంజిని 

యెహె చోర్ బజార్
ఇది చోర్ బజార్, ఎ
ఆజ చోర్ బజార్

ప్రతి బస్తీలో ఉంటా నేను
లేదు నాకు ఆధార్
నచ్చినట్టే బతుకుతుంటా
లేదు నాకు బాధ

ఖద్దర్ అయినా కాకీ అయినా
లేదు నాకు తేడా
రంగు రంగు జీవితాలు
చోర్ బజార్ ఆజా

పార్కింగ్ లో కార్లు ఉంటె టైర్లన్ని మాయం
మీ ఇంటి బయట బైక్ పెడితే పార్టలన్నీ మాయం
జేబులోంచి కింద పడితే పర్సు చేస్తా మాయం
చీకటైతే ఎక్కడైనా నొక్కడం కాయం
 
యే, కిందపడితే మా సొంతం
భూమి తల్లి బిడ్డలం
గద్దలెన్ని ఉన్న గాని
చేత చిక్కని ఈగలం

ఇస్మార్ట్ దిమాక్ పోరాల్లం
అలెర్టు ఉంటం అందరం
దేనికైనా సిద్ధముంటం
లేదు తాడు బంగరం

మా గల్లి అంత మా జనం
మా బస్తీ అంతా మా దళం
నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్
నువ్ కుస్తీకొస్తే పాతడం

మా గల్లి అంత మా జనం
మా బస్తీ అంతా మా దళం
నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్
నువ్ కుస్తీకొస్తే పాతడం

యె చోర్ బజార్
యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
హమ్ చోర్ ఎసార్
ఇది చోర్ బజార్
యెహె చోర్ బజార్
ఆజా చోర్ బజార్
ఆజా చోర్ బజార్

యెహె చోర్ బజార్
యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
హమ్ చోర్ ఎసార్
ఇది చోర్ బజార్
యెహె చోర్ బజార్
ఆజా చోర్ బజార్
ఆజా చోర్ బజార్

ఆ ఆఆ ఆఆ న ఆఆ
ఆ ఆఆ ఆఆ న ఆఆ

యెహె చోర్ బజార్
మన చోర్ ఎసార్
ఇది చోర్ బజార్
ఆజా చోర్ బజార్

హువా రాత్
చాలు మేర కామ్ కర్నా చాలు కియా జోల్
నా సోచ్ కి న కౌన్ ముజే పక్డేకా
కౌన్ ముజే రకేగా
పాండు భయ్యా పీచే బైట సీదా గూమ్నాయే

తేరా స్కూల్ రహ్నా తుజే శాతిర్
సమీర్ మేరా మజ్బూత్
కర్తే కాలే కర్తోస్ యే తో మేర దస్తూర్





జడ పాట సాహిత్యం

 

చిత్రం: చోర్ బజార్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ 
గానం: రామ్ మిరియాల 

ఏ, అబ్బబ్బా అది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో
దాని జడపై మనసు పడి
మెడకి నడుముకి నడుమ
నాగుపాములాగా కదలాడి
ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి

చార్మినారు లాంటి లైఫునే
ప్యార్మినారు లాగ మార్చెనే
దిల్లునే దీవాను జేసి దీపం పెట్టిందే
ఓ ఓ, గోల్కొండ కోట లాంటి నన్నే
రాణి వాసమల్లె మార్చుకుంటూ
రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచె చేసి

చోరు బజారుకే… నేను జమిందారు
నన్ను దోచే వారే… ఎవరు లేనే లేరు
అనుకునే లోగ నన్ను… చేసేసావే చోరీ
ఓయ్ ఓయ్ ఓయ్, పాత బస్తీకి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను
జడ గంటలతో పడేసావే పోరి, ఓ ఓఓ

సిన్నబోయి కూసున్న… ప్రేమ జంట
సాయంకాల వేళ మరుగు మీద అలిగి
పొద్దుగాల ప్రేమలోన పడి పోయే
జంట కోయిలలే, జంట కోయిలలే

కుదురుగుండదే మనసంతా
కునుకే పట్టదే రేయంతా
తనే లోకమై రోజంతా… తిరిగేస్తూనే ఉంటా
ఎవరు ఏమన్నా వినపడదే
ఎదురు ఎమున్నా కనపడదే
పిల్ల ప్రేమలో పడ్డాక… నను నేనే విడిపోయా

ఓ ఓ, పోలీసుల వేట… డైలీ దొంగాట
మరిచే పోయానే… ఈ పిల్ల బాట బట్టినాక
సమస్య లేకుండా సరెండరై పోయా
నేరమేమి జెయ్యకుండానే ప్రేమ ఖైదీనైపోయా

చోరు బజారుకే… నేను జమిందారు
నన్ను దోచే వారే… ఎవరు లేనే లేరు
అనుకునే లోగ నన్ను… చేసేసావే చోరీ
ఓయ్ ఓయ్ ఓయ్, పాత బస్తీకి నేను పహిల్వాన్
ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను
జడ గంటలతో పడేసావే పోరి, ఓ ఓఓ

అబ్బబ్బా అది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో
దాని జడపై మనసు పడి
మెడకి నడుమకి నడుమ
నాగుపాములాగా కదలాడి
ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి



నూనుగు మీసాల పాట సాహిత్యం

 
చిత్రం: చోర్ బజార్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: లక్ష్మి మేఘన 

నూనుగు మీసాల పోరడు సూడు
ఎదురు సూరీడే
నా మీద నజరు ఏసిండే

రంగుల డబ్బల గుండెను ముంచి
ఎత్తుకపోయిండే
వాని గుండెల్ల దాసిండే

వాని బొమ్మ గీసీ మాటముచ్చట సెప్పుకున్న
గాలిలో వాన్ని సేరితే సాలయ్యో
మల్లొస్తడాని బాట మీద కూసోనున్న
ఎవరన్నా జర సెప్పి పోండయ్యో

నూనుగు మీసాల పోరడు సూడు
ఎదురు సూరీడే
నా మీద నజరు ఏసిండే

రంగుల డబ్బల గుండెను ముంచి
ఎత్తుకపోయిండే
వాని గుండెల్ల దాసిండే

హా, ఎండ పొద్దు ఎక్కుతాంటే
వాని నీడ నిక్కి చూస్తదే
బండి మీద కూసోనున్నా
వాని ఒళ్ళో ఉన్నట్టుంటదే

దస్తీ మెల్ల ఏసుకుంటే
సేతులేసినట్టు ఉంటదే
సెమట సుక్క జారుతుంటే
నా సెంప నిమిరినట్టు ఉంటదే

నేను కండ్లు తిరిగి సోయి తప్పుతున్న
వాని కండ్లార సూస్తుంటే సాలునంటా
వాడు నిమ్మకాయ సోడా తెస్తనంటే
తిండి తిప్పల్నే మానుకుంటా

వాడు పహిల్వాన్ లా నాకు పక్కన ఉంటే
నేను దునియాల ఏడున్నా సల్లగుంటా
దొరసానిలా వాని తోడు ఉంటా
నా పాణంలా సూసుకుంటా

సీమ సిటుకుమన్నా నువ్వు పిలిసినట్టే
ఝల్లుమంది పొల్లగా
నా కాలు నిలవకుంది పిల్లగా

జల్దీగా నువ్వొచ్చి అల్లుకోరా నన్ను
వల్ల కాదు పొల్లగా
నీ మీద గాలి మల్లి మెల్లగా, ఆ ఆ ఆఆ






బచ్చన్ సాబ్ పాట సాహిత్యం

 
చిత్రం: చోర్ బజార్ (2022)
సంగీతం: మదీన్ ఎస్.కె.
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ 
గానం: మంగ్లీ

షోలే సినిమా విడుదలైన
మొదటి ఆటకి
సోలో గానే వెళ్ళిపోయా, ఎక్స్-రోడ్డుకి

ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్
ఎంట్రీ ఇచ్చే సీను
ఆరడుగుల డాన్ చేతిలో మౌత్ ఆర్గాన్
నన్నే చూస్తూ ప్లే చేస్తుంటే, ఫ్లాటయ్యాను

అలా నేను అయ్యాను
అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను
అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను

అలా నేను అయ్యాను
అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను
అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను

ఆయే హే బచ్చను బచ్చను
ఆయే హే అమితాబ్ బచ్చను
జహ వో కడా హోతా
వహా సే షురు హయ్

ఆయే హే బచ్చను బచ్చను
ఆయే హే అమితాబ్ బచ్చను
జహ వో కడా హోతా
వహా సే షురు హయ్

దీవార్ చూస్తూనే అయిపోయా దీవాని
తూఫాన్ వచ్చాకే మొదలైంది కహాని
మనసుతో ఆడిందే షత్రంజీ కి ఖిలాడీ
మాస్ డైలాగ్ తో తలకెక్కే షరాబీ

24 హౌర్స్, అరె 24 ఫ్రేమ్స్
అమితాబ్ తో పెళ్లి డ్రీమ్సు
ముంబై లో తాను హైదరాబాద్ లో నేను
టీనేజిలోనే మ్యారేజ్ కి ట్రై చేశాను

నా ఏడడుగుల రేఖ
అమితాబ్ తో లేక
లైఫ్ అంత అభిమానిగా
సెటిల్ అయిపోయి

అలా నేను అయ్యాను
అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను
అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను

అలా నేను అయ్యాను
అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను
ఫ్యాను ఫ్యాను ఫ్యాను
అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను




కదలదు పాదం పాట సాహిత్యం

 
చిత్రం: చోర్ బజార్ (2022)
సంగీతం: మదీన్ ఎస్.కె.
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ 
గానం: సిద్ శ్రీరాం 

కదలదు పాదం
ఎదురుగ నువు కనబడకుంటే
నిలువదు ప్రాణం
నిమిషము నిను చూడకపోతే

పెదవుల మౌనం చేసెను
నా ఎదలో గాయం
వినబడుతోందా ప్రియురాలా
విరహపు రాగం

ఆ ఆఆ, నేరమెరుగనే నేస్తమా
శిక్ష వేయుట న్యాయమా
కన్ను మూస్తే ఇంతకన్నా
నరకం ఉంటుందా, ఆ ఆ
ఊపిరున్న నిన్ను చూడక అనుభవిస్తున్న

ఆ ఆ, కదలదు పాదం
ఎదురుగ నువు కనబడకుంటే
నిలువదు ప్రాణం
నిమిషము నిను చూడకపోతే

ఆనందం నీవై దూరంగా వెళుతుంటే
దిగులై నాలో నేనై మిగిలిందే
సంతోషం నీవై రానంటూ సెలవంటే
ఆవేదన నాలో నదిలా పొంగిందే

నిన్ను చూపే స్వప్నం
నా నిద్దురనే చిదిమేస్తుంటే
నన్ను దాచిన నీ హృదయం
ఎందుకో వెలివేస్తుంటే
నిన్నటి మన ప్రతీ జ్ఞాపకం
నేడు నన్ను నిలదీస్తుంటే

కదలదు పాదం
ఎదురుగ నువు కనబడకుంటే
నిలువదు ప్రాణం
నిమిషము నిను చూడకపోతే

పెదవుల మౌనం చేసెను
నా ఎదలో గాయం
వినబడుతోందా ప్రియురాలా
విరహపు రాగం టెన్ టు ఫైవ్

నేరమెరుగనే నేస్తమా
శిక్ష వేయుట న్యాయమా
కన్ను మూస్తే ఇంతకన్నా
నరకం ఉంటుందా, ఆ ఆ
ప్రాణమున్నా నిన్ను చూడక అనుభవిస్తున్న




చోరికియారే పాట సాహిత్యం

 
చిత్రం: చోర్ బజార్ (2022)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: స్ఫూర్తి  జితేందర్

నాచోరే నాచోరే… నాచోరే
ఇయ్యాల ఫుల్లుగా దల్లిన ధూమ్ ధమాకే
నాచోరే నాచోరే… నాచోరే
రంగుల్ని జల్లుతు అల్లరి జామ్ డమాకే

హే, మల్లేపల్లి కళ్ళు పడితే తేలిపోద్ది ఒళ్ళు
దాని మీద భంగు పడితే గజ్జెగల్లు గల్లు
హే లొల్లి లొల్లి లొల్లిపెడితే ఊగిపోద్ది దిల్లు
పొల్లగాళ్ళందరికీ రోడ్డే కదా ఇల్లు

చోర్ చోర్ చోర్ చోరికియారే
అరె ప్యార్ ప్యార్ ప్యార్ ప్యారీయయ్యారే

మెరుస్తా ఉన్నా గాని రెడ్డు లైటు
చౌరస్తా చుట్టూ నువ్వే చెక్కర్ కొట్టు
గెలుస్తామనేదాకా ఓపిక పట్టు
అడ్డొస్తే ఎవడన్నా టక్కరు పెట్టు

ఏ, ఖాళీ పీలి బేజారైతే ఏముంటది మామో
అందర్ బాహర్ అయ్యేదేరా లైఫే పెద్ద గేము
మింగాలనే సూత్తుంటాది పచ్ఛా నోటు పాము
అరె పుంగీ బజాయించి మరీ నిచ్చనెక్కేద్దాము

చోర్ చోర్ చోర్ చోరికియారే
అరె ప్యార్ ప్యార్ ప్యార్ ప్యారీయయ్యారే

ఏడిస్తే ఎదిగినోని ఆస్తి రాదు
నవ్వేస్తే దాసుకున్న సొమ్మేంపోదు
అరిస్తే ఆస్తిమాన్ ఊడిపడదు
జడిస్తే ఈ జమీన్ అయ్యో అనదు

హే, ప్రేమించాలి మచ్చా మనం చేసే ప్రతి జాబు
పొట్టనిండా పనేదైనా మనకు అమ్మ బాబు
చోటా బడా ప్రతీ వాడు దోచేటోడే జేబు
పొట్ట కొట్టకుండా ఉంటే చాలు అదే రాక్ బాబు

చోర్ చోర్ చోర్ చోరికియారే
అరె ప్యార్ ప్యార్ ప్యార్ ప్యారీయయ్యారే
అరె చోర్ చోర్ చోర్ చోరికియారే
మేరా దిల్ దిల్ దిల్కు చోరికియారే
చో చో చోర్ చోర్ చోర్ చోరికియారే
మేరా దిల్ దిల్ దిల్కు చోరికియారే

No comments

Most Recent

Default