చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు నటీనటులు: సావిత్రి, శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం, బేబీ శ్రీదేవి దర్శకత్వం: వి. రామచంద్రరావు నిర్మాత: జి.వి.యస్.రాజు విడుదల తేది: 25.02.1972 (శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా శోభన్ బాబు గారితో ఈ సినిమాలో నటించింది)
Songs List:
ఎంత బాగా అన్నావు పాట సాహిత్యం
చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి.సుశీల & బృందం పల్లవి: ఎంత బాగా అన్నావు.. ఎంత బాగా అన్నావు.. ఎవ్వరు నేర్పిన మాటరా వేలడైన లేవురా.. వేదంలా విలువైన మాట ఎంత బాగా అన్నావు.. ఎవ్వరు నేర్పిన మాటరా వేలడైన లేవురా.. వేదంలా విలువైన మాట ఎంతబాగా అన్నావు.. చరణం: 1 ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..అ జారని వానల జల్లులూ.. ఊరికే ఉరిమే మబ్బులు జారని వానల జల్లులూ.. ఊరికే ఉరిమే మబ్బులు ఆ మబ్బులెందుకూ..? ఊరని తేనేల సోనలూ.. ఊరికే పూచే పూవులు.. ఊరని తేనేల సోనలూ.. ఊరికే పూచే పూవులు.. ఆ పూవులెందుకు..? ఉతుత్తి మాటలు అనవచ్చా.. మాటలు చేతలు కావాలి ఆ చేతలు పదుగురు మెచ్చాలి.. నూరేళ్ళు బతకాలీ.. నూరేళ్ళూ బతకాలీ.. ఎంత బాగా అన్నావు.. ఎవ్వరు నేర్పిన మాటరా వేలడైన లేవురా.. వేదంలా విలువైన మాట ఎంతబాగా అన్నావు.. చరణం: 2 ఆఆఆ ఆఆఅ మ్మ్..ఆ...ఆ..ఆ.. మ్మ్ మ్మ్ ఆ...ఆ...ఆ అన్నమాట నిలిపావని.. అపుడే ఘనుడైనావనీ ముందే మురిసే మీ నాన్నా.. ఆ ముసి ముసి నవ్వులు చూడరా... కన్నా..ఆ..కన్నీరు కాదురా.. కన్నవారి దీవెనరా... ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా.. ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా నూరేళ్ళు బతకాలీ.. నూరేళ్ళూ బతకాలీ.. శ్రీరామ రక్షా...శ్రీరామరక్షా... ఎంత బాగా అన్నావు.. ఎవ్వరు నేర్పిన మాటరా వేలడైన లేవురా.. వేదంలా విలువైన మాట ఎంత బాగా అన్నావు..
ఎందుకమ్మా ఆపుతావు పాట సాహిత్యం
చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: గానం: ఘంటసాల ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము
ఎప్పుడూ మీ పాఠాలంటే పాట సాహిత్యం
చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు
ఎవరైనా చూశారా ఏమనుకుంటారు పాట సాహిత్యం
చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత ఎవరైనా చూశారా ఏమనుకుంటారు
మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు పాట సాహిత్యం
చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఎల్.ఆర్.ఈశ్వరి మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు నా మనసే లాగేసిండు.. లగ్గమెప్పుడురా.. మాఁవా .. అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా కాఁవమ్మ సెప్పవే.. రాఁవమ్మ సెప్పవే రత్తమ్మ సెప్పవే.. అత్తమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా చరణం: 1 సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే.. సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే.. సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే.. సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే.. సిగరుల్లో.. సిగురుల్లో.. సిగురుల్లో.. మాటేసి కన్నుగీటిండే జివ్వున పానాలు తోడేసిండే.. ఎప్పుడ్రా మాఁవా అంటే.. సంకురాతిరి పొయ్యేదాకా.. మంచి గడియే లేదన్నాడే... ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా ఎల్లమ్మ సెప్పవే.. మల్లమ్మ సెప్పవే పుల్లమ్మ సెప్పవే.. బుల్లెమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా.. చరణం: 2 ఊరి సెరువులో నే నీదులాడుతుంటే నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే ఊరి సెరువులో నేనీదులాడుతుంటే నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే... బుడుంగున... బుడుంగున బుడుంగున మీదికి తేలిండే నా తడికొంగు పట్టుకుని లాగిండే... ఎప్పుడురా మాఁవా అంటే... శివరాతిరి ఎల్లేదాకా సుబలగ్గం లేదన్నాడే... ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా పున్నమ్మ సెప్పవే.. గున్నమ్మ సెప్పవే కన్నమ్మ సెప్పవే.. సిన్నమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా చరణం: 3 కందిసేలల్లో కావలి కాసేసి సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే కందిసేలల్లో కావలి కాసేసి సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే.. గబుక్కున గుబుక్కున గబుక్కున కళ్లు రెండు మూసిండే రివ్వున వాటేసి నవ్వేసిండే ఏందిరా మాఁవా అంటే కోడికూసి కూయంగానే తాళి కడతానన్నాడే.. ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా అమ్మమ్మ సెప్పవే.. అయ్యమ్మ సెప్పవే పెద్దమ్మ సెప్పవే.. పిన్నమ్మ సెప్పవే ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా.. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు కోడి కూసి కురియంగానే తాళి కడతానన్నాడే ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా..
సద్దుమణగనీయవోయి పాట సాహిత్యం
చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. జానకి సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు
బూట్ పాలిష్ పాట సాహిత్యం
చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం సా...రీ....సరిగదా మా...దా...మమదా పా పా పా పా పాలిష్ పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు
No comments
Post a Comment