చిత్రం: ఆటగాడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్.పి. శైలజ నటీనటులు: యన్.టి.రామారావు, శ్రీదేవి దర్శకత్వం: టి. రామరావు నిర్మాత: జి. రాజేంద్ర ప్రసాద్ విడుదల తేది: 24.04.1980
Songs List:
చీమ కుట్టిందా పాట సాహిత్యం
చిత్రం: ఆటగాడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు చీమ కుట్టిందా-చిమచిమ లాడిందా చిచ్చు పెట్టిందా - చిటపట లాడిందా ఆ చిమచిమా ఈ చిటపటా ఈ దెబ్బతో గోవిందా హరి చరణం: 1 అమ్మదొంగా అగ్గిలేని మంటపుట్టిందా భగ్గుమంటోందా అది యిక్కడ ఆని చెప్పడానికి సిగ్గుగా వుందా ఏమి కుట్టిందమ్మడూ ఏడ కుట్టింది ఏడకెక్కింది నీకు ఏడుపొచ్చింది చురకల వైద్యం చేస్తా ఛూఛూ మంత్రం వేస్తా చుక్కల వేళకు పక్కకువస్తే చక్కని మందొకటిస్తా ఠక్కున రోగం కుదిరిస్తా చరణం: 2 ఆరుబైట అందమంతా కందినట్టుందా అయ్యో చిందినట్టుందా అది అల్లరై ఒక జాతరై అవిరౌతోందా ఏడ కుట్టిందమ్మడూ - ఎందుక్కుట్టింది వయసుకు వైద్యం చేస్తా మనసుకు మంత్రం వేస్తా వెన్నెలవేళకు కౌగిలికొ స్తే ఇయ్యని మందొకటిస్తా తియ్యని మందొకటిస్తా
సిలకమ్మ గూటిలో పాట సాహిత్యం
చిత్రం: ఆటగాడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: సిలకమ్మ గూటిలో సోటుందిరో సోటుందిరో దాని అలకాపులకా నాకు తెలిసిందిరో గోరింక గుండెలో సోటుందిరో సోటుందిరో దాని వలపూ పిలుపూ నాకు తెలిసిందిరో చరణం: 1 అవునుకు కాదంటే అది ఆడపిల్ల రోయ్ కాయకు పండంటే అది కన్నెపిల్ల రోయ్ పొమ్మంటే రమ్మనిలే దాని బాస వద్దన్నా ముద్దేలే దాని వరస రవ్వంటి పిల్లగాడు ఏమన్నా అందమే పువ్వంటి పిల్లతోడు పొమ్మన్నా సొంతమే అందమంతా గూడు అల్లుకుంటా, చాటు చేసుకుంటా, ఊసులాడుకుంటా, బాస చేసేసి నీతోడు గుంటానులే చరణం: పగలే గిలి అంటే వాడు పడుచువాడురోయ్ ఎండే వెన్నెల అంటే వాడు గడుసువాడురోయ్ కంటిచూపు కానరాని కౌగిలింత ఊపు చూస్తే ఊరంతా సలపరింత చిలకంటి చిన్నది అలిగినా అందమే చిగురంత పొగరెక్కి ఎగిరినా బంధమే మల్లెతీగై నీన్నే అల్లుకుంటా కంటిరెప్పగుంటా, జంటా కట్టుకుంటా చుక్క ఎలుగులో నీ నీడగుంటానులే
గుద్దుతా నీ యవ్వా పాట సాహిత్యం
చిత్రం: ఆటగాడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి గుద్దుతా నీ యవ్వ గుద్దుతా - ముక్కుమీద గుద్దుతా మూతిమీద గుద్దుతా - గుద్దానంటే గూబ గుయ్యంటది యేశానంటే ఈపు సాపవుతది గుద్దుతా నీయవ్వ గుద్దుతా ముక్కుమీద గుద్దుతా మూతిమీద గుద్దుతా - గుద్ధానంటే గూబ గుయ్యంటది యేశానంటే సెంప పెళ్ళంటది చరణం: 1 పొగరెక్కి నామీద ఎగిరెగిరి పడ్డాడా రెంటికీ చెడతాడు రేవడు కన్నెత్తి ఎవడైనా నియంక చూశాడా గుద్దుకే చచ్చినా లేవడు అట్టే నువు నీల్గావంటే నీలిమందు కొట్టానంటే మూడు చెరువులా నువ్వు మునగాలా మునిగి తేలి నాకోసం ఎతకాల చరణం: 2 సింగారంగా నువ్వు సీ అన్నాగాడిదా ఫైనెల్లో తప్పదే సూడిద ఏడేళ్ళనించి నువ్వు ఈ కూతే కూస్తున్నా ఏమయ్యి సచ్చింది బూడిద ఆమాట అన్నావంటే అగ్గిరాముడయ్యానంటే మడతేసి కడవలో ఉడకేసా ఉడకేసి మడుగులో ఉతికేసా
జిల్ జిల్ జిలేబి పాట సాహిత్యం
చిత్రం: ఆటగాడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: టకుచికు టకుచికు జిల్ జిల్ జిల్ జిలేబి నా గులాబీ నే నాడనా ఆడి పాడనా టకుచికు టకుచికు జిల్ జిల్ జిల్ జిలేబి - నీ గులాబీ నే నాడనా ఆడీ పాడనా చరణం:1 పరువంలో ఒక దరువు వున్నది నీ పదును చూసి నను పాడమన్నది అందంలో ఒక అలక వున్నది నీ నడకచూసి జత కలవమన్నది అదే నా పాటగా - ఆడుకో నీ ఆటగా ఎడాపెడా నువ్వాడగా - ఎగాదిగానే చూడగా అల్లరి ఆటకు - అందని పాటకు పల్లవి దొరకని పిల్లది ఎవరని అడగనా నువ్వెవరని చరణం: 2 ఈడు అన్నది చిలిపిగుంటది తోడువుంటె అది వలపు అంటది చూపు అన్నది చురుకుగుంటది విచ్చుక త్తిలా గుచ్చుకుంటది కదలిరా ఆ చుక్కలా నిలిచిపో నాప్రక్కనా గందరగోళం ముదరగా చందరగోళం అదరగా రెపరెపలాడిన రెప్పల సందున గుబగుబలాడిన గుండెల చప్పుడు - యిప్పుడే నే చెప్పనా
నీ చూపు పాట సాహిత్యం
చిత్రం: ఆటగాడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: మాధవపెద్ది రమేష్ , యస్.పి. శైలజ నీ చూపు
ఏకో నారాయణ పాట సాహిత్యం
చిత్రం: ఆటగాడు (1980) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: ఏకో నారాయణా ఏలుకోరా మోహనా యెన్నెలంటి మగువుంది యేసుకుంటే మధువుంది చేసుకోర పారాయణా నవమోహనా మోహనాయనమః చరణం: 1 లావాదేవీలెన్నో వున్నదాన్ని దేవదేవినై నీతోవుంటాస్వామీ పులకరింత పెంచుకో- పూజలెన్నో చేసుకో మతివుంటే మతికీ ఒక కుతివుందని తెలుసుకో మనసునే మధురగా - మమతలే యమునగా మలచి నీ కోసమే వలచి వచ్చానురా పక్కనుంటే శ్రీదేవి - ఎందుకింక దేవదేవి వేపకాయ తీపాయెనా నవమోహనా చరణం: 2 అవతారాలెన్నెన్నో ఎత్తినోణ్ణి సరసం విరసం తెలిసిన సాములోర్ని ఆరగింపు సేవకు అందముంది నంచుకో పవ్వళింపు సేవకు పడుచుపువ్వులేరుకో జై మోహనాయనమః ముద్దులన్ని మూటగా ముడుపులే కట్టినా పొద్దు వాలిపోయినా వద్ద చేరవేమిరా పక్కనుంటె శ్రీదేవి - ఎందుకింక భూదేవి వేటకాస్త ఆటాయెనా నవమోహనా జై మోహనాయనమః
No comments
Post a Comment